|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మైత్రి మూవీ మేకర్స్‌పై ఇళయరాజా కేసు – గుడ్ బ్యాడ్ అగ్లీ

Published: 05-09-2025, 12:11 PM
మైత్రి మూవీ మేకర్స్‌పై ఇళయరాజా కేసు - గుడ్ బ్యాడ్ అగ్లీ

అజిత్ కుమార్ నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్ర నిర్మాతలైన మైత్రి మూవీ మేకర్స్ పై సంగీత దర్శకుడు ఇళయరాజా మద్రాస్ కోర్టులో కేసు వేశారు. సినిమాలో తన పాటలను అనుమతి లేకుండా వాడినట్లు ఆయన ఆరోపించారు.

Key Points

1

అజిత్ నటించిన 'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమాలో ఇళయరాజా పాటలు అనుమతి లేకుండా ఉపయోగించబడ్డాయి.

2

ఇళయరాజా రూ. 5 కోట్ల నష్టపరిహారం కోరుతూ మద్రాస్ హైకోర్టులో కేసు వేశారు.

4

కేసు సెప్టెంబర్ 8న విచారణకు వచ్చే అవకాశం ఉంది.

ఇళయరాజా ఆరోపణలు

అజిత్ ‌ నటించిన ‘ గుడ్ బ్యాడ్ అగ్లీ ‘ మూవీని నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ ‌ పై సంగీత దర్శకులు ఇళయరాజా మద్రాస్ ‌ కోర్టులో కేసు దాఖలు చేశారు . తన సంగీతంలో వచ్చిన పాటలను అనుమతి లేకుండా ఈ సినిమాలో ఉపయోగించారని పిటిషన్ ‌ లో పేర్కొన్నారు . ఇలాంటి చర్యలకు పాల్పడటం కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుందని ఇళయరాజా న్యాయవాదులు తెలిపారు .

నిర్మాతల ప్రతిస్పందన

తెలుగు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కోలీవుడ్ ‌ లో నటుడు అజిత్ కుమార్ ‌ తో ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రాన్ని నిర్మించింది . ఈ సినిమా భారీ విజయం అందుకోవడంతో పాటు బాక్సాఫీస్ ‌ వద్ద సుమారు రూ . 250 కోట్ల కలెక్షన్స్ ‌ రాబట్టి రికార్డ్ ‌ క్రియేట్ ‌ చేసింది . అయితే , ఈ సినిమాలో ఇళయరాజా పాత పాటలను తన అనుమతి లేకుండా ఉపయోగించారు .., అందుకు గాను రూ 5 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలని వారు పేర్కొన్నారు . ఆపై ఏడు రోజుల్లోగా సినిమా నుంచి పాటను తొలగించాలని నోటీసులో డిమాండ్ చేశారు. లేదంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఇళయరాజా న్యాయవాదులు కె. త్యాగరాజన్ , ఎ. శరవణన్ మద్రాస్ హైకోర్టులో కేసు దాఖలు చేశారు.

కేసు విచారణ తేదీ

అయితే, ఆ పాటలకు సంబంధించిన అసలు హక్కుదారుల నుంచి అనుమతి తీసుకున్నామని సినిమా నిర్మాతలు చెబుతున్నారు. కానీ , అసలు యజమాని ఎవరో వెల్లడించలేదని న్యాయవాదులు అంటున్నారు. ఇళయరాజా అనుమతి లేకుండా ఆయన పాటలను పలు సినిమాల్లో నిరంతరం ఉపయోగించడాన్ని నిషేధించాలని వారు కోరారు. ఇప్పటివరకు ఉపయోగించుకున్న వారు తగిన పరిహారం చెల్లించాలని తెలిపారు. ఈ కేసు సెప్టెంబర్ 8న న్యాయమూర్తి సెంథిల్‌కుమార్ ముందు విచారణకు రానుంది.

ఇళయరాజా దాఖలు చేసిన కేసు ఫలితం మరియు సినిమా నిర్మాతల ప్రతిస్పందన వల్ల తెలుగు సినీ పరిశ్రమపై ఎలాంటి ప్రభావం పడుతుందో వేచి చూడాలి. కేసు విచారణ తరువాతే స్పష్టత వస్తుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.