
📌 Key Points
- ఐఐటీ తిరుపతిలో అప్రెంటిస్‌ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.
- గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లకు నెలకు రూ. 20 వేల స్టైఫండ్.
- డిప్లొమా అప్రెంటిస్‌లకు నెలకు రూ. 18వేల స్టైఫండ్ చెల్లింపు.
- మార్చి 27, 28, 29 తేదీల్లో ఇంటర్వ్యూలు జరుగుతాయి.
ఐఐటీ తిరుపతి నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. డిప్లొమా, డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థుల కోసం 40 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు.
ఐఐటీ తిరుపతిలో అప్రెంటిస్ ఖాళీలు
ఇండియన్ ఇనిస్టిస్ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, తిరుపతి నుంచి అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది.డిప్లొమా, డిగ్రీ, జీఎన్‌ఎం, బీఈ/బీటెక్, బీఎస్సీలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఖాళీలు 26 ఉండగా(15 విభాగాలు)… డిప్లొమా అప్రెంటిస్ ఖాళీలు 14గా(8 విభాగాలు) ఉన్నాయి.
ఎంపిక విధానం, స్టైఫండ్ వివరాలు
అర్హత గల అభ్యర్థులు మార్చి 27, 28, 29 తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. ఎంపికైన గ్రాడ్యూయేట్ అప్రెంటిస్ కు నెలకు రూ. 20 వేల స్టైఫండ్ ఇస్తారు. డిప్లొమా అప్రెంటిస్ ఖాళీలకు ఎంపికైన వారికి నెలకు రూ. 18వేల స్టైఫండ్ చెల్లిస్తారు.
ముఖ్యమైన తేదీలు, ఎలా దరఖాస్తు చేయాలి?
ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఖాళీలను భర్తీ చేస్తారు. పోస్టులను బట్టి ఇంటర్వ్యూ తేదీలను ఖరారు చేశారు. https://www.iittp.ac.in/ వెబ్ సైట్ లో ఇందుకు సంబంధించిన వివరాలను పేర్కొన్నారు. ఇక ఇంటర్వ్యూకి వచ్చే అభ్యర్థులు కింద సూచించిన ధ్రువపత్రాలను తీసుకెళ్లాల్సి ఉంటుంది.
ఐఐటీ తిరుపతిలో అప్రెంటిస్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ఇది మంచి అవకాశం. అర్హత కలిగిన అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకుని సద్వినియోగం చేసుకోండి.


