|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ నుండి ప్రేమ, నర్మద ఔట్! అసలేం జరుగుతోంది?

Published: 17-04-2026, 11:00 AM
షాకింగ్: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ నుండి ప్రేమ, నర్మద ఔట్! అసలేం జరుగుతోంది?
  • స్టార్ మా సీరియల్ ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’లో ఊహించని మార్పులు! టాప్ రేటింగ్స్ ఉన్నా నటీనటుల నిష్క్రమణ.
  • ప్రేమగా మెప్పించిన లావణ్య త్వరలో తల్లి కాబోతోంది, సీరియల్ నుండి నిష్క్రమణ, అభిమానులకు షాక్!
  • నర్మదగా అన్షూ రెడ్డి కూడా సీరియల్ నుండి అవుట్! కారణాలు తెలియాల్సి ఉంది, అభిమానుల్లో ఆందోళన.
  • కొత్త నటీనటులను ప్రేక్షకులు ఆదరిస్తారా? సీరియల్ రేటింగ్స్ పై ప్రభావం చూపే అవకాశం!

స్టార్ మా ఛానల్ లో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సీరియల్ లో ఊహించని మార్పులు చోటుచేసుకున్నాయి. అభిమానులకు ఇది నిజంగా షాకింగ్ న్యూస్.

ప్రేమ పాత్రలో లావణ్య గుడ్ బై!

Illu Illalu Pillalu: స్టార్ మా ఛానెల్ లో టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న సీరియల్స్ లో ఇల్లు ఇల్లాలు పిల్లలు కూడా ఒకటి. ఈ సీరియల్ కథ ఆసక్తికరంగా ఉండటంతో పాటు.. ఆ కథకు తగినట్లు పాత్రకు ప్రాణం పోసిన నటీనటులు కూడా సీరియల్ హిట్ అవ్వడానికి మెయిన్ రీజన్.

మరీ ముఖ్యంగా ప్రేమ, నర్మద క్యారెక్టర్లను ప్రేక్షకులు చాలా ఓన్ చేసుకున్నారు. ప్రేమ పాత్రలో కన్నడ బ్యూటీ లావణ్య నటిస్తుండగా.. నర్మద పాత్రలో మన తెలుగు అమ్మాయి అన్షూ రెడ్డి నటిస్తోంది. వీరిద్దరి నటనకు, వారి క్యారెక్టరైజేషన్ కి విపరీతమైన  ఫాలోయింగ్ ఉంది. అయితే.. ఇప్పుడు ఈ ఇద్దరూ సీరియల్ నుంచి తప్పుకోవడం బాధాకరం.

నర్మద కూడా సీరియల్ కి దూరం..!

ప్రేమ పాత్ర పోషిస్తున్న లావణ్య.. తన జీవితంలో కొత్త అడుగువేస్తోంది. ఆమెకు ఆల్రెడీ పెళ్లై నాలుగు సంవత్సరాలు కాగా.. ఇప్పుడు తల్లి కాబోతుంది. ఈ విషయాన్ని తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో ప్రకటించింది. తన బేబీ బంప్ తో ఉన్న వీడియో షేర్ చేసి.. తల్లి కాబోతున్నట్లు ప్రకటించింది. అయితే… తాను తల్లికాబోతున్నానని తెలిసిన వెంటనే.. ఆమె ఈ సీరియల్ నుంచి తప్పుకుంది. ప్రేమ క్యారెక్టర్ లో లావణ్య నటించదు అనే వార్త బయటకు రాగానే అభిమానులు చాలా బాధపడ్డారు. ఆమె పాత్రలో కొత్తగా ఎవరు వస్తారు? వచ్చిన ఆమెను అభిమానులు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనే సందేహంలో ఉండగానే… అన్షూ రెడ్డి కూడా షాకిచ్చింది.

A post shared by Bharadhwaj✌️ (@lavanya.laav_official)

కొత్త నటీనటులతో సీరియల్ భవితవ్యం?

నర్మద పాత్రలో నటించి అందరి మనసులు గెలిచిన అన్షూ రెడ్డి కూడా తాజాగా ఈ సీరియల్ నుంచి తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే.. అన్షూ ఏ కారణంతో తప్పుకుంది అనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు. మరి.. ఎంతగానో అభిమానించే ఈ ఇద్దరు లేకుండా.. వారి స్థానంలో కొత్త వారిని తీసుకుంటే.. అభిమానులు అంగీకరిస్తారా? కొత్త వారిని ఆదరిస్తారా? వీరిద్దరూ వెళ్లిపోవడం వల్ల సీరియల్ రేటింగ్ ఏమైనా పడిపోతుందా? అనే విషయం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

మొత్తానికి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో ఊహించని మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ మార్పులు సీరియల్ భవిష్యత్తును ఎలా మారుస్తాయో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.