|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

టెహ్రాన్‌లో భీకర పేలుళ్లు! లైవ్ రిపోర్టింగ్ మధ్యలో విధ్వంసం, ఖామేనీ హతం!

Published: 10-03-2026, 3:05 PM
టెహ్రాన్‌లో భీకర పేలుళ్లు! లైవ్ రిపోర్టింగ్ మధ్యలో విధ్వంసం, ఖామేనీ హతం!
  • ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు, టెహ్రాన్‌లో పేలుళ్లు.
  • లైవ్ కవరేజ్ ఇస్తుండగానే పేలుళ్లు సంభవించినా రిపోర్టర్ కొనసాగించారు.
  • ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖామేనీ ఇంటిపై ఇజ్రాయెల్ బాంబు దాడి, ఖామేనీ మృతి.
  • చమురు, గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో ఇండియాలో నిల్వలు తగ్గుతున్నట్లు సమాచారం.

ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. లైవ్ కవరేజ్ ఇస్తుండగానే పేలుళ్లు సంభవించాయి. ఇదిలా ఉండగా, ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖామేనీ మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ పరిణామం యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేసింది.

టెహ్రాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు

ఇరాన్ వర్సెస్ అమెరికా, ఇజ్రాయెల్ మధ్య వార్ దాదాపు పది రోజులుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఇరాన్ రాజధాని టెహ్రాన్ ను టార్గెట్ చేసి దాడులకు తెగబడ్డాయి అమెరికా, ఇజ్రాయెల్. మంగళవారం రోజున ఈ టెహ్రాన్ నగరాన్ని టార్గెట్ చేసుకొని మరీ, భయంకరమైన వైమానిక దాడులకు పాల్పడ్డారు. ఇరాన్ స్టేట్ టీవీ హెడ్ క్వార్టర్స్ సమీపంలో కూడా భారీ ఎత్తున పేలుళ్లు జరిగాయి. ఈ నేపథ్యంలో స్టేట్ టీవీ ప్రసారాలు కూడా పూర్తిగా నిలిచిపోయినట్లు సమాచారం అందుతోంది.

లైవ్ కవరేజ్‌లో పేలుళ్లు, రిపోర్టర్ ధైర్యం

ఇరాన్ స్టేట్ టీవీ హెడ్ క్వార్టర్స్ సమీపంలో ఓ రిపోర్టర్ లైవ్ కవరేజ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో భారీ ఎత్తున పేలుళ్లు సంభ‌వించాయి. అయినప్పటికీ ఆ రిపోర్టర్ ఏ మాత్రం భయపడలేదు. ఒకసారి ఉలిక్కిపడి, ఆ తర్వాత తన లైవ్ కవరేజ్ పూర్తి చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఈ సందర్భంగా భారీ ఎత్తున శబ్దాలు ఈ వీడియోలో గమనించవచ్చు. ఇది ఇలా ఉండగా ఫిబ్రవరి 28వ తేదీన ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖామేనీ మృతి చెందారు.

అలీ ఖామేనీ మృతి, యుద్ధం తీవ్రతరం

అలీ ఖామేనీ ఇంటిపై ఇజ్రాయెల్ భయంకరమైన బాంబు దాడులు చేసింది. ఈ క్రమంలో అలీ ఖామేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు 8 మంది మరణించారు. ఇక అలీ ఖామేనీ మృతి త‌ర్వాత యుద్ధం మ‌రింత భ‌యంక‌రంగా మారిపోయింది. అటు గ‌ల్ఫ్ దేశాల‌పై ఇరాన్ దాడులు చేస్తోన్న క్ర‌మంలో చ‌మురు, గ్యాస్ స‌ర‌ఫ‌రా ఆగిపోయిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. దీంతో ఇండియాలో నిల్వ‌లు కూడా త‌గ్గిపోతున్న‌ట్లు స‌మాచారం. క్లిక్

ఇరాన్‌లో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. దాడులు, పేలుళ్లు, కీలక నేత మృతితో గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగాయి. దీని ప్రభావం అంతర్జాతీయంగా కనిపిస్తోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.