|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: ఖమేనీ భార్య మరణ వార్తల్లో నిజమెంత? ఇరాన్ సంచలన ప్రకటన!

Published: 12-03-2026, 6:05 PM
షాకింగ్: ఖమేనీ భార్య మరణ వార్తల్లో నిజమెంత? ఇరాన్ సంచలన ప్రకటన!
  • ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతోంది.
  • దివంగత అలీ ఖమేనీ భార్య మరణించారనే వార్తలను ఇరాన్ మీడియా ఖండించింది.
  • మన్సౌరే ఖోజస్తే బఘెర్జాదే ఇంకా బతికే ఉన్నారని ఐఆర్జీసీ అనుబంధ మీడియా సంస్థ స్పష్టం చేసింది.
  • కొత్త సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ కోమాలో ఉన్నారని అంతర్జాతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి.

ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో, ఇరాన్ సుప్రీం నాయకుడు ఖమేనీ భార్య మరణించారనే వార్త సంచలనం సృష్టించింది. అయితే, ఇరాన్ మీడియా ఈ వార్తలను ఖండిస్తూ ఆమె బతికే ఉన్నారని ప్రకటించింది. ఈ అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధ పరిస్థితులు

ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధం భయంకరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఏ ఒక్క దేశం కూడా వెనక్కి తగ్గడం లేదు. తలవంచడం లేదు. యుద్ధంలో ముందుకు వెళ్లడం తప్ప, మరో మార్గం లేనట్లే వ్యవహరిస్తున్నాయి. ఈ తరుణంలో వేలాది మంది సైనికులు మరణిస్తున్నారు. ఇరాన్ సుప్రీం నాయకుడు దివంగత అలీ ఖమేనీ ఫిబ్రవరి 28వ తేదీన ఇజ్రాయెల్ దాడుల్లో మరణించారు. అయినప్పటికీ యుద్దం ఆగడం లేదు.

అయితే ఇలాంటి నేపథ్యంలో ఓ షాకింగ్ నిజం బయట పెట్టింది ఇరాన్ మీడియా. ఇజ్రాయిల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం నాయకుడు దివంగత అలీ ఖమేనీ ( Supreme Leader Ali Khamenei) భార్య మన్సౌరే ఖోజస్తే బఘెర్జాదే ( Mansoureh Khojasteh Bagherzadeh) చనిపోయినట్లు వచ్చిన వార్తలను ఖండించింది ఇరాన్ మీడియా. ఆమె ఇంకా బతికే ఉన్నారని ఐఆర్జీసీ అనుబంధం మీడియా సంస్థ ఫార్స్ స్పష్టం చేసింది.

ఖమేనీ భార్య మరణ వార్తలపై ఖండన

కొత్త సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ కూడా తన తొలి అధికారిక ప్రసంగంలో తల్లి మరణించారని ఎక్కడ ప్రస్తావించలేదు అని గుర్తు చేసింది. దీంతో ఇరాన్ సుప్రీం లీడర్ దివంగ‌త‌ ఖ‌మేనీ భార్య బతికే ఉందని చర్చ జరుగుతోంది. కాగా కొత్త సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ కోమాలో ఉన్నాడ‌ని కొన్ని అంత‌ర్జాతీయ మీడియా సంస్థ‌లు వెల్ల‌డించాయి.

కొత్త సుప్రీం లీడర్ పరిస్థితి ఏమిటి?

A post shared by muslim_ voice (@voice_of_muslim111)

ఇరాన్ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఖమేనీ భార్య బతికే ఉండటం, కొత్త లీడర్ కోమాలో ఉండటం అనేక ప్రశ్నలను రేకెత్తిస్తోంది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.