|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

తుపాకీ కాదు.. ఇది రాజకీయ ఎత్తుగడ! కగార్ ఆపరేషన్ వెనుక అసలు సూత్రధారి ఈయనే!

Published: 31-03-2026, 10:05 AM
తుపాకీ కాదు.. ఇది రాజకీయ ఎత్తుగడ! కగార్ ఆపరేషన్ వెనుక అసలు సూత్రధారి ఈయనే!
  • మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సుందర్ రాజ్ వ్యూహాత్మక మార్పులు తెచ్చారు.
  • పోలీస్ క్యాంపులు ఏర్పాటు చేసి మావోయిస్టుల సరఫరా వ్యవస్థను దెబ్బతీశారు.
  • గిరిజన యువతకు DRG, బస్తర్ ఫైటర్స్ వంటి విభాగాల్లో ప్రాధాన్యం కల్పించారు.
  • ఆపరేషన్ కగార్ గడువు ముగియనున్న వేళ ఐపీఎస్ సుందర్ రాజ్ పేరు మారుమోగుతోంది.

మావోయిస్టు రహిత దేశంగా మార్చాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ గడువు ముగుస్తోంది. ఈ నేపథ్యంలో, మావోయిస్టులను బలహీనపరచడంలో కీలక పాత్ర పోషించిన ఐపీఎస్ సుందర్ రాజ్ గురించి తెలుసుకుందాం.

ఆపరేషన్ కగార్ నేపథ్యం, లక్ష్యాలు

తుపాకీ ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన ఈ దేశంలో దశాబ్దాలుగా సాయుధ పోరాటం సాగించిన మావోయిస్టు పార్టీ ప్రస్తానం చివరి అంకానికి చేరుకుంది. మావోయిస్టు రహిత దేశంగా మార్చడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ (Operation Kagaar) గడువు మరికొన్ని గంటల్లో ముగియబోతోంది. 2025 జనవరిలో ప్రారంభించిన ఈ ఆపరేషన్ కు ఇవాళ్టితో ఎండ్ కార్డు పడబోతోంది. ఆ తర్వాత ఈ ఆపరేషన్ కొనసాగుతుందా లేదా అనేది కేంద్ర ప్రభుత్వ నిర్ణయమే అయినప్పటికీ దీని ప్రభావం మావోయిస్టు పార్టీని పూర్తిగా బలహీన పరిచింది. అయితే ఆపరేషన్ కగారు ఇటీవలే వచ్చినా.. మావోయిస్టు పార్టీని బలహీన పర్చడంలో సుదీర్ఘ కాలంగా పని చేసిన ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాశంగా మారింది. తాను బాధ్యతలు చేపట్టాక వ్యూహంలో మార్పులు చేసి సరికొత్త పంథాలో ఈ పోరాటాన్ని ముందుకు తీసుకువెళ్లారు. ఆయనే ఛత్తీస్‍గఢ్ లోని బస్తర్ ఐజీ పి.సుందర్ రాజ్.

ఒకప్పుడు నెత్తుటి ఏరులు పారిన బస్తర్ (Bastar) అడవుల్లో ఇప్పుడు శాంతి గీతం వినిపించడంలో సుందర్ రాజ్ (IG Sundarraj) పాత్ర కీలకం. తమిళనాడులోని కోయంబత్తూర్‍కు చెందిన ఒక సాధారణ రైతు కుటుంబంలో సుందర్‌రాజ్ జన్మించారు. వ్యవసాయ విశ్వవిద్యాలయంలో డిగ్రీ పూర్తి చేసిన ఆయన.. 2003లో తన మొదటి ప్రయత్నంలోనే యూపీఎస్సీ (UPSC) సాధించి ఛత్తీస్‌గఢ్ క్యాడర్ ఐపీఎస్ అధికారిగా ఎంపికయ్యారు. అయితే ఆయన సర్వీసులో అత్యధిక కాలం నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లోనే గడిచిపోయింది. మావోయిస్టుల నిర్మూల బాధ్యతలు చేపట్టాక సుందర్ రాజ్ అప్పటి వరకు అనుసరించిన వ్యూహం మార్చారు. ‘రియాక్టివ్’ నుండి ‘ప్రోయాక్టివ్’ గా కొత్త పంథా తీసుకున్నారు. గతంలో నక్సలైట్లు దాడి చేస్తే పోలీసులు స్పందించేవారు.కానీ సుందర్‌రాజ్ బాధ్యతలు చేపట్టాక వ్యూహాన్ని మార్చి మావోయిస్టు స్థావరాలపై ముందస్తుగా దాడులు జరిపారు. దట్టమైన అటవీ ప్రాంతాల్లో కొత్త పోలీస్ క్యాంపులు ఏర్పాటు చేసి మావోయిస్టులకు అందుతున్న వస్తు సామగ్రి సరఫరా వ్యవస్థను దెబ్బతీశారు.

సుందర్ రాజ్ వ్యూహాలతో మావోయిస్టులకు చెక్

ఛత్తీస్ గఢ్ అడవుల్లో వేళ్లనుకుపోయిన మావోయిజాన్ని కేవలం తుపాకీతోనే అంతం చేయలేమని గ్రహించిన సుందర్ రాజ్.. గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధిపై ఫోకస్ పెట్టారు. స్థానిక యువతకు ప్రాధాన్యం ఇస్తూ DRG, బస్తర్ ఫైటర్స్ వంటి విభాగాల్లో స్థానిక గిరిజన యువతకు చోటు కల్పించేలా చేశారు. మావోయిస్టులపై జరిపిన పోరాటంలో ఇది ఓ ‘టర్నింగ్ పాయింట్’ గా నిలిచిందని చెబుతున్నారు. ఇలా నియమించబడిన వారికి స్థానిక భాష, భౌగోళిక పరిస్థితులపై ఉన్న అవగాహన పోలీసులకు పెద్ద ఆయుధంగా మారింది. ఇక స్కూళ్లు ఏర్పాటుతో పాటు మావోయిస్టులు నక్సల్స్ ధ్వంసం చేసిన పాఠశాలలను పునర్నిర్మించారు. హింసను వీడి వచ్చే వారికి ‘పునరావాసం’ కల్పించి గౌరవ ప్రదమైన జీవితాన్ని కల్పించేలా చేశారు.

గిరిజనులకు ప్రాధాన్యం: సుందర్ రాజ్ విజయం

ఆపరేషన్ కగార్ డెడ్ లైన్ ఇవాళ్టితో ముగియనున్న నేపథ్యంలో తాజాగా ఓ జాతీయ మీడియాతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా పలు కీలక విషయాలు వెల్లడించారు. మావోయిస్టుల నిర్మూలన తుపాకీతో కాకుండా నమ్మకంతో గెలిచామని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన 2026 మార్చి 31 గడువు నాటికి బస్తర్ నుంచి నక్సలిజం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని చెప్పారు.

సుందర్ రాజ్ తీసుకువచ్చిన మార్పులు, గిరిజనులకు కల్పించిన ప్రాధాన్యత బస్తర్ ప్రాంతంలో శాంతి నెలకొల్పడానికి దోహదపడ్డాయి. ఆయన సేవలు చిరస్మరణీయం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.