|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పార్కింగ్ వివాదంలో మహారాణి హీరోయిన్ సోదరుడి హత్య- ఇద్దరి అరెస్ట్- తమిళ సినిమాకు మించి తలపించిన ఘటన!

Published: 07-08-2025, 11:48 PM
పార్కింగ్ వివాదంలో మహారాణి హీరోయిన్ సోదరుడి హత్య- ఇద్దరి అరెస్ట్- తమిళ సినిమాకు మించి తలపించిన ఘటన!

బాలీవుడ్ నటి హుమా ఖురేషి సోదరుడి హత్యతో ఢిల్లీలో కలకలం రేగింది. పార్కింగ్ వివాదం రక్తపాతానికి దారితీసింది. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

Key Points

1

ఢిల్లీలో పార్కింగ్ వివాదం కారణంగా హుమా ఖురేషి సోదరుడు ఆసిఫ్ ఖురేషీ హత్యకు గురయ్యాడు.

2

ఈ ఘటనలో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

4

హుమా ఖురేషీ నుండి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు.

పార్కింగ్ వివాదం: ఓ హీరోయిన్ సోదరుని హత్య

తమిళంలో పార్కింగ్ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. పార్కింగ్ విషయం కారణంగా ఇద్దరు ఏ స్థాయిలో గొడవ పడతారో, ఎక్కడి వరకు వెళ్తారో చూశాం. అలాంటి ఘటన నిజ జీవితంలో చోటు చేసుకుంది. ఇంకా చెప్పాలంటే సినిమాలో కంటే దారుణంగా ఇక్కడ ఓ వ్యక్తిని హత్య చేశారు.

అందులోను ఆ వ్యక్తి ప్రముఖ హీరోయిన్ సోదరుడు కావడం మరింత వైరల్‌గా మారింది. బాలీవుడ్ హీరోయిన్ హుమా ఖురేషికి కజిన్ సోదరుడు అయిన ఆసిఫ్ ఖురేషీ (42) హత్యకు గురయ్యాడు. గురువారం (ఆగస్ట్ 7) రాత్రి ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో చోటు చేసుకున్న పార్కింగ్ స్థలం వివాదం కారణంగా ఆసిఫ్‌ను హత్య చేశారు.

ఈ కేసులో ఇద్దరు నిందితులును ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసి హత్యా ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. గురువారం రాత్రి 11 గంటల సమయంలో తన ఇంటి ప్రధాన ద్వారానికి దూరంగా లేదా పక్కకు ద్విచక్ర వాహనాన్ని పార్క్ చేయాలని ఇద్దరు వ్యక్తులను ఆసిఫ్ కోరాడని, ఇది వారి మధ్య వాగ్వాదానికి దారితీసిందని, అనంతరం ఆ విషయం భౌతికంగా మారిందని సమాచారం.

ఇద్దరు నిందితుల అరెస్టు

ఈ గొడవ తీవ్రతరం కావడంతో ఆ ఇద్దరు వ్యక్తులు కలిసి ఆసిఫ్ ఖురేషీని హత్య చేశారు. ఈ ఘటనపై హుమా ఖురేషి తండ్రి, ఆసీఫ్ మేనమామ సలీం ఖురేషీ మాట్లాడుతూ.. “ఇద్దరు వ్యక్తులు ఇంటి ముందు స్కూటర్ పార్క్ చేశారు. దాన్ని పక్కకు తరలించాలని, ప్రవేశ ద్వారానికి అడ్డుగా పెట్టకండని ఆసిఫ్ కోరారు. దీంతో వాగ్వాదం ఫిజికల్ అయింది. వారిద్దరూ కలిసి నా మేనల్లుడిని హత్య చేశారు” అని చెప్పినట్లు ఎన్డీటీవీ పేర్కొంది.

ఆసిఫ్ ఖురేషీ దేశ రాజధానిలో చికెన్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. పార్కింగ్ విషయంలో ఇరుగుపొరుగు వారు కూడా గతంలో అతనితో గొడవ పడ్డారని అతని భార్య సైనాజ్ ఖురేషీ తెలిపింది. వాగ్వాదంలో పదునైన ఆయుధాలతో దాడి చేసిన ఆసిఫ్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

హుమా ఖురేషి స్పందన

ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై నటి హుమా ఖురేషీ నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు. ఇదిలా ఉంటే, బాలీవుడ్ హీరోయిన్ హుమా ఖురేషీ మహారాణి ఓటీటీ సిరీస్‌తో ఎంతో పేరు తెచ్చుకుంది. ఈ సిరీస్‌తోనే సౌత్‌లో కూడా హుమా ఖురేషీ పాపులారిటీ సాధించింది.

అలాగే, రజనీకాంత్ కాలా సినిమాలో ఓ హీరోయిన్‌గా హుమా ఖురేషి నటించింది. ఇందులో రజనీకాంత్‌కు ప్రేయసీగా యాక్ట్ చేసింది హుమా. ఇక హిందీలో మహారాణితోపాటు బద్లాపూర్, ఇష్కియా, జానీ ఎల్ఎల్‌బీ2 సినిమాలు హుమా ఖురేషీకి పేరు తెచ్చిపెట్టాయి.

పార్కింగ్ వివాదం అనే చిన్న విషయం ఓ ప్రాణాన్ని బలితీసుకున్న ఈ ఘటన సమాజానికి తీవ్ర హెచ్చరిక. చిన్న విషయాలను పెద్దవిగా మార్చుకోకుండా జాగ్రత్త వహించాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.