|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: నర్మద కాపురంలో చిచ్చు! ప్రేమకు ప్రమాదం వెనుక అసలు రహస్యం బట్టబయలు!!

Published: 13-04-2026, 12:35 AM
షాకింగ్: నర్మద కాపురంలో చిచ్చు! ప్రేమకు ప్రమాదం వెనుక అసలు రహస్యం బట్టబయలు!!
  • నర్మద జీవితంలో భాగ్యం, వల్లి కుట్రలు! కాపురంలో చిచ్చు పెట్టిన వైనం!
  • ప్రేమను చూడడానికి వచ్చిన రేవతి, శారదమ్మ.. రామరాజు ఇంట్లో సందడి!
  • లారీ డ్రైవర్ వివరాలు తెలుసుకుంటున్న నర్మద! అసలు నిజం బయటపడుతుందా?
  • భార్యపై అనుమానం తీరిన ధీరజ్! చందు చెప్పిన నిజంతో షాక్!

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో సరికొత్త ట్విస్ట్! నర్మద జీవితంలో ఊహించని కుట్రలు, ప్రేమకు ప్రమాదం! అసలు ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాల్సిందే.

భాగ్యం, వల్లి కుట్రలు: నర్మద జీవితంలో కల్లోలం!

ఇల్లు ఇల్లాలు పిల్లలు నేటి ఎపిసోడ్ లో ప్రేమకు ధీరజ్ టిఫిన్ తినిపిస్తూ ఉంటాడు. ఇద్దరూ కాసేపు సరదాగా పోట్లాడుకుంటారు. అదే సమయానికి ప్రేమ తల్లి రేవతి,నాన్నమ్మ శారదమ్మ వస్తారు. వారిద్దరిని అలా చూసి చూడముచ్చటైన జంట అని మెచ్చుకుంటారు. రేవతి కూతురి యోగక్షేమాలు అడుగుతుంది. అదే సమయానికి రామరాజు, తిరుపతి కూడా ఇంట్లోకి వస్తారు. ఆ తర్వాత రేవతి, శారదమ్మ తిరిగి ఇంటికి వెళ్లి పోతారు. సరిగ్గా గుమ్మం దగ్గరకి వెళ్లేసరికి భద్రావతి ఎక్కడికి వెళ్లారని కోపంగా అడుగుతుంది. ఇక చెప్పకతప్పక ప్రేమను చూడడానికి రామరాజు ఇంటికి వెళ్ళామని చెబుతారు. మొదట భద్రావతి కోపంగా మాట్లాడినా.. తర్వాత ప్రేమ గురించి అడిగి తెలుసుకుంటుంది.

ప్రేమను పలకరించిన రేవతి, శారదమ్మ!

ఇక ఇక్కడి నుంచి ఎపిసోడ్ నర్మద దగ్గరికి మారుతుంది. నర్మద.. ప్రేమకు యాక్సిడెంట్ చేసిన లారీ ఎవరిదో అని ఆలోచిస్తూ ఉంటుంది. ఆ యాక్సిడెంట్ అనుకోకుండా జరిగింది కాదని కావాలనే చేసినట్టు ఉందని ప్రేమ చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుంటుంది. ఆర్టీవో ఆఫీస్ లో తనకు తెలిసిన ఫ్రెండ్ కు ఫోన్ చేసి లారీ నెంబర్ ఇచ్చి దాని ఓనర్ ఎవరు, నడిపిన డ్రైవర్ ఎవరో తెలుసుకోమని చెబుతుంది. ఇక ఇక్కడి నుంచి సీన్ ఇడ్లీ బాబాయి, వల్లి, భాగ్యం దగ్గరికి మారుతుంది. ఈ ముగ్గురు కూడా నర్మద తాకట్టు పెట్టిన నగల దుకాణం దగ్గరికి వస్తారు. ఆ నగల దుకాణం వ్యాపారితో నర్మద, సాగర్ పై లేనిపోనివి చెబుతారు. వారికి మీరు పది లక్షల నగలు మాత్రమే తీసుకొని 20 లక్షల క్యాష్ ఇచ్చారని.. కానీ వాళ్ళు మీ అప్పు తీర్చలేరని లేనిపోనివి చెబుతారు. దీంతో ఆ నగల వ్యాపారి భయపడిపోతూ ఉంటాడు. నర్మదకు నగలపై అప్పు ఇచ్చే ముందు రామరాజుకు చెప్పారా? అని కూడా అడుగుతారు దాంతో ఆ వ్యాపారి ఆలోచనలో పడతాడు. వీళ్లు ముగ్గురు షాపు నుంచి బయటకు వచ్చి ఆనంద పడిపోతూ ఉంటారు. నర్మదా కాపురం తగలబడిపోవడం గ్యారంటీ అని భాగ్యం అంటుంది.

లారీ డ్రైవర్ కోసం నర్మద ఆరా!

ఇక్కడి నుంచి సీన్ ప్రేమ, ధీరజ్ దగ్గరికి మారుతుంది. ప్రేమగా తన భార్యకు జ్యూస్ అందిస్తాడు. ధీరజ్ ను చూసి ప్రేమ మురిసిపోతూ ఉంటుంది . ధీరజ్ మాత్రం ప్రేమపై చిర్రుబుర్రులాడుతూనే ఉంటాడు. దీంతో ఈరోజు ఎపిసోడ్ ముగిసిపోతుంది. ఇక రేపటి ఎపిసోడ్లో ధీరజ్ కు ప్రేమ చేసిన తప్పేమీ లేదని తెలుస్తుంది. చందు వచ్చి ఇంట్లో గొడవలకు, అమూల్య జీవితం పాడవ్వడానికి ప్రేమ కారణం కాదని చెబుతాడు. తన భార్య వల్లియే ఈ పనులన్నీ చేసిందని అంటాడు. దీంతో ధీరజ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు.

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ రోజుకో మలుపు తిరుగుతుంది. నర్మద జీవితంలో ఎలాంటి సంఘటనలు ఎదురవుతాయో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.