
📌 Key Points
- ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్‌లో వేదవతిని ఇంటికి పంపమని రామరాజును కోరిన తల్లి!
- గుడిలో నర్మద, ప్రేమను క్షమించమని కాళ్లు పట్టుకున్న శ్రీవల్లి, తల్లి భాగ్యం ఆగ్రహం!
- భాగ్యం 10 రోజుల ఛాలెంజ్: కూతురుని తిరిగి ఆ ఇంట్లో అడుగుపెట్టేలా చేస్తానని శపథం!
- పూజలో ధీరజ్‌తో కలిసి కూర్చోవడంపై మురిసిపోయిన ప్రేమ.. భావోద్వేగ సన్నివేశం!
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్‌లో బిగ్ ట్విస్ట్! శ్రీవల్లి చేసిన పనికి భాగ్యం ఎలా రియాక్ట్ అవుతుందో చూడటానికి సిద్ధంగా ఉండండి. అసలు కథ ఇప్పుడే మొదలైంది!
వేదవతిని పుట్టింటికి పంపమని కోరిన తల్లి!
Illu Illalu Pillalu Serial April 4th Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఏప్రిల్ 4వ ఎపిసోడ్‌లో తన ఇంటికి వేదవతిని పంపించమని రామరాజును కోరుతుంది తల్లి. దానికి రామరాజు ఒప్పుకుంటాడు. గుడిలో నర్మద, ప్రేమను కలిసి తనను క్షమించమని కాళ్లు పట్టుకుంటుంది. కానీ, వల్లి తల్లి 10 రోజుల ఛాలెంజ్ చేస్తుంది.
Illu Illalu Pillalu Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్‌లో వేదవతిని చూస్తే తన తల్లిని చూసినట్లు ఉంటుందని ఇంటికి వచ్చిన వేదవతి అమ్మ అంటుంది. ఈ చివరి రోజుల్లో దీంతో కలిసి ఉందామని వచ్చాను. కానీ, ఇక్కడికి వచ్చాకే తెలిసింది ఇది ఆ ఇంటి గడప తొక్కదని, రామరాజు ఓ కోరిక కోరుతాను. తీరుస్తావా. ఒక్క వారం రోజులు వేదవతిని మా ఇంటికి పంపిస్తావా అని ఆమె అడుగుతుంది.
ఇప్పటికీ తనది తప్పు కాదంటుంది, పదా అని ప్రేమ అంటుంది. దాంతో శ్రీవల్లి వేడుకుంటుంది. శ్రీవల్లి చేసిన తప్పులన్నీ ప్రేమ చెబుతుంది. అన్నింటికి ఊరుకుంటే నువ్వు మాత్రం మా కాపురంలో ఎసరు పెట్టాలని చేశావ్. ఇక నిన్ను క్షమించేది లేదంటుంది ప్రేమ. నా కాపురం నిలబెట్టండి సెల్లాయిలు అని క్షమించమని కన్నీళ్లతో అంటుంది శ్రీవల్లి. మా ఆయన్ను వదిలేస్తే నాకు సావే గతి అని నర్మదా, ప్రేమ కాళ్లు పట్టుకుంటుంది శ్రీవల్లి.
శ్రీవల్లి వేడుకోలు.. భాగ్యం సంచలన ఛాలెంజ్!
అమ్మడు వాళ్ల కాళ్ల పట్టుకుంటావేంటీ బుద్ధి లేకుండా. నువ్వు ఈ భాగ్యం కూతురువి, ఇది భరించలేని అవమానం అని ఆపుతుంది భాగ్యం. మీ గురించి ఏమనుకుంటున్నారే. కాపురం నిలబెట్టండి అంటే కాళ్లు పట్టించుకుంటారా. మీరేంటే నా కూతురుని తీసుకెళ్లేది నేనే నా కూతురు ఆ ఇంట అడుగుపెట్టేలా చేస్తాను అని భాగ్యం అంటుంది. హేయ్ అరవకు కాకిలా అరుస్తున్నావ్, నీ తప్పుల వల్లే నీ కూతురు కాపురం ఇలా అయిందని అంటుంది నర్మదా.
నువ్వు వాళ్ల కాళ్ల మీద వేడుకోవడం అవసరం లేదు. నేను నిన్ను ఆ ఇంట్లో అడుగుపెట్టేలా చేస్తాను అన్నాగా. మీరు జన్మలో నా కూతురుని అడుగుపెట్టనివ్వమని అన్నారుగా. పదే పది రోజుల్లో తిరిగి నా కూతురును ఆ ఇంట్లో అడుగుపెట్టించకపోతే నా పేరు భాగ్యం.. భాగ్యలక్ష్మే కాదు అని ఛాలెంజ్ చేస్తుంది. ఇంతదూరం వచ్చింది కాబట్టి మేము కూడా చెబుతున్నాం. నీ కూతురుని ఎలా తీసుకొస్తావో మేము కూడా చూస్తాం అని నర్మద అంటుంది.
శ్రీవల్లి అరవంగా బలవంతంగా తీసుకెళ్తుంది తల్లి భాగ్యం. తర్వాత తనతో పూజలో కలిసి ధీరజ్ కూర్చోవడంపై మురిసిపోతుంది ప్రేమ. ధీరజ్ దగ్గరికి వెళ్లి చేయికి హగ్ చేసుకుని ప్రేమగా ఎమోషనల్ అవుతుంది. వదులు అని ధీరజ్ అంటే.. నీకోసం ఈ గిఫ్ట్ తీసుకొచ్చానురా అని ప్రేమ అంటుంది. వదులు అని గట్టిగా అరుస్తాడు ధీరజ్. నీ మీద నాకు ఉంది అదే అని కోప్పడుతాడు. ఇంకా కోపం ఉందంటావేంట్రా అని ప్రేమ అంటుంది.
భాగ్యం పంతం నెగ్గుతుందా? ఉత్కంఠగా సీరియల్!
నేను నా లైఫ్‌లో చేసిన రెండు తప్పులు ఏంటో తెలుసా. నీ మెడలో తాళి కట్టడం, నా గుండెలో నీ మీద ప్రేమ నింపుకోవడం. ఈ రెండు తప్పులు నన్ను వెక్కిరిస్తూనే ఉంటాయని ధీరజ్ అంటాడు. నాతో ప్రేమగా ఉన్నట్లు నటించి మా కుటుంబానికి ద్రోహం చేయాలని చూశావ్. మీ అన్నకి నా చెల్లికి ప్రేమ రాయబారం నడిపి నా చెల్లి జీవితంతో ఆడుకోవాలని చూశావ్ అని నిందిస్తాడు ధీరజ్.
నువ్వు పొరపాటు పడుతున్నావురా. అమూల్య విషయంలో నాకు ఏ పాపం తెలియదు. నా కుటుంబానికి నేను ఏ ద్రోహం చేయనురా. నీ మీద ప్రేమ ఉన్నట్లు నటించలేదురా అని ఏడుస్తూ చెబుతుంది ప్రేమ. ఆపుతావా నీ డ్రామాలు అని గట్టిగా అరుస్తాడు ధీరజ్. అక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ రోజురోజుకి ఉత్కంఠగా మారుతుంది. భాగ్యం ఛాలెంజ్ ఏమి చేస్తుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి!


