|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఆ సమయంలో ప్రెగ్నెంట్‌ అని అబద్దం చెప్పాను: రెజీనా

Published: 19-10-2025, 9:48 PM
ఆ సమయంలో ప్రెగ్నెంట్‌ అని అబద్దం చెప్పాను: రెజీనా

నటి రెజీనా తాను గతంలో చేసిన ఒక తమాషా పనిని తాజాగా పంచుకున్నారు. సుమారు పదేళ్ల క్రితం బెంగళూరులో అర్ధరాత్రి లస్సీ తాగడం కోసం తాను గర్భవతిని అని అబద్ధం చెప్పాల్సి వచ్చిందని ఆమె సరదాగా వివరించారు. ఈ సంఘటన తర్వాత మీడియాలో వేరే విధంగా ప్రచారం జరిగిందని తెలిపారు.

Key Points

1

రెజీనా తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ నటించి ప్రత్యేక గుర్తింపు పొందారు.

2

పదేళ్ల క్రితం బెంగళూరులో అర్ధరాత్రి లస్సీ కోసం తాను ప్రెగ్నెంట్‌ అని అబద్ధం చెప్పారు.

4

కొంతకాలం తర్వాత మీడియాలో ఈ విషయంపై తప్పుడు ప్రచారం జరిగిందని రెజీనా తెలిపారు.

నటి రెజీనా ప్రత్యేక స్థానం

నటి రెజీనా(Regina Cassandra) తెలుగులోనే కాదు తమిళ్‌, మలయాళం, కన్నడం, హిందీ తదితర భాషల్లోనూ నటించి తనకంటూ  ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. పలు చిత్రాల్లో ఐటమ్స్‌ సాంగ్స్‌తో కూడా మెప్పించిన ఆమెకు అనుకున్నంత రేంజ్‌ విజయాలు దక్కకపోయినప్పటికీ ఫ్యాన్స్‌ మాత్రం భారీగానే ఉన్నారు. తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఒక సందర్భంలో తాను ప్రెగ్నెంట్‌ అని అబద్ధం చెప్పాల్సిన అవసరం ఎందుకొచ్చిందో సరదాగా పంచుకుంది.

లస్సీ కోసం ప్రెగ్నెంట్ డ్రామా

సుమారు పదేళ్ల క్రితం ఒకసారి బెంగళూరులో అర్ధరాత్రి 12 గంటల ప్రాంతలో స్నేహితురాళ్లతో కలిసి వెళుతుండగా తనకు లస్సీ తాగాలనిపించిందని గుర్తు చేసుకున్నారు. అప్పుడే మూస్తున్న ఒక షాప్ వద్దకు వెళ్లి లస్సీ కావాలని అడిగానన్నారు. అందుకు ఆ షాప్ యజమాని చిరాకుగా లస్సీ లేదు ఏమీలేదు వెళ్లు అని అన్నాడని తెలిపారు. వెంటనే తాను గర్భంతో ఉన్నాను.   నాకు లస్సీ ఇస్తే ఆ భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అని అన్నానన్నారు. దీంతో తన స్నేహితురాళ్లు షాక్‌కు గురయ్యారన్నారు.

అబద్ధం చెప్పిన రెజీనా: మీడియా కథనాలు

అయితే, ఆ షాప్ అతను ఎక్కడ రెజీనా గర్భవతి అని అందరికీ చెబుతారో అని తన ఫ్రెండ్స్‌ కూడా భయపడ్డారన్నారు. అదృష్టవశాతు అతను ఎవరికీ చెప్పలేదని తెలిపారు. ఇలాంటి తమాషాలు చాలా చేశానని, ఇప్పటికీ చేస్తుంటానని రెజీనా అన్నారు. అయితే, కొంత కాలం తర్వాత మీడియాలో  మాత్రం ఇదే విషయంపై మరో విధంగా ప్రచారం జరిగిందని గుర్తుచేసుకున్నారు.

రెజీనా పంచుకున్న ఈ సంఘటన ఆమె సరదా స్వభావాన్ని తెలియజేస్తుంది. వ్యక్తిగత విషయాలు కొన్నిసార్లు ఎలా వక్రీకరించబడతాయో కూడా ఇది చూపిస్తుంది. మొత్తంగా ఇది సినీతారల జీవితంలో ఎదురయ్యే అనుభవాలను ప్రతిబింబిస్తుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.