
సినిమా పైరసీ సైట్ ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మంది రవిని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. రవికి కరేబియన్ దేశ పౌరసత్వం ఉందని, పలు దేశాల్లో సర్వర్లు ఏర్పాటు చేసి బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేశాడని సీపీ సజ్జనార్ వెల్లడించారు. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు ప్రజలను పైరసీ పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు.
Key Points
ఐ బొమ్మ పైరసీ సైట్ నిర్వాహకుడు ఇమ్మంది రవిని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు.
రవికి కరేబియన్‌లోని సెయింట్ నేవీ దేశ పౌరసత్వం ఉందని సీపీ సజ్జనార్ వెల్లడించారు.
రవి 110 డొమైన్లు కొని 21 వేల సినిమాలు అప్‌లోడ్ చేసి బెట్టింగ్ యాప్స్‌ను ప్రచారం చేశాడు.
చిరంజీవి, నాగార్జున, రాజమౌళి వంటి సినీ ప్రముఖులు పైరసీ, డేటా చోరీపై హెచ్చరించారు.
ఐ బొమ్మ రవి అరెస్ట్: సవాల్ నుండి కస్టడీ వరకు
సినిమా పైరసీ సైట్ ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మంది రవిని రెండు రోజుల క్రితమే తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. దమ్ముంటే తనని పట్టుకోండి అంటూ ఆయన గతంలో పోలీసులకు సవాల్ విసిరిన నేపథ్యంలో పక్కా ప్లాన్‌తో తెలంగాణ పోలీసులు ఇమ్మంది రవిని కూకట్‌పల్లిలో తన ఫ్లాట్‌లో అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్నాడు. ఈ క్రమంలో సోమవారం ఐ బొమ్మ రవికి సంబంధించి సీపీ సజ్జనార్ సినీ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున, దిల్ రాజు, రాజమౌళిల సమక్షంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. పలు షాకింగ్ విషయాలను వెల్లడించారు.
ఇమ్మంది రవి 110 డొమైన్లని కొనుగోలు చేసి 21 వేల సినిమాలను అప్‌లోడ్ చేశాడని సజ్జనార్ వెల్లడించారు. రవికి కరేబియన్ దీవుల్లోని సెయింట్ నేవీ దేశం పౌరసత్వం ఉన్నట్టు తెలిపారు. ఇండోనేషియా, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్ లో సర్వర్లు ఏర్పాటు చేశాడని, ఐ బొమ్మ ద్వారా వన్ విన్, వన్ ఎక్స్ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసినట్టు చెప్పారు. ఏపీకే ఫైల్స్ ప్రమోట్ చేసి, ప్రజల ఫోన్లలో మాల్ వేర్‌ని చొరబడేలా చేశాడని తెలిపారు సజ్జనార్.
రవి అక్రమాల సామ్రాజ్యం: పౌరసత్వం, సర్వర్లు, బెట్టింగ్
రవిది చిన్నప్పట్నుంచి క్రిమినల్ మైండ్ అని, ఇలాంటివి చాలా చేశాడని తెలిపారు. ఇలాంటి సైట్ల విషయంలో, పైరసీ సినిమాలు చూసే విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఫ్రీగా వస్తుందని చూస్తే మీ డాటా అంతా వాళ్లు దోచుకుంటున్నారని, తర్వాత మీరు చాలా సమస్యల్లో పడతారని ఈ సందర్భంగా సీపీ సజ్జనార్‌తోపాటు చిరంజీవి, నాగార్జున, దిల్ రాజు, రాజమౌళి తెలిపారు. ఏదైనా ఒరిజినల్ కంటెంట్‌ని చూడాలని, ఫేక్ కంటెంట్ చూస్తే అది మీకు నష్టమని సజ్జనార్ చెప్పారు. మీ డాటా క్రిమినల్స్ చేతిలో పెట్టడం వల్ల సైబర్ నేరాలు జరుగుతాయని, దీని వల్ల వ్యక్తిగతంగా చాలా దారుణమైన నష్టాలను ఫేస్ చేయాల్సి వస్తుందన్నారు. ఏదైనా ఇలాంటి సైబర్ నేరాలకు సంబంధించిన వివరాలు తెలిస్తే 1930కి కాల్ చేయాలని తెలిపారు హైదరాబాద్ సీపీ.
పైరసీపై సినీ ప్రముఖులు, సీపీ సజ్జనార్ హెచ్చరికలు
ఐబొమ్మ ఇండియాలోనే ఒక ప్రముఖ పైరసీ సైట్‌గా మనుగడ సాధిస్తోంది. మిగిలిన పైరసీ సైట్లలో పైరసీ చేసిన సినిమాల ప్రింట్‌ని అప్ లోడ్ చేస్తుంటారు. ఫోన్ కెమెరాలో తీసిన ప్రింట్ అది. కానీ ఐబొమ్మలో మాత్రం హెచ్‌డీ ప్రింట్ ఉంటుంది. ఒరిజినల్ లుక్‌ని ఇస్తుంది. అందుకే చాలా మంది ప్రజలు ఈ సైట్‌ని అప్రోచ్ అవుతుంటారు. ఇందులో డైరెక్ట్ గా చూడొచ్చు, డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫోన్ నుంచి డౌన్‌లోడ్ చేసినా, చూసిన ఫోన్‌నెంబర్, ఆధార్, ఇతర కీలక డాటాని వాళ్లు తీసుకుంటారు. మనకు తెలియకుండా అవి వారి చేతిలోకి వెళ్తుంటాయి. వీటిని అడ్డు పెట్టుకుని అనేక నేరాలకు పాల్పడుతుంటారని సీపీ తెలిపారు.
ఇమ్మంది రవి అరెస్ట్‌తో పైరసీకి వ్యతిరేకంగా బలమైన సందేశం పంపబడింది. సినీ ప్రముఖులు, పోలీసులు ప్రజలను పైరసీ సైట్లను చూడవద్దని, డేటా చోరీ పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. సైబర్ నేరాలపై 1930కి కాల్ చేయాలని సూచించారు.


