
నటుడు శరత్ కుమార్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి వెల్లడించారు. సుభాష్ చంద్రబోస్ బయోపిక్ ను తానే దర్శకత్వం వహిస్తానని ప్రకటించారు. మానిటర్ చూడటం, ‘డ్యూడ్’ సినిమాలోని తన పాత్ర, భవిష్యత్ ప్రాజెక్టుల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
Key Points
మానిటర్ చూడటం వల్ల సమయం వృథా అవుతుందని శరత్ కుమార్ అభిప్రాయం.
కీర్తీశ్వరన్ దర్శకత్వంలో రూపొందిన ‘డ్యూడ్’లో శరత్ కుమార్ కీలకపాత్ర పోషించారు.
తానే దర్శకత్వం వహించి సుభాష్ చంద్రబోస్ బయోపిక్ చేయాలని శరత్ కుమార్ ఆకాంక్షించారు.
ప్రస్తుతం ‘మిస్టర్ ఎక్స్’, బాలీవుడ్, గౌతమ్ మీనన్ సినిమాలతో శరత్ కుమార్ బిజీగా ఉన్నారు.
మానిటర్ చూడటంపై శరత్ కుమార్ అభిప్రాయం
‘‘ప్రస్తుతం షూటింగ్ సమయంలో షాట్ ఓకే అయిన తర్వాత నటీనటులు వెళ్లి తాము ఎలా చేశామో అని మానిటర్‌లో చూస్తుంటారు. ప్రతిసారీ వెళ్లి మానిటర్ చూడటం వల్ల సమయం వృథా అని నా భావన. మానిటర్ చూడటం డైరెక్టర్ పని. ఆయనకి సన్నివేశం బాగా వచ్చిందంటే ఓకే.. లేకుంటే మరో టేక్ చెబుతారు’’ అని శరత్ కుమార్ తెలిపారు. ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు జంటగా నటించిన చిత్రం ‘డ్యూడ్’. కీర్తీశ్వరన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న విడుదల కానుంది.
‘డ్యూడ్’ చిత్రంలో శరత్ కుమార్ పాత్ర
ఈ సినిమాలో కీలకపాత్ర చేసిన శరత్ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ–‘‘నెనెప్పుడూ కథలో ముఖ్య భాగమయ్యేపాత్రలు చేయడానికే ఇష్టపడతాను. డైరెక్టర్ కీర్తీశ్వరన్ ‘డ్యూడ్’ కథ చెప్పినప్పుడు ప్రదీప్‌కి మావయ్యపాత్ర అన్నారు. నాపాత్ర కథలో చాలా కీలకం. ఒక కుటుంబంలో ఇలాంటి ఓ ఘటన జరిగితే సమాజం ఎలా స్పందిస్తుంది? అనే కోణంలో ‘డ్యూడ్’ని డైరెక్టర్ చాలా అద్భుతంగా చూపించారు. వినోదం, భావోద్వేగాలు కొత్తగా ఉంటాయి. నాపాత్రలో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. సెట్స్‌లో ఉన్నప్పుడు సీనియర్‌ని అనే ఆలోచనతో కాకుండా నేను కేవలం శరత్ కుమార్ అనే ఆలోచనతో ఉంటాను.
నా డ్రీమ్ ప్రాజెక్ట్: సుభాష్ చంద్రబోస్ బయోపిక్
ఇంట్లో నేను, రాధిక, వరలక్ష్మి సినిమాల గురించి మాట్లాడుతుంటాం. వరలక్ష్మి ఇప్పుడు డైరెక్టర్ అవుతోంది. తన కథని రెండు మూడు రోజుల్లో వింటాను. ఇన్నేళ్ల కెరీర్‌లో ఎన్నోపాత్రలు చేశాను. అయితే సుభాష్ చంద్రబోస్‌గారి బయోపిక్ చేయాలని ఉంది. ఈ సినిమాకి నేనే దర్శకత్వం వహిస్తాను. ప్రస్తుతం ‘మిస్టర్ ఎక్స్’ సినిమా చేస్తున్నాను. బాలీవుడ్‌లో ఓ మూవీ, గౌతమ్ మీనన్‌తో ఒక సినిమా చేస్తున్నాను’’ అని చెప్పారు.
మొత్తంగా, శరత్ కుమార్ ‘డ్యూడ్’ సినిమా విశేషాలతో పాటు, తన దర్శకత్వ కలలను, రాబోయే ప్రాజెక్టులను పంచుకుంటూ అభిమానులకు సినిమాపై ఆసక్తిని పెంచారు. ఆయన బయోపిక్ ప్రాజెక్ట్ కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.


