|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బుల్లితెర నటిపై చాకుతో భర్త దాడి

Published: 12-07-2025, 12:51 AM
బుల్లితెర నటిపై చాకుతో భర్త దాడి

హనుమంతనగర పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ బుల్లితెర నటిపై ఆమె భర్త చాకుతో దాడి చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. మద్యం సేవనం, ఆలస్యంగా ఇంటికి రావడం వంటి కారణాలతో దంపతుల మధ్య తరచుగా గొడవలు జరిగేవి.

Key Points

1

బుల్లితెర నటి శృతిపై భర్త అమరేశ్‌ చాకుతో దాడి.

2

దంపతుల మధ్య గొడవలు, మద్యపానం కారణంగా వివాదం.

4

పోలీసులు అమరేశ్‌ను అరెస్ట్ చేసి విచారణ ప్రారంభించారు.

దంపతుల మధ్య గొడవలు

బనశంకరి: అనుమానంతో బుల్లితెరనటిపై భర్త చాకుతో దాడికి పాల్పడిన ఘటన హనుమంతనగర పోలీస్‌స్టేషన్‌ పరిదిలో ఆలస్యంగా వెలుగుచూసింది.  మంజుల అలియాస్‌ శృతి  20 ఏళ్ల క్రితం ఆటోడ్రైవర్‌ అమరేశ్‌(49) అనే వ్యక్తిని  వివాహం చేసుకుంది.  దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.   శ్రీనగర మునేశ్వరబ్లాక్‌లో నివాసం ఉంటున్నారు.

శృతి  రాత్రిసమయంలో  ఆలస్యంగా ఇంటికి వచ్చేది. మద్యం సేవిస్తుండటంతో దంపతుల మధ్య గొడవ జరిగేది. కొద్దినెలలుగా   శృతిపై అనుమానం పెంచుకున్నాడు. ఇటీవల కుటుంబ పెద్దలు ఇద్దరికీ సర్దిచెప్పారు. కానీ శృతిలో మార్పురాలేదు. కోపోద్రిక్తుడైన అమరేశ్‌ ఈనెల 4వ తేదీ పిల్లలు కాలేజీకి వెళ్లిన అనంతరం చాకుతో శృతిపై ఇష్టానుసారం దాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన  శృతి  విక్టోరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. హనుమంతనగర పోలీసులు అమరేశ్‌ను అరెస్ట్‌చేసి విచారణ చేపట్టారు.

చాకుతో దాడి

పోలీసుల విచారణ

ఈ ఘటనతో బుల్లితెర నటీనటుల భద్రతపై ప్రశ్నలు ఎదురవుతున్నాయి. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. శృతి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.