
ధనుష్ నటించి, దర్శకత్వం వహించిన ‘ఇడ్లీ కొట్టు’ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. థియేటర్లలో మిశ్రమ స్పందన అందుకున్న ఈ ఫీల్ గుడ్ మూవీ అక్టోబరు 29 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. దీని కథాంశం, విడుదల వివరాలను ఈ కథనంలో చూడండి.
Key Points
ధనుష్ నటించి, దర్శకత్వం వహించిన 'ఇడ్లీ కడై' తెలుగులో 'ఇడ్లీ కొట్టు'గా రిలీజ్.
థియేటర్లలో అక్టోబరు 01న విడుదల; 'కాంతార-1' వల్ల తెలుగులో ప్రభావం తక్కువ.
అక్టోబరు 29 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్.
తండ్రి ఇడ్లీ కొట్టు, కొడుకు మురళి హోటల్ మేనేజ్‌మెంట్ నేపథ్యం ప్రధాన కథాంశం.
ధనుష్ ‘ఇడ్లీ కొట్టు’ థియేట్రికల్ జర్నీ
పేరుకే తమిళ హీరో అయినప్పటికీ సార్, కుబేర లాంటి స్ట్రెయిట్ సినిమాలతో తెలుగులోనూ హిట్స్ కొట్టిన ధనుష్.. రీసెంట్‌గా హీరోగా నటిస్తూ దర్శకనిర్మాతగా ఓ మూవీ చేశాడు. అదే ‘ఇడ్లీ కడై’. తెలుగులోనూ దీన్ని ఇడ్లీ కొట్టు పేరుతో థియేటర్లలో రిలీజ్ చేశారు. ఫీల్ గుడ్ ఎమోషన్స్‌తో ఆకట్టుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన విడుదల చేశారు.
అక్టోబరు 01న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో థియేటర్లలో రిలీజైంది. అయితే దీనికి ఒకరోజు తర్వాత ‘కాంతార-1’ రిలీజైంది. ఈ మూవీకి హిట్ టాక్ రావడంతో ఇడ్లీ కొట్టు చిత్రం తెలుగులో ఏ మాత్రం ఇంపాక్ట్ చూపించలేకపోయింది. అదే టైంలో తమిళంలో మాత్రం మంచి వసూళ్లు వచ్చాయి. హిట్ అయింది. ఇప్పుడీ చిత్రం థియేటర్లలోకి వచ్చిన నెలలోపే అంటే అక్టోబరు 29 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.
ఓటీటీలోకి ‘ఇడ్లీ కొట్టు’ ఎప్పుడు?
‘ఇడ్లీ కొట్టు’ విషయానికొస్తే.. శంకరాపురం అనే ఊరిలో శివకేశవ(రాజ్ కిరణ్) ఓ ఇడ్లీ కొట్టు నడుపతుంటాడు. ఈ షాపులోని ఇడ్లీ.. చుట్టుపక్కలా చాలా ఫేమస్. ఇతడి కొడుకు మురళి(ధనుష్) మాత్రం తండ్రిలా ఊరిలో ఉండటం తన వల్ల కాదని, హొటల్ మేనేజ్‌మెంట్ చదువుతాడు. జాబ్ కోసం కుటుంబాన్ని వదిలిపెట్టి బ్యాంకాక్ వెళ్లిపోతాడు.
‘ఇడ్లీ కొట్టు’ కథా సారాంశం
కొన్నాళ్ల తర్వాత పనిచేస్తున్న కంపెనీ ఓనర్ విష్ణువర్ధన్ (సత్యరాజ్) కూతురు మీరా (షాలినీ పాండే)తోనే పెళ్లికి మురళి రెడీ అవుతాడు. సరిగ్గా పెళ్లికి రెండు మూడు రోజులు ఉందనగా శివకేశవ చనిపోతాడు. దీంతో మురళి.. సొంతూరికి వస్తాడు. తర్వాత ఏమైంది? విష్ణువర్ధన్ కొడుకు అశ్విన్(అరుణ్ విజయ్)తో మురళికి గొడవేంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.
మొత్తంగా, ధనుష్ ‘ఇడ్లీ కొట్టు’ ఓ ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్. థియేటర్లలో చూడలేకపోయిన వారు నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమాను ఎంజాయ్ చేయవచ్చు. తండ్రీ కొడుకుల అనుబంధం, ఎమోషన్స్‌తో కూడిన ఈ మూవీ ఓటీటీలో ఆకట్టుకుంటుందని ఆశిద్దాం.


