|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: ఇన్స్టాలో హీరోయిన్ల గ్లామర్ దందా! చూస్తే షాక్ అవుతారు!

Published: 07-04-2026, 5:35 AM
షాకింగ్: ఇన్స్టాలో హీరోయిన్ల గ్లామర్ దందా! చూస్తే షాక్ అవుతారు!
  • ఇన్‌స్టాగ్రామ్‌లో సబ్‌స్క్రిప్షన్ పేరుతో నటీమణుల గ్లామర్ షో.. నెలకు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఆదాయం!
  • యువతను ఆకర్షిస్తూ, డబ్బు సంపాదనకు సరికొత్త మార్గం.. కానీ ఇది కెరీర్‌కు ప్రమాదకరమని హెచ్చరిక!
  • బయటకు లీక్ అవుతున్న సబ్‌స్క్రైబర్ కంటెంట్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నటీమణుల ఫోటోలు, వీడియోలు!
  • టాలెంట్ లేకున్నా గ్లామర్‌తో సంపాదన.. ఈ దందాపై పోలీసులు ఫోకస్ పెట్టాలని విజ్ఞప్తి!

టాలీవుడ్‌లో సంచలనం! హీరోయిన్లు ఇన్స్టాగ్రామ్‌లో డబ్బు కోసం దిగజారుతున్నారా? సబ్‌స్క్రిప్షన్ పేరుతో గ్లామర్ షోతో రెచ్చిపోతున్నారా? అసలు ఏం జరుగుతుందో తెలుసుకోండి!

సబ్‌స్క్రిప్షన్ పేరుతో స్కిన్ షో

90వ దశకంలో సినిమాల్లో నటించాలనేది కోట్లాది మంది కల. ఆ కల నిజం చేసుకోవడానికి నటనను, కష్టాన్ని నమ్ముకునే వారు ఆర్టిస్టులు. కానీ, సోషల్ మీడియా యుగంలో ‘షార్ట్ కట్’ సక్సెస్ కోసం కొందరు ఎంచుకుంటున్న దారులు ఇప్పుడు సభ్యసమాజాన్ని విస్మయానికి గురిచేస్తున్నాయి. హీరోయిన్లుగా ఎదగాల్సిన వారు, ఇన్‌ఫ్లుయెన్సర్లుగా మారి.. చివరకు ‘సబ్‌స్క్రిప్షన్’ పేరుతో చేస్తున్న గ్లామర్ షో ఇప్పుడు ఒక వికృత ట్రెండ్‌గా మారింది.

లీక్ అవుతున్న ప్రైవేట్ కంటెంట్

ఇన్‌స్టాగ్రామ్ తన క్రియేటర్ల కోసం ‘సబ్‌స్క్రైబర్స్’ అనే ఫీచర్‌ను తీసుకొచ్చింది. అంటే, కొంత ఫీజు చెల్లించిన వారికే ప్రత్యేకమైన (Exclusive) కంటెంట్ కనిపిస్తుంది. దీన్ని కొందరు నటీమణులు తమ ‘స్కిన్ షో’కి వేదికగా మార్చుకున్నారు. బయటి ప్రపంచానికి పద్ధతిగా కనిపిస్తూనే.. నెలకు రూ.300 నుంచి రూ.400 చెల్లించిన ‘పెయిడ్ బ్యాచ్’ కోసం మాత్రం హద్దులు దాటుతున్నారు. బోల్డ్ ఫోటోలు, అశ్లీలతకు దగ్గరగా ఉండే రీల్స్‌ను కేవలం ఆ సబ్‌స్క్రైబర్ల కోసమే వదులుతున్నారు. అయితే, తాము డబ్బు తీసుకుని కేవలం కొందరికే చూపిస్తున్నాం కాబట్టి సేఫ్ అనుకోవడం వారి భ్రమే అవుతోంది. సబ్‌స్క్రైబర్లలో ఎవరో ఒకరు ఆ కంటెంట్‌ను స్క్రీన్ రికార్డింగ్, స్క్రీన్ షాట్ల ద్వారా బయటకు వదులుతున్నారు. దీంతో అంతా గుట్టగా సాగుతుందని అనుకున్న బోల్డ్ కంటెంట్ కాస్తా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ అయిన ట్విట్టర్, టెలిగ్రామ్‌ లాంటి వాటిల్లో వైరల్ అవుతోంది. దీంతో పైరసీ పుణ్యమా అని సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లుయెన్సర్ల పరువు కాస్త బజారున పడటమే కాకుండా కెరీర్ పరంగా నాశనం అవుతోంది.

పోలీసుల దృష్టికి ఈ దందా?

‘సబ్‌స్క్రైబర్స్’ ఆప్షన్‌తో అడల్డ్ కంటెంట్ మత్తులో పడి యువత తమ కష్టార్జితాన్ని వాటి కోసం ఖర్చు చేస్తున్నారు. ఇలా ఒక్కో ఇన్‌ఫ్లుయెన్సర్లు నెలకు ఎంత లేదన్నా.. రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు రెండు చేతులా సంపాదిస్తున్నారు. టాలెంట్‌తో సంబంధం లేకుండా కేవలం గ్లామర్‌తో ఇంతటి ఆదాయం వస్తుండటంతో, మరికొందరు కూడా ఇదే దారిలో నడవడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికైనా యువతను దృష్టి పెట్టుకుని.. ఇన్‌స్టాలో చేస్తున్న ‘సబ్‌స్క్రైబర్స్’ దందాపై పోలీసులు ఫోకస్ పెట్టాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.

సబ్‌స్క్రిప్షన్ దందాపై మీ అభిప్రాయం ఏమిటి? ఈ వ్యవహారంపై పోలీసులు ఎలా స్పందిస్తారో చూడాలి. మరిన్ని టాలీవుడ్ అప్‌డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.