
ఆన్‌లైన్ పైరసీ వెబ్‌సైట్ ఐ-బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సినీ పరిశ్రమకు భారీ నష్టం కలిగించిన రవి, ఆరు నెలలుగా పోలీసులకు సవాల్ విసిరారు. ఫ్రాన్స్ నుంచి తిరిగి వస్తుండగా అరెస్ట్ చేశారు. ఈ అరెస్టుపై పూర్తి వివరాలు.
Key Points
ఆన్‌లైన్ పైరసీ వెబ్‌సైట్ ఐ-బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి హైదరాబాద్‌లో అరెస్ట్.
ఫ్రాన్స్ నుంచి తిరిగి వస్తుండగా కూకట్‌పల్లిలో సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఐ-బొమ్మ వల్ల సినీ పరిశ్రమకు దాదాపు రూ.3వేల కోట్ల వరకు నష్టం వాటిల్లినట్లు అంచనా.
అరెస్ట్ అనంతరం ఇమ్మడి రవి బ్యాంక్ అకౌంట్లలోని రూ.3 కోట్ల నగదును ఫ్రీజ్ చేశారు.
ఐ-బొమ్మ నిర్వాహకుడి అరెస్ట్: వెనుకనున్న వివరాలు
i Bomma : ఆన్‌లైన్ పైరసీ వెబ్‌సైట్ ఐ-బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన రవిని సీసీఎస్ పోలీసులు కూకట్‌పల్లిలో అదుపులోకి తీసుకున్నారు.
సినీ పరిశ్రమకు భారీ నష్టాన్ని కలిగించడమే కాకుండా పోలీసులకు బహిరంగంగా రవి సవాల్ విసిరాడు. గత ఆరు నెలలుగా పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు. కరేబియన్ దీవుల్లో ఉంటూ ఐ-బొమ్మ వెబ్‌సైట్‌ను నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకున్న తరువాత ఆయన బ్యాంక్ అకౌంట్లలో ఉన్న రూ.3 కోట్ల నగదును ప్రీజ్ చేశారు.
సినిమా పరిశ్రమకు పైరసీ నష్టం: కోట్లల్లో లెక్క
Prabhas : మళ్ళీ డ్యాన్స్ మాస్టర్ తో ప్రభాస్ సినిమా.. అప్పుడు ప్రభుదేవా, లారెన్స్.. ఇప్పుడు ఎవరంటే?
ఇమ్మడి రవిపై సైబర్ క్రైమ్ చర్యలు: బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్
ఐ-బొమ్మ వల్ల సినీ పరిశ్రమకు దాదాపు రూ.3వేల కోట్ల వరకు నష్టం వాటినట్లు అంచనా. ఓటీటీల్లో, థియేటర్లలో విడుదలైన సినిమాల హెచ్‌డీ ప్రింట్లను కొన్ని గంటల్లోనే ఈ వైబ్‌సైట్‌లో అక్రమంగా పైరసీ చేసి ఉచితంగా అందిస్తూ వచ్చింది. ఈ విషయమై సినీ నిర్మాతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఐ-బొమ్మ నిర్వాహకుడి అరెస్టు సినీ పరిశ్రమకు ఎంతో ఊరట కలిగించింది. పైరసీ వల్ల భారీగా నష్టపోతున్న నిర్మాతలకు ఇది శుభవార్త. ఇలాంటి చర్యలు భవిష్యత్తులో పైరసీని అరికట్టడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఆశిస్తున్నారు.


