|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఇన్వెస్టిగేషన్‌తోపాటు మూఢ నమ్మకాల కాన్సెప్ట్, నాకు కూడా ఛాన్స్ ఇస్తే బాగుండు: ఫేవరెట్ ఓటీటీ సిరీస్‌పై హీరో నవీన్ చంద్ర

Published: 19-06-2025, 8:48 PM
ఇన్వెస్టిగేషన్‌తోపాటు మూఢ నమ్మకాల కాన్సెప్ట్, నాకు కూడా ఛాన్స్ ఇస్తే బాగుండు: ఫేవరెట్ ఓటీటీ సిరీస్‌పై హీరో నవీన్ చంద్ర

తెలుగు ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్స్‌తో పేరు తెచ్చుకున్న నవీన్ చంద్ర, తాజాగా ‘విరాటపాలెం: పీసీ మీనా రిపోర్టింగ్’ ట్రైలర్‌ను విడుదల చేశాడు. ఈ సిరీస్‌లో ఇన్వెస్టిగేషన్‌తో పాటు మూఢనమ్మకాల కాన్సెప్ట్ కూడా ఉంది.

Key Points

1

నవీన్ చంద్ర 'విరాటపాలెం: పీసీ మీనా రిపోర్టింగ్' ట్రైలర్ రిలీజ్ చేశాడు.

2

ఇన్వెస్టిగేషన్ మరియు మూఢనమ్మకాల కాన్సెప్ట్‌తో ఆకట్టుకునే సిరీస్.

4

నవీన్ చంద్ర ఈ సిరీస్‌లో నటించాలని కోరుకుంటున్నాడు.

నవీన్ చంద్ర విరాటపాలెం ట్రైలర్ రిలీజ్

తెలుగు ఓటీటీ క్రైమ్ థ్రిల్లర్స్‌తో ఎక్కువ పాపులారిటీ తెచ్చుకున్న టాలీవుడ్ హీరో నవీన్ చంద్ర. రీసెంట్‌గా లెవెన్, బ్లైండ్ స్పాట్ ఓటీటీ సినిమాలతో అలరించాడు. అయితే, తెలుగులో సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్‌గా వస్తోన్న తెలుగు ఓటీటీ వెబ్ సిరీస్ విరాటపాలెం: పీసీ మీనా రిపోర్టింగ్ ట్రైలర్‌ను తాజాగా నవీన్ చంద్ర రిలీజ్ చేశాడు.

రెక్కీ లాంటి సీడ్ ఎడ్జ్ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ తర్వాత అదే మేకర్స్ నుంచి వస్తోన్న మరో తెలుగు సిరీస్ విరాటపాలెం: పీసీ మీనా రిపోర్టింగ్. కృష్ణ పోలూరు దర్శకత్వం వహించిన విరాటపాలెం: పీసీ మీనా రిపోర్టింగ్ సిరీస్‌లో అభిజ్ఞ వూతలూరు, చరణ్ లక్కరాజు ప్రధాన పాత్రలు పోషించారు.

జూన్27 నుంచి జీ5 లో విరాటపాలెం: పీసీ మీనా రిపోర్టింగ్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో గురువారం (జూన్19) విరాటపాలెం: పీసీ మీనా రిపోర్టింగ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హీరో నవీన్ చంద్ర విరాటపాలెం: పీసీ మీనా రిపోర్టింగ్ ట్రైలర్ రిలీజ్ చేశాడు. అనంతరం ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు నవీన్ చంద్ర.

ఇన్వెస్టిగేషన్ మరియు మూఢనమ్మకాల కథాంశం

నవీన్ చంద్ర మాట్లాడుతూ .. “విరాటపాలెం : పీసీ మీనా రిపోర్టింగ్ పోస్టర్ నాకు చాలా నచ్చింది. అభిజ్ఞ పోలీస్ ఆఫీసర్‌గా చాలా చక్కగా కనిపిస్తున్నారు. రెక్కీ నాకు చాలా ఇష్టమైన ఓటీటీ సిరీస్. ఆ డైరెక్టర్ మళ్లీ ‘విరాటపాలెం : PC మీనా రిపోర్టింగ్’తో రాబోతోన్నారు” అని అన్నాడు.

“అభిజ్ఞ, చరణ్ అద్భుతంగా నటించారనిపిస్తోంది. చాయ్ బిస్కెట్ నుంచి అభిజ్ఞ నాకు తెలుసు. ఆమె అద్భుతమైన నటి. దివ్య లాంటి రైటర్లకు మంచి గుర్తింపు రావాలి. ఈ సిరీస్‌లో నాకు కూడా ఛాన్స్ ఇస్తే బాగుండు. ఈ సిరీస్ అద్భుతమైన విజయం సాధిస్తుంది” అని నవీన్ చంద్ర తెలిపాడు.

జీ5లో విడుదల తేదీ

“ఈ విరాటపాలెం పీసీ మీనా రిపోర్టింగ్ ట్రైలర్‌లో ఎంగేజింగ్ ఇన్వెస్టిగేషన్‌తో పాటు మూఢ నమ్మకాల కాన్సెప్ట్‌ని కూడా టచ్ చేసినట్టు కనిపిస్తోంది. జూన్ 27న జీ5 ఓటీటీ లోకి రాబోతోన్న ఈ సిరీస్‌తో టీంకు మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను” అని హీరో నవీన్ చంద్ర కోరాడు.

ఇదే ఈవెంట్‌లో డైరెక్టర్ కృష్ణ పోలూరు మాట్లాడుతూ .. “నేను జీ5లో ఇది వరకు రెక్కీ ఓటీటీ వెబ్ సిరీస్ చేశాను. అది అద్భుతమైన విజయం సాధించింది. మళ్లీ ఇప్పుడు ‘విరాటపాలెం : పీసీ మీనా రిపోర్టింగ్’ చేశాను. ఈ ప్రాజెక్ట్‌కి దివ్య గారు కథను అందించారు. రెక్కీలానే ఈ ప్రాజెక్ట్‌ని కూడా ఎంజాయ్ చేస్తూ చేశాను. ఈ సిరీస్ కూడా అందరినీ ఆకట్టుకుంటుంది” అని చెప్పారు.

విరాటపాలెం: పీసీ మీనా రిపోర్టింగ్ సిరీస్‌కు నవీన్ చంద్ర మంచి విజయం కోరుకున్నారు. మూఢనమ్మకాలు మరియు ఇన్వెస్టిగేషన్‌ల కథాంశం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.