|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఇరాన్‌లో ఒక్కసారిగా పేలుడు! భారత విద్యార్థులు క్షేమమేనా?

Published: 03-03-2026, 9:05 PM
ఇరాన్‌లో ఒక్కసారిగా పేలుడు! భారత విద్యార్థులు క్షేమమేనా?
  • ఇరాన్‌లో భారత విద్యార్థుల హాస్టల్‌కు 300 మీటర్ల దూరంలో వైమానిక దాడి.
  • హాస్టల్ భవనం షేక్ అవ్వడంతో విద్యార్థులు భయాందోళనలకు గురయ్యారు.
  • ఉర్మియా నగరంలో అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిగాయి.
  • కాశ్మీరీ విద్యార్థులు ఉర్మియా యూనివర్సిటీలో చదువుకుంటున్నారు.

ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం తీవ్రరూపం దాల్చింది. ఉర్మియా నగరంపై అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిపాయి. ఈ దాడుల కారణంగా భారత విద్యార్థులు ఉంటున్న ప్రాంతంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది.

ఉర్మియాలో వైమానిక దాడులు

ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. దాదాపు నాలుగు రోజులుగా యుద్ధం భయంకరంగా జరుగుతోంది. ఈ యుద్ధం కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోవడమే కాకుండా ఆస్తి నష్టం కూడా జరుగుతోంది. అయితే ఈ నేపథ్యంలో ఇరాన్ లోని ఉర్మియా నగరంపైన అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిపాయి. ఈ నేపథ్యంలోనే భారత విద్యార్థులు ఉంటున్న స్థావరానికి 300 మీటర్ల దూరంలోనే పేలుడు సంభవించింది.

విద్యార్థులు ఈ పేలుడు సంభవించిన ప్రదేశానికి 300 మీటర్ల దూరంలోనే హాస్టల్లో ఉన్నారు. అయితే ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో విద్యార్థులు ఉన్న హాస్టల్ బిల్డింగ్ షేక్ అయిపోయింది. దీంతో భయాందోళనకు గురయ్యారు విద్యార్థులు. ప్రతి గంటకు ఫైటర్ జట్లు వస్తున్నాయని విద్యార్థులు చెబుతున్నారు. సిటీలోని ప్రజలు వెళ్లిపోతున్నారని ఎమోషనల్ అవుతున్నారు. దాడి తర్వాత ఆ ప్రాంతమంతా పొగ కమ్మేసిన వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఉర్మియా యూనివర్సిటీలో కాశ్మీరీ విద్యార్థులు చదువుకుంటున్నట్లు సమాచారం అందుతోంది.

భారత విద్యార్థుల హాస్టల్‌కు సమీపంలో పేలుడు

భయాందోళనలో విద్యార్థులు

ఇరాన్‌లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. భారత విద్యార్థుల భద్రతపై ఆందోళన నెలకొంది. ప్రభుత్వం తక్షణమే స్పందించి విద్యార్థులను సురక్షితంగా తరలించాలని కోరుతున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.