
📌 Key Points
- ముల్లాన్ పూర్ వేదికగా జరిగిన IPL ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ విజయం.
- వైభవ్ సూర్యవంశీ 29 బంతుల్లో 97 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు.
- సన్‌రైజర్స్ హైదరాబాద్ 196 పరుగులకే ఆలౌట్, 47 పరుగుల తేడాతో ఓటమి.
- రాజస్థాన్ రాయల్స్ ఇప్పుడు క్వాలిఫైయర్-2లో గుజరాత్‌తో తలపడనుంది.
ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ అద్భుత ప్రదర్శనతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను చిత్తు చేసింది. యంగ్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగ్‌తో రాజస్థాన్ భారీ స్కోరు సాధించగా, హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ తడబడటంతో రాజస్థాన్ ఘన విజయం సాధించింది.
రాజస్థాన్ రాయల్స్ విధ్వంసకర బ్యాటింగ్
ముల్లాన్ పూర్ వేదికగా జరుగుతున్న IPL ఎలిమినేటర్ మ్యాచులో రాజస్థాన్ రాయల్స్(RR), హైదరాబాద్ సన్ రైజర్స్(SRH)పై 47 పరుగుల తేడాతో సూపర్ విక్టరీ సాధించింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆరెంజ్ టీమ్ బౌలర్లకు రాజస్థాన్ యంగ్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ చుక్కలు చూపించాడు. ఫోర్లు సిక్సులు బాదుతూ.. కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. సన్ రైజర్స్ బౌలర్లు ఎవరూ సూర్యవంశీ పరుగుల వరదకు అడ్డుకట్ట వేయలేకపోయారు. కాగా నిర్ణీత 20 ఓవర్లకు రాజస్థాన్ 243 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇక 244 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన హైదరాబాద్.. ఓపెనర్ అభిషేక్ శర్మ డకౌట్ అవడం.. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ లో అభిషేక్, హెడ్, కిషన్ ల వికెట్లు కూడా కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో చిక్కుకుంది. నితీశ్ కుమార్‌రెడ్డి (38), సలీల్ అరోరా (35), ఇషాన్ కిషన్ (33) రాణించగా.. మిగతావారు అనుకున్నంత స్థాయిలో ఆకట్టుకోకపోవడంతో సన్‌రైజర్స్ ఓటమి తప్పలేదు. 19.2 ఓవర్లలో 196 పరుగులకే ఆల్ ఔట్ కావడంతో 47 రన్స్ తేడాతో రాజస్థాన్ విక్టరీ నమోదు చేసింది. అటు బ్యాటింగులోనూ, ఇటు బౌలింగులోనూ సత్తా చాటిన RR.. ఎల్లుండి గుజరాత్ తో క్వాలిఫైయర్-2 ఆడనుంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ పరాజయం
క్వాలిఫైయర్-2కు రాజస్థాన్ దూకుడు
ఈ విజయంతో రాజస్థాన్ రాయల్స్ క్వాలిఫైయర్-2కు అర్హత సాధించింది. అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు బౌలింగ్‌లోనూ సత్తా చాటిన రాజస్థాన్, తదుపరి మ్యాచ్‌లోనూ ఇదే జోరు కొనసాగించి ఫైనల్‌కు చేరుకోవాలని ఆశిద్దాం.


