|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నేను ఆ హీరోకు అస్సలు నచ్చలేదు.. నాకు యాక్టింగ్ తెలియదని అన్నాడు: భాగ్యశ్రీ బోర్సే

Published: 06-11-2025, 11:06 PM
నేను ఆ హీరోకు అస్సలు నచ్చలేదు.. నాకు యాక్టింగ్ తెలియదని అన్నాడు: భాగ్యశ్రీ బోర్సే

యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే తన తాజా చిత్రం ‘కాంత’ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. మొదట రానా తన నటనను నచ్చలేదని అన్నారని వెల్లడించింది. అయితే, సెల్వ నమ్మకంతో తనకు అవకాశం లభించిందని, ప్రస్తుతం ఈ అవకాశం ఇచ్చిన రానాకు ధన్యవాదాలు తెలుపుతున్నానని భాగ్యశ్రీ చెప్పింది.

Key Points

1

భాగ్యశ్రీ బోర్సే ‘మిస్టర్ బచ్చన్’ చిత్రంతో పాపులారిటీ దక్కించుకుంది.

2

రానా తన లుక్ టెస్ట్ చూసి యాక్టింగ్ తెలియదని అన్నారని వెల్లడించింది.

4

దుల్కర్ సల్మాన్ సరసన 'కాంత'లో నటిస్తోంది; రానా కూడా కీలక పాత్రలో.

భాగ్యశ్రీ బోర్సే షాకింగ్ కామెంట్స్

యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే(Bhagyashree Borse) ‘మిస్టర్ బచ్చన్’ చిత్రంతో వచ్చి భారీ పాపులారిటీ దక్కించుకుంది. కానీ హిట్ అందుకోలేకపోయింది. అమ్మడు అందానికి మార్కులు పడినప్పటికీ.. నటనకు మాత్రం ఒక్క హిట్ కూడా రాలేదు. భాగ్యశ్రీ బోర్సే నటించిన సినిమాలన్ని అంతంత మాత్రంగానే మెప్పించాయి. అయినా.. ఈ భామకు.. వరుస అవకాశాలు క్యూ కడుతున్నాయి. ప్రజెంట్ మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan)సరసన ‘కాంత’(kantha) మూవీలో నటిస్తోంది. పీరియాడిక్ బ్యాక్ డ్యాప్‌లో రాబోతుండగా.. రానా, సముద్రఖని కీలక పాత్రలో కనిపించబోతున్నారు. షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదలై ప్రేక్షకులను ఊర్రూతలూకిస్తోంది.

రానా మొదట యాక్టింగ్ నచ్చలేదని..

ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న భాగ్యశ్రీ షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘‘నేను ముందుగా చెన్నైకి వెళ్లాను. నా లుక్ టెస్ట్ అక్కడే జరిగింది. అక్కడున్న రానా గారు నా లుక్ టెస్ట్ చూసి హీరోయిన్‌గా నచ్చలేదని అన్నారు. అమ్మాయి చాలా బాగుంది.. చూడటానికి తప్ప యాక్టింగ్ తెలియదు అన్నాడు. మొదట ఈ సినిమాకు నన్ను తీసుకోలేవు. కానీ సెల్వ చాలా నమ్మకంగా ఉన్నారు. నేను డైలాగ్స్, సీన్స్ చేశాక అంతా సంతోషపడ్డారు. నేను కుమారిగా నటించగలనని నమ్మారు.

‘కాంత’ సినిమా విశేషాలు

ఈ అవకాశం ఇచ్చిన రానాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను విన్న మొదటి కథ కాంత. ఈ ప్రాజెక్ట్ నాకు చాలా చాలా స్పెషల్. మీ సపోర్ట్ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది’’ అని చెప్పుకొచ్చింది. దీంతో షాక్ అయిపోయిన రానా ప్రతి సారి నేను ఊరికే ఎందుకు విలన్ అయిపోతానో నాకు అర్థం కాదని ఫన్నీగా అనడంతో జనాలంతా నవ్వుతారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

భాగ్యశ్రీ బోర్సే చేసిన ఈ కామెంట్స్, ఆ తర్వాత రానా ఇచ్చిన ఫన్నీ రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘కాంత’ సినిమాపై అంచనాలను పెంచుతూ, భాగ్యశ్రీ కెరీర్‌లో ఇదొక మైలురాయిగా నిలవాలని అభిమానులు ఆశిస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.