|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: క్రిష్ 4 సైడ్ చేసిన హృతిక్.. టాలీవుడ్ డైరెక్టర్ తో హాలీవుడ్ మూవీ ఫిక్స్!

Published: 06-03-2026, 1:05 AM
షాకింగ్: క్రిష్ 4 సైడ్ చేసిన హృతిక్.. టాలీవుడ్ డైరెక్టర్ తో హాలీవుడ్ మూవీ ఫిక్స్!
  • దర్శకుడు బాబీ టాలీవుడ్ నుండి బాలీవుడ్ కి, హృతిక్ రోషన్ తో భారీ సినిమాకు సన్నాహాలు!
  • హృతిక్ రోషన్ కోసం హాలీవుడ్ రేంజ్ కథ సిద్ధం చేసిన బాబీ, కోన వెంకట్, చక్రవర్తి రెడ్డి!
  • చిరంజీవితో సినిమా తర్వాత వెంటనే హృతిక్ రోషన్ సినిమాను పట్టాలెక్కించేందుకు బాబీ ప్లాన్!
  • క్రిష్ 4 సినిమాను పక్కన పెట్టి బాబీ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హృతిక్ రోషన్!

టాలీవుడ్ డైరెక్టర్ బాలీవుడ్ స్టార్ తో సినిమా అంటే మాటలు కాదు. దర్శకుడు బాబీ ఇప్పుడు హృతిక్ రోషన్ తో ఒక భారీ ప్రాజెక్టును ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

బాలీవుడ్ లో టాలీవుడ్ సత్తా చాటేందుకు బాబీ రెడీ!

Hrithik- Bobby: దర్శకుడు బాబీ కొల్లి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. పవర్ సినిమాతో దర్శకుడిగా మారిన బాబీ ఆ తరువాత వరుసగా భారీ సినిమాలు చేస్తూ వస్తున్నాడు. కమర్షియల్ సినిమాలు చేయడంలో మనోడు టాప్. పవన్ కళ్యాణ్ తో సర్దార్ గబ్బర్ సింగ్, వెంకటేష్- నాగ చైతన్యతో వెంకీ మామ లాంటి సినిమాలు చేశాడు ఈ దర్శకుడు. ఇక మెగాస్టార్ చిరంజీవితో చేసిన వాల్తేరు వీరయ్య సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.

యాక్షన్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా ఏకంగా రూ.250 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా తరువాత బాలకృష్ణతో డాకు మహారాజ్ సినిమా చేశాడు ఈ దర్శకుడు. సంక్రాంతి సీజన్ లో విడుదలైన ఈ సినిమా కమర్షియల్ సక్సెస్ సాధించింది. ఇప్పుడు మరోసారి మెగాస్టార్ చిరంజీవితో గ్యాంగ్ స్టార్ బ్యాక్డ్రాప్ లో పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు బాబీ.

హృతిక్ కోసం హాలీవుడ్ రేంజ్ స్టోరీ లైన్ సిద్ధం!

ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది. ఇదిలా ఉంటే, దర్శకుడు బాబీ బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్(Hrithik- Bobby) కోసం ఒక కథను వినిపించాడట. ఆ కథ వినగానే హృతిక్ ఎగిరిగంతేశాడట. ఆలాగే దర్శకుడు బాబీపై ప్రశంసలు కురిపించాడట. ఈ విషయాన్ని ప్రముఖ రచయిత కోన వెంకట్ అధికారికంగా చెప్పాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కోన వెంకట్ ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ.. “బాబీ హృతిక్ తో ఓ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా కథను నేను, బాబీ, చక్రవర్తి రెడ్డి కలిసి తయారుచేస్తున్నాం.

క్రిష్ 4 ని హోల్డ్ లో పెట్టిన హృతిక్ రోషన్!

హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు బాబీ. బాబీ చెప్పన కథ వినగానే హృతిక్ చాలా ఎగ్జైట్ అయ్యాడు. అసలు ఎం తింటున్నావ్, ఎమ్ ఆలోచిస్తున్నావ్ అంటూ బాబీపై ప్రశంసలు కురిపించాడు” అంటూ చెప్పుకొచ్చాడు కోన వెంకట్. దీంతో, కొన వెంకట్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. మెగాస్టార్ సినిమా కంప్లీట్ అవగానే హృతిక్ రోషన్ తో సినిమాను మొదలుపెట్టనున్నాడు బాబీ. ఇక హృతిక్ రోషన్ సైతం తాను డైరెక్ట్ చేస్తున్న క్రిష్ 4ని పక్కన పెట్టి మరీ ఈ సినిమా చేసేందుకు సిద్ధం అవుతున్నాడట.

కోన వెంకట్ చేసిన ప్రకటన టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. మెగాస్టార్ సినిమా తర్వాత బాబీ ఈ సినిమాను పట్టాలెక్కిస్తాడని సమాచారం. మరిన్ని వివరాల కోసం వేచి చూడండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.