|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఇంటర్నెట్ లేకున్నా రీల్స్ ఇక ఫ్రీ! ఇన్‌స్టాగ్రామ్ సంచలన ఫీచర్ మీకోసమే!

Published: 29-03-2026, 9:05 AM
ఇంటర్నెట్ లేకున్నా రీల్స్ ఇక ఫ్రీ! ఇన్‌స్టాగ్రామ్ సంచలన ఫీచర్ మీకోసమే!
  • ఇంటర్నెట్ లేకున్నా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూసే ఫీచర్ ను తీసుకురానున్న ఇన్‌స్టాగ్రామ్.
  • ఆఫ్‌లైన్‌లో రీల్స్ చూడటానికి ‘స్మార్ట్ డౌన్‌లోడ్స్’ సిస్టమ్‌పై పని చేస్తున్న ఇన్‌స్టాగ్రామ్.
  • వీడియోల డౌన్‌లోడ్ పరిమితిని సెట్ చేసుకునే అవకాశం, మొబైల్ డేటా ఆదా కోసం వై-ఫై ఓన్లీ ఆప్షన్.
  • నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్ తరహాలో డౌన్‌లోడ్ చేసిన రీల్స్‌ను ప్రత్యేక సెక్షన్లో చూడవచ్చు.

ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు ఒక శుభవార్త! ఇకపై మీరు ఇంటర్నెట్ లేకున్నా రీల్స్ చూడవచ్చు. ఇన్‌స్టాగ్రామ్ కొత్తగా ‘స్మార్ట్ డౌన్‌లోడ్స్’ అనే ఫీచర్‌ను తీసుకువస్తోంది. దీని ద్వారా రీల్స్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఆఫ్‌లైన్‌లో కూడా చూడవచ్చు.

ఆఫ్‌లైన్ రీల్స్ ఫీచర్ వచ్చేస్తోంది!

Instagram Reels : ఇంటర్నెట్ లేకుండా కూడా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూడొచ్చు తెలుసా? కంపెనీ ఈ సరికొత్త ఫీచర్ తీసుకువస్తోంది. నెట్‌వర్క్ లేకపోయినా మీకు ఎంటర్ టైన్మెంట్ కొరత ఉండదు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Instagram Reels : ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు భారీ గుడ్ న్యూస్.. ఇన్‌స్టాలో సరికొత్త ఫీచర్ రాబోతుంది. ఇకపై ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ఇంటర్నెట్ (ఆఫ్‌లైన్‌లో) లేకుండా కూడా చూడొచ్చు. రీల్స్ ఆఫ్‌లైన్ ఫీచర్‌ అతి త్వరలోనే ఇన్‌స్టాగ్రామ్ ప్రవేశపెట్టనుంది. నెట్ లేకుండా రీల్స్ చూసేందుకు ఈ ఫీచర్ అద్భుతంగా ఉంటుంది.

ఇన్‌స్టాగ్రామ్ సరిగ్గా ఈ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తోంది. కొత్తగా లీక్ డేటా ప్రకారం.. వినియోగదారులు రీల్స్‌ను ఆఫ్‌లైన్‌లో చూసేందుకు వీలు కల్పించే ఆటోమేటిక్ డౌన్‌లోడ్ సిస్టమ్‌పై ఈ ప్లాట్‌ఫామ్ పనిచేస్తోంది.

స్మార్ట్ డౌన్‌లోడ్స్‌తో సులభంగా రీల్స్ డౌన్‌లోడ్

సిస్టమ్‌లో స్మార్ట్ డౌన్‌లోడ్స్ ఫీచర్ : ఈ ఇన్ స్టా కొత్త ఫీచర్ వివరాలను టిప్‌స్టర్ అలెశాండ్రో పలూజీ రివీల్ చేశారు. యాప్‌లోని సీక్రెట్ ఫీచర్‌కు సంబంధించి స్క్రీన్‌షాట్‌ కూడా షేర్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్ ‘Smart Downloads’ వంటి సిస్టమ్‌ను డెవలప్ చేస్తోందని తెలుస్తోంది. ఇకపై ఇన్ స్టా వీడియోలను ఆటోమేటిక్‌గా ముందుగానే డౌన్‌లోడ్ చేస్తుంది.

ఈ ఫీచర్‌లో ‘మేనేజ్ ఆఫ్‌లైన్ డౌన్‌లోడ్స్” అనే కొత్త ఆప్షన్ ఉంది. రీల్స్ సెక్షన్ వద్ద త్రి డాట్స్ మెనూలో కనిపిస్తుంది. వినియోగదారులు ఎన్ని వీడియోలను డౌన్‌లోడ్ చేయాలో యాప్ ఎంత స్టోరేజ్‌ను వాడుకోవచ్చు అనేది కంట్రోల్ చేయొచ్చు.

Read Also : Best AC Deals : కొత్త ఏసీ కావాలా బ్రో.. ఈ సమ్మర్‌లో బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ AC డీల్స్.. మీ ఇల్లంతా కూల్ కూల్..!

డేటా ఆదా చేసే ఆప్షన్స్ కూడా ఉన్నాయి!

వీడియో డౌన్‌లోడ్ లిమిట్ : అనవసరమైన మొబైల్ డేటా వినియోగాన్ని నివారించేందుకు ఇన్‌స్టాగ్రామ్ “వై-ఫై ఓన్లీ” అనే ఆప్షన్ కూడా అందించనుంది. వినియోగదారులు 10, 30, లేదా 50 వీడియోల వంటి గరిష్ట సంఖ్యలో రీల్స్‌ను సేవ్ చేసుకోవచ్చు. ఎందుకంటే లిమిట్ లేకపోతే ఈ యాప్ మీ ఫోన్ స్టోరేజ్‌నింపేస్తుంది. తద్వారా మెమరీ స్టోరేజీ ఇష్యూ రావొచ్చు.

అందుకే డౌన్‌లోడ్ చేసిన రీల్స్‌ ఆఫ్‌లైన్‌లో చూసే విధానం ఉండవచ్చు. వినియోగదారులు వాటిని తమ సాధారణ ఫీడ్‌లో చూడవచ్చు. ఇక్కడ వీడియోలు ఇంటర్నెట్ లేకుండా కూడా ప్లే అవుతాయి, లేదా ప్రత్యేకమైన ‘డౌన్‌లోడ్స్’ సెక్షన్ ద్వారా వాటిని యాక్సెస్ చేయవచ్చు.

ఈ విధానం నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్ వంటి ప్లాట్‌ఫారమ్‌ల మాదిరిగా ఉంటుంది. స్మార్ట్ డౌన్‌లోడ్స్ ఫీచర్ ఇప్పటికే ఆయా ప్లాట్‌ఫారాల్లో ఉంది. వినియోగదారులు కంటెంట్‌ను ఆఫ్‌లైన్‌లో చూడొచ్చు. ఈ ఫీచర్‌ అధికారిక లాంచ్ తేదీ రివీల్ చేయలేదు. ఈ లీక్‌ వివరాలను పరిశీలిస్తే ఇన్‌స్టాగ్రామ్ ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ చేస్తోందని తెలుస్తోంది.

ఇన్‌స్టాగ్రామ్ తీసుకురాబోతున్న ఈ సరికొత్త ఫీచర్ యూజర్లకు ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది. ముఖ్యంగా ఇంటర్నెట్ లేని ప్రదేశాల్లో ఉన్నప్పుడు ఇది ఒక గొప్ప ఎంటర్టైన్మెంట్ ఆప్షన్ అవుతుంది. త్వరలోనే ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.