
📌 Key Points
- వల్లి ప్లాన్ సక్సెస్: రైస్ మిల్లు బాధ్యతల నుంచి తప్పుకున్న రామరాజు!
- షాకింగ్ టర్న్: వల్లి తండ్రి చేతికి రైస్ మిల్లు పగ్గాలు!
- నర్మద కన్నీళ్లు: ఆఫీసులో అవమానాలు, ఇంట్లో నిరాదరణ!
- ప్రేమ సలహా: ధీరజ్ కు అక్క భర్త షూరిటీ!
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో సరికొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. రామరాజు రైస్ మిల్లుకు దూరం కావడం హాట్ టాపిక్ గా మారింది. వల్లి ప్లాన్ ఏ విధంగా వర్కౌట్ అయిందో ఇప్పుడు చూద్దాం.
రైస్ మిల్లులో వల్లి ప్లాన్ సక్సెస్
కారు కి ఫైనాన్స్ దొరకలేదని ధీరజ్ బాధపడుతూ ఉంటాడు. అయితే.. కారు కొనడానికి తన నగలు ఇస్తానని ప్రేమ చెబుతుంది. అయితే.. ఆ నగల కారణంగా ఇంట్లో చాలా సార్లు గొడవలు అయ్యాయని ధీరజ్ వద్దు అంటాడు. అయితే.. మామయ్య కాళ్ల మీద పడితే.. ఆయనే ఇస్తారు కదా అని ప్రేమ అంటుంది. తన తండ్రి కాళ్ల మీద పడటానికి తనకు ఎలాంటి సమస్యలేదని కాకపోతే.. తన తండ్రి దగ్గర డబ్బులు మాత్రం తీసుకోను అని చెప్పేస్తాడు. అయితే.. మీ అక్క భర్త షూరిటీ తీసుకోవచ్చు కదా అని ప్రేమ సలహా ఇస్తుంది.. ఆ సలహా ధీరజ్ కి బాగా నచ్చుతుంది. సలహా ఇచ్చినందుకు ప్రేమకు థ్యాంక్స్ చెబుతాడు.
మరోవైపు ఇడ్లీ బాబాయి… రామరాజు కుర్చీలో కూర్చొని బిల్డప్ కొడుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి రామరాజు వస్తాడు. తండ్రి రావడం చూసి చందూ చాలా సంతోషిస్తాడు. ఎప్పటిలానే మీరు రైస్ మిల్లు చూసుకోండి నాన్న అని చందూ అనబోతుంటే.. వల్లీ.. ఉరుక్కుంటూ వచ్చేసి.. చెప్పనీకుండా ఆపుతుంది. చందూ వాళ్ల నాన్నకు బాధ్యతలు ఇస్తుంటే… వల్లీ ఇవ్వనివ్వదు. మామయ్య గారు.. కాసేపు సరదాగా గాలి పీల్చుకోవడానికి వచ్చారు అని వల్లి పుల్ల వేస్తుంది. ఆ మాట విని రామరాజు కూడా ఇబ్బంది పడతాడు. చందూ, వాళ్ల మామయ్య తిరుపతి.. రామరాజు ని రోజూ మిల్లు కు రావాలని.. రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు. కానీ.. వల్లి మళ్లీ బాధ గాయం రేపుతుంది. ‘ అసలే మామయ్య అమూల్య పెళ్లి విషయం, సాగర్ ఉద్యోగం విషయంలో చాలా బాధగా ఉన్నారు. మిల్లుకు వచ్చేవారు అందరూ బియ్యం రేటు కాకుండా.. మీ చిన్న కూతురు ఇలా చేసింది అంటగా, మీ కొడుకు ఇలా చేశాడు అంటగా అని అంటారు. ఆ మాటలకు మామయ్య ఇంకా ఎక్కువ బాధ పడతారు’ అని వల్లి అంటుంది. వెంటనే రామరాజు.. కూడా అవును నేను రోజూ రైస్ మిల్లుకు రాను అని చెబుతాడు.
