|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రాజమౌళి, మంచు మనోజ్ కు చుక్కలు పెట్టిన వేణు స్వామి – వామాచారం షాక్!

Published: 09-07-2026, 10:08 AM
రాజమౌళి, మంచు మనోజ్ కు చుక్కలు పెట్టిన వేణు స్వామి - వామాచారం షాక్!
  • రాజమౌళి & మంచు మనోజ్ వామాచారం టచ్ చేశారు – వేణు స్వామి షాకింగ్ వ్యాఖ్యలు
  • వారణాసి టీజర్ లాంచ్ రోజు రాజమౌళి ఇబ్బంది – చిన్న మస్తా దేవి సీన్ వైరల్
  • మిరాయ్ సినిమా నుంచి రిలీజ్ వరకు మంచు మనోజ్ కాంట్రవర్సీలు – బగళాముఖీ అమ్మవారు
  • వామాచారంలో 100 కోరికలు కోరితే 200 తీరుస్తారు – ఓపిక ఉండాలి: వేణు స్వామి

ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజమౌళి, మంచు మనోజ్ వామాచారాన్ని టచ్ చేసి ఇబ్బందులు పడ్డారని ఆయన అన్నారు. ఆసక్తికర వివరాలు ఇవీ.

వామాచారం టచ్ చేసిన ఇద్దరు స్టార్స్

ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామికి సినీ స్టార్స్, పొలిటీషియన్స్ కి ఎంత పాపులారిటీ ఉంటుందో అంత క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఎన్ని వివాదాలు ఎదురైనా వేణు స్వామి చెప్పే సెలెబ్రిటీల జాతకులకు విపరీతమైన క్రేజ్ ఉంది. వేణు స్వామి కూడా ఎలాంటి మొహమాటం లేకుండా వివాదభరిత అంశాలని టచ్ చేస్తుంటారు. కొన్ని సార్లు వేణు స్వామి తాను చెప్పిన జాతకాలు నిజం అయ్యాయి అని క్లెయిమ్ చేసుకున్నారు.

మరికొన్ని సార్లు ఆయన చెప్పిన జోస్యం తీవ్రంగా బెడిసికొట్టింది. దారుణంగా ట్రోలింగ్ కి గురయ్యారు. అయినప్పటికీ వేణు స్వామి సెలెబ్రిటీల జాతకాలు చెప్పడం ఆపడం లేదు. ఇవి మాత్రమే కాకుండా వేణు స్వామి రాజకీయ పరమైన, సినిమా పరమైన వ్యాఖ్యలు కూడా చేస్తుంటారు.

మిరాయ్ సినిమా నుంచి మంచు మనోజ్ కాంట్రవర్సీలు

తాజాగా ఓ ఇంటర్వ్యూలో వేణు స్వామి రాజమౌళి, మంచు మనోజ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజమౌళి కారణ జన్ముడు అంటూ ప్రశంసలు కురిపించారు. అయితే రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం వారాణసిపై వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. వామాచారం అనేది చాలా కఠినమైన నిబంధన. వామాచారాన్ని ఇప్పటి వరకు సినీ ఇండస్ట్రీలో ఇద్దరు మాత్రమే టచ్ చేశారు.

ఒకరు మంచు మనోజ్ అయితే మరొకరు ఎస్ఎస్ రాజమౌళి. మిరాయ్ మూవీలో బగళాముఖీ అమ్మవారిని చూపించారు. మిరాయ్ సినిమా ప్రారంభం అయినప్పటి నుంచి రిలీజ్ అయ్యే వరకు మంచు మనోజ్ తీవ్ర ఇబ్బందుల్లో కాంట్రవర్సీలో ఉన్నారు. చెక్ చేసుకోండి..మంచు మనోజ్ గురించి ఎన్ని వార్తలు రాలేదు.. మనం చూడలేదా అని వేణు స్వామి అన్నారు.

వారణాసి టీజర్ రోజు రాజమౌళి ఇబ్బంది

రాజమౌళి అయితే వారణాసి మూవీలో చిన్న మస్తా దేవి గురించి చూపించారు. కేవలం వారణాసి టీజర్ లాంచ్ రోజే రాజమౌళి ఎంత ఇబ్బంది పడ్డారో అందరం చూశాం అని వేణు స్వామి అన్నారు. వామాచారంలో మనం 100 కోరికలు కోరితే.. అమ్మవారు మనకు 200 కోరికలు తీరుస్తారు. కానీ మనకు ఆ ఓపిక ఉండాలి అని వేణు స్వామి అన్నారు.

వేణు స్వామి వ్యాఖ్యలు సినీ ప్రియుల్లో చర్చనీయాంశంగా మారాయి. రాజమౌళి, మంచు మనోజ్ ఎదుర్కొన్న సవాళ్లు ఆసక్తి రేపుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం వేచి చూడండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.