
📌 Key Points
- లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో కోల్కతా నైట్ రైడర్స్ ఓటమి
- లక్నో 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది
- కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 181 పరుగులు చేసింది
- లక్నో చివరి వరకు పోరాడి లక్ష్యాన్ని ఛేదించింది
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చివరి వరకు పోరాడిన లక్నో గెలుపును సొంతం చేసుకుంది.
ఉత్కంఠ పోరులో లక్నో విజయం
IPL 2026 సీజన్లో నేడు కోల్కతా నైట్ రైడర్స్ vs లఖ్నవూ సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన ఉత్కంఠ మ్యాచులో లఖ్నవూ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి కేకేఆర్ 181 పరుగులు సాధించింది. కెప్టెన్ రహానే 41 పరుగులు, వికెట్ కీపర్ రఘువంశీ (45), గ్రీన్ (32), పావెల్ (39) పరుగులు చేసి రాణించారు. ఇక అనంతరం 182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లఖ్నవూ… చివరి వరకూ పోరాడి 3 వికెట్ల తేడాతో లక్ష్యాన్ని చేధించింది. బదోని(54), ముకుల్ చౌదరీ(54) పరుగులు చేసారు. చివర్లో ముకుల్ ఫోర్లు, సిక్సులతో విరుచుకు పడటంతో LSG విజయం సొంతం చేసుకుంది. దీంతో KKR ఖాతాలో మరో ఓటమి నమోదైంది.
కేకేఆర్ బ్యాటింగ్ వివరాలు
లక్నో సూపర్ జెయింట్స్ ఛేజింగ్
చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో లక్నో విజయం సాధించింది. ముకుల్ చౌదరి మెరుపు ఇన్నింగ్స్ లక్నో విజయంలో కీలక పాత్ర పోషించింది. కేకేఆర్ మరో ఓటమితో నిరాశపడింది.


