
తెలుగు టెలివిజన్‌లో ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ 12వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ సందర్భంగా విడుదలైన ప్రోమోలో అనేక ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. హైపర్ ఆది, అనసూయ, రష్మి వంటి వారు ఈ ప్రోమోలో కనిపించారు.
Key Points
హైపర్ ఆది గురువు అదిరే అభి కాళ్ళు కడిగాడు.
అనసూయ రష్మిని కౌగిలించుకుంది, రష్మి భావోద్వేగానికి గురైంది.
సుధీర్, రష్మి లవ్ స్టోరీని హైపర్ ఆది హాస్యంగా ప్రస్తావించాడు.
జబర్దస్త్ 12వ వార్షికోత్సవం
జబర్దస్త్.. తెలుగు టెలివిజన్ చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోయే ఓ కామెడీ షో. ప్రముఖ ఛానెల్ ఈటీవీలో ఎప్పుడో 12 ఏళ్ల కిందట ప్రారంభమై ఇప్పటికే విజయవంతంగా ముందుకు సాగుతోంది. ఇప్పుడీ 12 ఏళ్ల సెలబ్రేషన్స్ సందర్భంగా ఓ ప్రోమోను రిలీజ్ చేశారు. అందులో అప్పటి యాంకర్లు రష్మి, అనసూయ.. జడ్జీలు నాగబాబు, అప్పటి కమెడియన్లందరూ వచ్చారు.
జబర్దస్త్ పేరుతో ఈటీవీలో ఇప్పటికీ ప్రతీ వారం వచ్చే కామెడీ షోకి తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. ఇందులోని కామెడీ స్కిట్లు నవ్వులు పూయిస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ షో మొదలై 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వచ్చే శుక్ర, శనివారాల్లో (ఆగస్ట్ 8, 9) స్పెషల్ షోని ఈటీవీ ప్లాన్ చేసింది.
దీనికి సంబంధించిన ప్రోమో మంగళవారం (ఆగస్ట్ 5) రిలీజ్ చేశారు. ఇందులో జబర్దస్త్ మొదలైనప్పుడు టీమ్ లీడర్లుగా ఉన్న అదిరే అభి, చమ్మక్ చంద్ర, రాకెట్ రాఘవ, చలాకీ చంటి, ధనాధన్ ధనరాజ్ లాంటి వాళ్లతోపాటు జడ్జి నాగబాబు కూడా తిరిగి వచ్చాడు. అంతేకాదు ఈ షో ద్వారానే యాంకర్లుగా పేరు సంపాదించిన అనసూయ, రష్మి కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఎమోషనల్ సన్నివేశాలు
ఈ ప్రోమో మొదట్లోనే ప్రముఖ కమెడియన్ హైపర్ ఆది తన గురువు అయిన అదిరే అభి కాళ్లు కడగడం చూపించారు. దీంతో అభి ఎమోషనల్ అయ్యాడు. ఆ తర్వాత చమ్మక్ చంద్రలాంటి మిగిలిన టీమ్ లీడర్స్ కాళ్లను కూడా వాళ్ల శిష్యులు కడిగారు. ఆ తర్వాత సీన్లోకి అనసూయ ఎంటరైంది. తాను ఎంత పెద్ద నటిగా ఎదిగినా ఇప్పటికే జబర్దస్త్ షో అనసూయ అనే గుర్తింపు అలాగే ఉందని ఆమె చెప్పింది.
జీవితం అన్నిసార్లూ అవకాశాలు ఇవ్వదని అంటారని, అది నిజం కాదని కూడా ఆమె చెప్పడం చూడొచ్చు. ఇక ఆ తర్వాత తాను ఒకరితో ప్యాచప్ చేసుకోవాల్సిన అవసరం ఉందంటూ రష్మి దగ్గరికి వెళ్లి ఆమెను కౌగిలించుకుంటుంది. దీంతో రష్మి ఎమోషనల్ అయిపోయి కంటతడి పెట్టింది.
హాస్యంతో కూడిన ప్రోమో
ఇక ఎప్పటిలాగే ఈ ప్రోమోలోనూ హైపర్ ఆది తన పంచ్ లతో నవ్వించాడు. సుధీర్, రష్మి లవ్ స్టోరీని కూడా గుర్తు చేశాడు. అతడు ఒకప్పుడు చెప్పిన ఎమోషనల్ డైలాగ్ చెప్పి నవ్వించాడు. నేను చనిపోతే నువ్వు ఏడుస్తావో లేదో కానీ నువ్వు ఏడిస్తే నేను చచ్చపోతానని సుధీర్ చెప్పిన విషయం హైపర్ ఆది గుర్తు చేశాడు. చచ్చిపోవడం కాదు కదా కనీసం వచ్చి పోవడం లేదని, ఇక్కడ రష్మి వదిన ఒంటైరైపోతే అక్కడ సుధీర్ అన్న మాత్రం అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తున్నాడని ఆది అన్నాడు.
ఇక ఈ ప్రోమోలో ర్యాంప్ వాక్ కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. జడ్జీలుగా నాగబాబుతోపాటు ఇంద్రజ, ఖుష్బూ కూడా ఉన్నారు. ఈ స్పెషల్ 12 ఏళ్ల సెలబ్రేషన్స్ ఎపిసోడ్లు ఈ శుక్ర, శనివారాల్లో ఈటీవీ టెలికాస్ట్ చేయనుంది. మరి ఈ షో ఫ్యాన్స్ అందరూ మిస్ కాకుండా చూసేయండి.
జబర్దస్త్ 12 ఏళ్ల ప్రయాణం ఈ ప్రోమో ద్వారా మరోసారి గుర్తు చేసుకుందాం. నవ్వులు, భావోద్వేగాలతో నిండిన ఈ ప్రోమో అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

