|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

యాంకర్ అందానికి ఫిదా అయిపోయిన ఐకాన్ స్టార్.. ఆయన కామెంట్‌తో భూమి మీద ఆగలేకపోతున్నానంటూ షాకింగ్ పోస్ట్

Published: 16-06-2025, 7:46 AM
యాంకర్ అందానికి ఫిదా అయిపోయిన ఐకాన్ స్టార్.. ఆయన కామెంట్‌తో భూమి మీద ఆగలేకపోతున్నానంటూ షాకింగ్ పోస్ట్

బుల్లితెర యాంకర్ స్రవంతి చొక్కారపు అందానికి ప్రముఖ నటుడు అల్లు అర్జున్ ఫిదా అయ్యారు. గద్దర్ అవార్డుల వేడుకలో ఆమె అందాన్ని ప్రశంసించిన అల్లు అర్జున్ కామెంట్‌తో స్రవంతి ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.

Key Points

1

స్రవంతి చొక్కారపు అందానికి అల్లు అర్జున్ ఫిదా అయ్యారు.

2

గద్దర్ అవార్డుల వేడుకలో స్రవంతి చొక్కారపు గ్రీన్ కలర్ చీరలో అందంగా కనిపించారు.

4

స్రవంతి ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

స్రవంతి చొక్కారపు అందం

బుల్లితెర యాంకర్ స్రవంతి చొక్కారపు(Sravanti Chokkarapu ) అందరికీ సుపరిచితమే. ఈ ముద్దుగుమ్మ పలు టీవీ షోల్లో పాల్గొన తన మాటలతో అందరినీ ఫిదా అయ్యేలా చేసి ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. అలాగే స్టార్ హీరోల సినిమా ఈవెంట్లకు కూడా వర్క్ చేసి తన అందంతో స్టేజ్‌పై రచ్చ చేస్తుంటుంది. కేవలం ఆన్ స్క్రీన్ పైనే కాకుండా సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ తన హాట్ ఫొటో షూట్స్‌తో కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది. యాంకర్‌గా రాణిస్తున్న స్రవంతి ఎంత బిజీగా ఉన్నప్పటికీ తన ఫొటోలను మాత్రం నెట్టింట పెడుతూ ఉంటుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన గద్దర్ అవార్డుల వేడుకకు హాజరైంది.

అయితే ఇందులో గ్రీన్ కలర్ చీరలో హాజరైన ఆమె అందాన్ని ఓ టాలీవుడ్ స్టార్ హీరో ప్రశంసలు కురిపించారు. ఈ విషయాన్ని చెప్తూ స్రవంతి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ వీడియోను షేర్ చేసింది. ఇందులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) సరసన నిల్చొని ఫొటో దిగింది. ఈ సమయంలోనే ఆయన కిందనుంచి మీదకు చూసి చీర చాలా బాగుంది అందంగా ఉన్నారని అన్నారు. ఇక ఈ వీడియోకు స్రవంతి ‘‘మనం ఎంతగానో ఇష్టపడే హీరో,మనం కట్టుకున్న చీర చాలా బాగుంది,చాలా అందంగా ఉన్నారు అంటే ఇక భూమి మీద ఆగగలమా’’ అనే క్యాప్షన్ జత చేసింది. ఇక అది చూసిన నెటిజన్లు నిజంగాను నువ్వు బాగున్నావ్ అని కామెంట్లు పెడుతున్నారు.

అల్లు అర్జున్ ప్రశంసలు

సోషల్ మీడియాలో వైరల్

అల్లు అర్జున్ ప్రశంసలతో స్రవంతి చొక్కారపు సంతోషం వ్యక్తం చేసింది. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.