
📌 Key Points
- ఐబొమ్మ రవి ముగ్గురు స్నేహితుల పేర్లతో నకిలీ ఐడీలు సృష్టించి మోసాలకు పాల్పడ్డాడు.
- వెల్లెల ప్రహ్లాద్ టెన్త్ మెమో, ఆధార్ దొంగిలించి ఫేక్ డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు పొందాడు.
- మొత్తం రూ.13 కోట్ల లావాదేవీలు గుర్తించగా, రూ.3 కోట్లను సైబర్ క్రైమ్ పోలీసులు ఫ్రీజ్ చేశారు.
- మిగిలిన రూ.10 కోట్లతో విదేశాల్లో జల్సాలు చేసినట్లు పోలీసులు విచారణలో గుర్తించారు.
ఐబొమ్మ రవి కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రవి తన ముగ్గురు స్నేహితుల పేర్లతో నకిలీ ఐడీలు సృష్టించి, భారీ మోసాలకు పాల్పడినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. కోట్లాది రూపాయల లావాదేవీలపై విచారణ కొనసాగుతోంది.
స్నేహితుల పేర్లతో నకిలీ ఐడీలు
Ibomma Ravi: ఐబొమ్మ రవి కేసులో మరికొన్ని సంచలన విషయాలు బయటపడ్డాయి. 12 రోజుల కస్టడీలో కీలక అంశాలు రాబట్టారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఐబొమ్మ రవి తన ముగ్గురు స్నేహితుల పేరుతో ఫేక్ IDలు క్రియేట్ చేసుకున్నట్లు గుర్తించారు.
వెల్లెల ప్రహ్లాద్ కుమార్‌తో పాటు.. అంజయ్య, కాలి ప్రసాద్‌ల పేర్లతో నకిలీ ఐడీలు సృష్టించాడు ఐబొమ్మ రవి. అమీర్‌పేట్‌లోని హాస్టల్లో ఉన్నప్పుడు వెల్లెల ప్రహ్లాద్‌తో రవికి పరిచయం ఏర్పడింది. ఆ సమయంలోనే ప్రహ్లాద్ టెన్త్ మెమో, ఆధార్ దొంగిలించాడు రవి. ప్రహ్లాద్ పేరుతోనే డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్లు తీసుకున్నాడు. పేరు ప్రహ్లాద్.. ఫోటో మాత్రం తనది పెట్టుకుని ఫేక్ ఐడీలు క్రియేట్ చేసుకున్నాడు.
కోట్లలో లావాదేవీలు, విదేశాల్లో జల్సాలు
కడప జిల్లాకు చెందిన వెల్లెల ప్రహ్లాద్ 2007లో అమీర్‌పేట్‌లోని హాస్టల్లో రవితో కలిసి ఉన్నాడు. ఆ సమయంలోనే ప్రహ్లాద్‌తో పాటు కరీంనగర్‌కు చెందిన అంజయ్య అనే మరో వ్యక్తితో ఐబొమ్మ రవికి పరిచయం ఏర్పడింది. దీంతో అతని పేరు మీద కూడా మరికొన్ని ఫేక్ ఐడీలు క్రియేట్ చేసుకున్నాడు ఐబొమ్మ రవి. అలాగే తన టెన్త్ క్లాస్‌మేట్ కాలి ప్రసాద్ ఆధార్ కార్డుతో మరికొన్ని ఫేక్ ఐడీలు క్రియేట్ చేసుకున్నాడు. పాస్‌పోపోర్ట్ మాత్రం ఇమంది రవి పేరుతోనే తీసుకున్నాడు రవి. ఈ ముగ్గురు స్నేహితుల పేర్లతో పలు వెబ్‌సైట్లు కొనుగోలు చేశాడు. హాస్పిటల్ ఇన్.. సప్లయర్స్ ఇన్ వెబ్‌సైట్లను బినామీ పేర్లతో కొనుగోలు చేశాడు. ఈ రెండు వెబ్‌సైట్లు సక్సెస్ కాకపోవడంతో.. ఐబొమ్మను క్రియేట్ చేశాడు రవి. మూవీ రూల్స్‌తో పాటు మరికొన్ని పైరసి వెబ్స్‌ట్ ల పై కూడా చర్యలు తీసుకుంటాం.. అదే విధంగా ఇకపై పైరసి చేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయి.. అని తెలిపారు సైబర్ క్రైమ్ పోలీసులు.
ఐబొమ్మ రవి మొత్తం 13 కోట్ల ట్రాన్సాక్షన్స్ గుర్తించి.. 3 కోట్ల రూపాయలు ఫ్రీజ్ చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. మిగతా 10 కోట్ల రూపాయలతో విదేశాలలో జల్సాలు చేసినట్టు గుర్తించారు. ఐబొమ్మ రవిని నాంపల్లి కోర్టుకు తరలించి.. అనంతరం చంచల్‌గూడ జైలుకు తరలించనున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు.
పైరసీ వెబ్‌సైట్లపై ఉక్కుపాదం
ఐబొమ్మ రవిని పోలీసులు కోర్టుకు తరలించి, చంచల్‌గూడ జైలుకు పంపనున్నారు. పైరసీపై కఠిన చర్యలు ఉంటాయని, ఇలాంటి నేరాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతామని సైబర్ క్రైమ్ పోలీసులు స్పష్టం చేశారు.