ఇక వెంటనే.. వల్లి తన ప్లాన్ అమలులో పెడుతుంది. తన తండ్రి క్యాష్ కౌంటర్ లో కూర్చొని బాధ్యతలు చూసుకుంటాడు అని రామరాజుని ఒప్పిస్తుంది. కాదు అనలేక… రామరాజు సరే అంటాడు. కానీ.. తన బావ కుర్చీలో వల్లి తండ్రి కూర్చోవడం తిరుపతికి నచ్చదు. వల్లి మాత్రం.. ఇక జన్మలో మామయ్య గారు మిల్లులో అడుగుపెట్టరు అని సంతోషపడుతుంది.
బాధలో నర్మద.. దిక్కుతోచని స్థితి!
మరోవైపు.. ఆఫీసులో తన కొలిగ్స్ అన్న మాటలు తలుచుకొని నర్మద బాధపడుతూ ఉంటుంది. ఇంట్లో అత్తగారు కూడా తనతో మాట్లాడకపోవడం తలుచుకొని ఏడుస్తూ నడుచుకుంటూ వెళ్తుంది. నర్మద అలా ఏడుస్తూ రావడం ధీరజ్, ప్రేమ చూస్తారు. ఎందుకు ఏడుస్తున్నావ్? ఏమైంది అని ప్రేమ, ధీరజ్ అడిగితే నర్మద మరింత ఏడుస్తుంది. ఆఫీసులో తనకు జరిగిన అవమానం, అత్తయ్య మాట్లాడకపోవడం అన్నీ చెప్పి మరింత బాధపడుతుంది. ఆమెను ఓదార్చి ఇంటికి తీసుకువస్తారు.
ఇక రామరాజు.. తమ దగ్గర బియ్యం తీసుకునే వారి దగ్గర కలెక్షన్ షాపులకు వెళ్లి తిరుపతిని పరిచయం చేస్తూ ఉంటాడు. వాళ్లతో రామరాజు మాట్లాడుతున్న సమయంలో ప్రేమ తండ్రి అక్కడికి వస్తాడు. అక్కడికి వచ్చి కావాలని రామరాజు పరువు తీస్తాడు. ముఖ్యంగా అమూల్య చేసిన పని, సాగర్ ఉద్యోగం విషయం మొత్తం అందరికీ చెప్పి.. రచ్చ రచ్చ చేస్తాడు. భద్రావతి కూడా వచ్చి మరింత దారుణంగా అవమానిస్తుంది.
ప్రేమ సలహా.. ధీరజ్ కు కొత్త ఆశలు!
ఇక.. తాను చేసిన కుట్ర ఫలించినందుకు వల్లి ఆనందంలో మునిగి తేలుతుంది. ఎగురుకుంటూ ఇంటికి వస్తుంది. అయితే.. ఆమెను చూసిన అత్త వేదవతి.. మామయ్య గారు రైస్ మిల్లు వచ్చారా అని అడుగుతుంది. ఆయన చాలా సంతోషంగా ఉన్నారు అని వల్లి అబద్ధాలు చెబుతుంది. తర్వాత.. నర్మద, ప్రేమ కోపం తెప్పించేలా వల్లి మాట్లాడుతుంది.అప్పుడే.. అక్కడికి నర్మద, ప్రేమ వస్తారు.. నర్మద.. ప్రేమగా అత్తయ్య మీతో మాట్లాడాలి అని అంటే.. వేదవతి తిట్టిన తిట్టకుండా తిడుతుంది. కావాలని.. వల్లి మీద ప్రేమ కురిపిస్తుంది. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది..
కమింగప్ లో.. నర్మద, వేదవతి లను కలపడానికి ప్రేమ, ధీరజ్ ప్లాన్ వేస్తారు. మరి కలుపుతారో లేదో చూడాలి..
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో రోజుకో ట్విస్ట్ ఎదురవుతుంది. వల్లి ప్లాన్ సక్సెస్ కావడంతో కథ ఏ మలుపు తిరుగుతుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


