
📌 Key Points
- మూసీ నది ఒడ్డున రూ. 700 కోట్లతో ఓంకారేశ్వర ఆలయ పునర్నిర్మాణం.
- 8 ఎకరాల్లో 1400 ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయాన్ని అభివృద్ధి చేయనున్నారు.
- ముఖ్య ఆలయంలో లలితామహాత్రిపురసుందరి, వీరభద్ర, గణపతి ఆలయాలు ఉంటాయి.
- మూసీ నది మధ్యలో 108 అడుగుల శివుడి విగ్రహం ఏర్పాటు కానుంది.
తెలంగాణ ప్రభుత్వం మూసీ నది ఒడ్డున ఓంకారేశ్వర ఆలయాన్ని పునర్నిర్మించనుంది. దాదాపు రూ.700 కోట్లతో 8 ఎకరాల్లో ఈ నిర్మాణం జరగనుంది. దీనిలో భాగంగా 108 అడుగుల శివుడి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు.
మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు వివరాలు
మూసీ రివర్ ప్రాజెక్టులో భాగంగా మూసీ తీరం గండిపేట – మంచిరేవులలోని చారిత్రక వీరభద్రస్వామి ప్రాంగణంలో శ్రీ మచిలేశ్వర స్వామి, శ్రీ ఓంకారేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 14 వందల చరిత్ర కలిగిన ఈ పురాతన ఆలయాన్ని…. 8 ఎకరాల్లో దాదాపు రూ. 700 కోట్లతో పునర్నిర్మాణం, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు.
ఈ ఓంకారేశ్వర దేవాలయ నిర్మాణ పనులను రెండేళ్లలో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ భారీ శివాలయానికి అనేక ప్రత్యేకతలున్నాయి. ముందు భాగంలో 91 అడుగుల ఎత్తు, 9 అంతస్తుల్లో మహా రాజగోపురం నిర్మిస్తారు. ఆలయ సముదాయం 2 ప్రాకారాలతో, నాలుగు దిక్కుల 8 భారీ రాజ గోపురాలను ప్రతిష్టిస్తారు.
ఓంకారేశ్వర ఆలయ ప్రత్యేకతలు
కర్ణాటకలోని శృంగేరి శారదాపీఠం జగద్గురువుల సూచనలతో ఆలయ నిర్మాణ శైలి ఖరారైంది. ప్రధాన ఆలయ ప్రాంగణంలో లలితామహాత్రిపురసుందరి, వీరభద్ర, గణపతి, సుబ్రహ్మణ్యస్వామి ఉప ఆలయాలుంటాయి. ప్రధాన గర్భాలయం ఎత్తు 64 అడుగులుగా ఉండనుంది. 44 స్తంభాలతో మహా మండపం నిర్మాణం కానుంది. మూసీ నది మధ్యలో 108 అడుగుల ఎత్తైన శివుడి విగ్రహం ఏర్పాటు చేస్తారు.
ఒకప్పుడు తెలంగాణలో నాగరికతకు జీవనాడిగా ఉన్న మూసీ నది ఉంది. కానీ దశాబ్దాల తరబడి నిర్లక్ష్యంతో పాటు కాలుష్యానికి గురైంది. ఇదే క్రమంలో మూసీ పరివాహక ప్రాంతంలో అనేక నిర్మాణాలు వెలిశాయి. వీటిని పునరుద్ధరించడానికి గతంలో ప్రయత్నాలు జరిగినప్పటికీ… విఫలమయ్యాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ నదిని అభివృద్ధి చేయాలని బలంగా భావిస్తోంది. గోదావరి జలాలను మూసీలో పారించేలా ప్రణాళికలను సిద్ధం చేసింది.
మూసీ నది అభివృద్ధికి ప్రభుత్వ చర్యలు
మూసీ రివర్ ఫ్రంట్ ను ఆర్థిక, సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక కార్యకలాపాల కేంద్రంగా మార్చాలని సర్కార్ భావిస్తోంది. పర్యావరణ సమస్యలకు కూడా చెక్ పెట్టాలని… మూసీ నుంచి వచ్చే కాల్యుష్య బారి నుంచి నల్గొండ జిల్లాను కాపాడాలని చూస్తోంది.
మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More
మూసీ నది అభివృద్ధి, ఆలయ పునర్నిర్మాణం తెలంగాణ ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకంగా మారాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్ ఆధ్యాత్మికంగా మరింత అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు.


