|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

హైదరాబాద్‌లో పెళ్లి పేరుతో ఘోరం! ఫస్ట్ నైట్‌ రోజే భార్యకు నరకం!!

Published: 05-04-2026, 1:05 PM
హైదరాబాద్‌లో పెళ్లి పేరుతో ఘోరం! ఫస్ట్ నైట్‌ రోజే భార్యకు నరకం!!
  • కూకట్‌పల్లిలో షాకింగ్ ఘటన: మొదటి రాత్రి భార్యపై అత్యాచారం చేయించిన భర్త.
  • మహిళను పెళ్లి చేసుకునేందుకు మతం మారినట్లు నటించిన నిందితుడు నవాజ్.
  • మత్తుమందు ఇచ్చి లైంగికంగా వేధించారని బాధితురాలు ఆరోపణ.
  • ఆస్తులు అమ్మేసి పారిపోయాడని, వేధింపులకు గురి చేశాడని బాధితురాలు ఫిర్యాదు.

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఒక భయంకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లి చేసుకుంటానని మతం మార్చుకున్న వ్యక్తి, మొదటి రాత్రే భార్యపై అత్యాచారం చేయించాడు. బాధితురాలు ఈ విషయాన్ని వెల్లడించడంతో కలకలం రేగింది.

మొదటి రాత్రి జరిగిన దారుణం

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఒక కలవరపరిచే సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళను పెళ్లి చేసుకున్నాడో వ్యక్తి. అందుకోసం మతం మారినట్టుగా నటించాడు. పెళ్లి చేసుకున్న తర్వాత మెుదటి రాత్రి రోజున భార్యను రేప్ చేయించాడు. ఈ విషయాన్ని బాధితురాలే బయట చెప్పుకున్నది. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

నవాజ్ అనే వ్యక్తి దుకాణం అద్దె విషయంలో ఒక మహిళను తరచూ సంప్రదించాడు. ఆమెతో పరిచయం పెంచుకుని.. మెల్ల మెల్లగా.. దగ్గరయ్యాడు. కొన్ని రోజులకు పెళ్లి ప్రతిపాదన చేశాడు. అంతేకాదు తనను అంగీకరించేందుకు హిందూ మతంలోకి మారినట్లు నటించాడని ఆ మహిళ తెలిపింది. తన పేరును నవదుర్గగా మార్చుకుని, 2025 జూన్‌లో తనను వివాహం చేసుకున్నాడని మహిళనే ఈ విషయాలు చెప్పుకొచ్చింది.

మతం మార్పిడి పేరుతో మోసం

పెళ్లయిన మొదటి రోజే.. నిందితుడు మరో నలుగురితో కలిసి తనకు మత్తుమందు ఇచ్చి లైంగికంగా వేధించాడని బాధితురాలు ఆరోపించింది. ఇదంతా ఫస్ట్ నైట్ రోజున జరిగినట్టుగా బాధితురాలు మీడియా ముందుకు వచ్చి వాపోయింది. దీంతో ఈ వార్త సెన్సెషనల్ అయింది. నిందితుడు, అతని కుటుంబ సభ్యులు తనను బెదిరించారని, బలవంతంగా మతం మార్పించారని కూడా ఆరోపణలు చేసింది. బీఫ్ తినమని ఒత్తిడి చేశారని, నిరంతరం వేధింపులకు గురిచేశారని పేర్కొంది.

అయితే నిందితుడు పారిపోయే ముందు తన ఆస్తులను, కుటుంబ ఆస్తులను కూడా అమ్మేశాడని ఆ మహిళ ఆరోపించింది. తనను పెళ్లి చేసుకునేందుకు మతం మారినట్టుగా యాక్టింగ్ చేశాడని చెప్పుకొచ్చింది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, దర్యాప్తు కొనసాగుతోంది.

పోలీసులకు బాధితురాలి ఫిర్యాదు

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు.

హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు. Read More

ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు పరారీలో ఉండగా, బాధితురాలు తనకు జరిగిన అన్యాయంపై పోరాడుతోంది. ఈ కేసులో ఎలాంటి నిజాలు వెలుగు చూస్తాయో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.