|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఇడుపు కాయితం వివాదం: ‘సిగ్గుతో తల వంచుకోవాలి’.. నరేష్ మాస్ వార్నింగ్!

Published: 08-07-2026, 5:57 AM
ఇడుపు కాయితం వివాదం: ‘సిగ్గుతో తల వంచుకోవాలి’.. నరేష్ మాస్ వార్నింగ్!

టాలీవుడ్ లో ఇప్పుడు హాట్ టాపిక్ ‘ఇడుపు కాయితం’ సినిమా టైటిల్ వివాదం! ఈ రచ్చపై సీనియర్ నటుడు నరేష్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తెలుగు భాషా మాండలికాలపై ఆయన ఇచ్చిన మాస్ వార్నింగ్ సినీ వర్గాలను ఆలోచింపజేస్తోంది.

Key Points

1

ప్రియదర్శి 'ఇడుపు కాయితం' టైటిల్ పై సోషల్ మీడియాలో భారీ వివాదం.

2

నరేష్ తీవ్ర అసంతృప్తి: 'తెలుగు భాషకు అవమానం, సిగ్గుతో తల వంచుకోవాలి'.

4

భాషా మాండలికాలను గౌరవించాలంటూ నరేష్ వీడియో సందేశం వైరల్.

నరేష్ సంచలన వ్యాఖ్యలు: ‘సిగ్గు పడాలి!’

ప్రియదర్శి, నాగ దుర్గ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఇడుపు కాయితం’. వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సుకుమార్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీని పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. టైటిల్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. అయితే ఈ టైటిల్‌ పై కొందరు కావాలని సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్టులు వివాదానికి దారితీశాయి. దీనిపై తాజాగా సీనియర్‌ నటుడు వీకే నరేష్ స్పందించారు. ‘ఇడుపు కాయితం’ వివాదాన్ని జాతీయ సమస్య చేశారని నరేష్ అన్నారు. దీన్ని వివాదంగా మార్చినందుకు మనందరం సిగ్గు పడాలని కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగు మాండలికాన్ని అవమానించొద్దని, సినిమాను సినిమాగానే చూడాలని హితవు పలికారు. ‘కరుప్పు’, ‘కాంతార’ వంటి పదాల అర్థాలు తెలియకపోయినా ఆయా సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఆదరించారనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ వివాదాన్ని ఇక్కడితో ముగించి, తెలుగు భాషను కాపాడుకుందామని పేర్కొన్నారు. దయచేసి మన తెలుగు భాషా మాండలికాలను తక్కువ చేయడం లేదా అవమానించడం మానేయండి అంటూ నరేష్ ఓ వీడియో రిలీజ్ చేశారు. నరేష్ మాట్లాడుతూ.. ”నేను రెండు రోజులుగా చూస్తున్నా. ‘ఇడుపు కాయితం’ కాంట్రవర్సీని నేషనల్ ఇష్యూగా చేస్తున్నారు. సినిమా వాడిగా ఒక సినిమాకి అటెన్షన్ ఇస్తున్నందుకు సంతోష పడతాను కానీ.. మన తెలుగు భాషలో ఒక మాండలికాన్ని కోట్ల మందిలో ఎవడో ఒక నెటిజన్ కామెంట్ చేశాడని, దాన్ని ఇంత ఇష్యూ చేసి ఒక గొప్ప మాండలికాన్ని అవమానించడం తెలుగువారిగా మనందరం సిగ్గుతో తల వంచుకోవాలి. తెలంగాణ, రాయలసీమ, కోనసీమ, ఉత్తరాంధ్ర.. ఇలా ప్రతీ మాండలికం వెనుక ఎన్నో పోరాటాలు జరిగాయి. ఎన్నో ఆవిష్కరణలు జరిగాయి. అందుకే మనం ఇవాళ తెలుగువారమని గర్వంగా చెప్పుకుంటున్నాం. ఆ తర్వాత భారతీయులమని చెప్పుకొని గర్వపడుతున్నాం” అని అన్నారు. ”కేవలం ఒక సినిమాని తీసుకొని ఇలా మాట్లాడటం చాలా తప్పు. మనం ‘కరుప్పు’ సినిమా చూడలేదా?. కరుప్పు అర్థం మనకు తెలుసా? అయినా తెలుగువాళ్లం ఎందుకు అంత పెద్ద హిట్ చేశాం. అదే విధంగా ‘కాంతార’ సినిమా వస్తే, దాన్ని ఎందుకు పెద్ద హిట్టు చేశాం?. సినిమా సినిమానే. సినిమా అనేది ఎంటర్టైన్మెంట్ కోసం. దయచేసి సినిమాని భాషని కలపకండి. ,మీడియా. ప్రభుత్వం కంటే తెలుగు భాషా సంఘాలు దీన్ని బాధ్యతగా తీసుకోవాలి. సభ్యులు వివిధ ప్రాంతాల్లో ఉన్నా, తెలుగు భాషా సంఘం ఒక్కటే. అందరూ బాధ్యతగా తీసుకొని, వెంటనే దీనికి ముగింపు పలకాలి. కూర్చొని మాట్లాడుకొని ఈ కాంట్రవర్సీని క్లోజ్ చేసి, మన తెలుగు భాషని మనం కాపాడుకుందాం. ఓ పక్క ప్రాంతీయ భాషలు మ్యాప్ లో నుంచే తొలగిపోతున్నాయని అంటుంటే.. మనం ఇంకో పక్క మన సొంత తెలుగు భాషను, మన కొమ్మల్ని మనం నరుక్కుంటున్నాం అంటే ఎంత సిగ్గుచేటు. దయచేసి ఈ మ్యాటర్ ను ఇక్కడితో క్లోజ్ చేయాలని మీడియా, తెలుగు భాషా సంఘం, నెటిజన్లను కోరుతున్నాను” అని నరేష్ పేర్కొన్నారు.

మాండలికాలపై రచ్చ.. నరేష్ ఆగ్రహం!

‘ఇడుపు కాయితం’ వివాదం: అసలేం జరిగింది?

‘ఇడుపు కాయితం’ వివాదంపై నరేష్ స్పందన ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. తెలుగు భాషా మాండలికాల గౌరవంపై ఆయన ఇచ్చిన సందేశం అందరికీ స్ఫూర్తినిస్తోంది. మరిన్ని సంచలన అప్డేట్స్ కోసం వేచి చూడండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.