
📌 Key Points
- ఇరాన్ దాడుల్లో అమెరికాకు రూ.7525 కోట్ల నష్టం వాటిల్లిందని అంచనా.
- బోర్డాన్‌లోని థార్ రాడార్ వ్యవస్థ ధ్వంసం కావడం వల్ల రూ.4000 కోట్ల నష్టం జరిగింది.
- ఇరాన్ క్షిపణులు, డ్రోన్లు యూఎస్ డిఫెన్స్ సిస్టమ్‌ను ఛేదించాయి.
- యుద్ధంలో ఆయుధాల ఎగుమతులను స్విట్జర్లాండ్ అమెరికాకు నిలిపివేసింది.
ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధంలో అమెరికాకు భారీ నష్టం వాటిల్లింది. ఇరాన్ వైమానిక దాడుల కారణంగా దాదాపు రూ.7525 కోట్ల నష్టం వాటిల్లిందని అంచనా. దీనికి తోడు స్విట్జర్లాండ్ ఆయుధాల ఎగుమతులను నిలిపివేయడం అమెరికాకు మరింత కష్టాన్ని కలిగించింది.
ఇరాన్ దాడులతో అమెరికాకు భారీ నష్టం
ఇరాన్‌తో యుద్ధం జరుగుతోన్న సంగతి తెలిసిందే. అయితే, ఈ యుద్ధం నేపథ్యంలో అగ్ర రాజ్యం అమెరికాకు ఊహించని షాక్ తగిలినట్లు కథనాలు వస్తున్నాయి. పశ్చిమాసియాలోని అమెరికన్ మిలిటరీ బేస్ లపై ఇరాన్ వైమానిక దాడులు జరుపుతూనే ఉంది. ఈ దాడుల్లో నేపథ్యంలో అమెరికాకు రూ.7525 కోట్లు నష్టం వాటిల్లినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. యుద్ధం మొదలైన తొలి రెండు వారాల్లోనే ఈ నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నాయి బీబీసీ, CSIS లాంటి అంతర్జాతీయ సంస్థలు. బోర్డాన్ లోని థార్ రాడార్ వ్యవస్థ ధ్వంసం కావడం వల్ల సుమారు రూ. 4000 కోట్ల వరకు నష్టం జరిగినట్లు తెలుస్తోంది.
ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లు యూఎస్ డిఫెన్స్ సిస్టన్ని ఛేదించి ఈ విధ్వంసాలు సృష్టించినట్లు సమాచారం. అటు అగ్రరాజ్యం అమెరికాకు ఆయుధాల ఎగుమతులను ఐరోపా దేశం స్విట్జర్లాండ్ నిషేధించిన సంగతి తెలిసిందే. యుద్ధం కొనసాగుతున్నంత కాలం.. ఆయుధాల ఎగుమతుల్ని అనుమతించబోమని స్విట్జర్లాండ్ వెల్లడించింది. ఇరాన్‌తో యుద్ధంలో పాల్గొంటున్న దేశాలకు ఆయుధాల ఎగుమతి లైసెన్స్లు జారీ చేయలేమని కుండబద్దలు కొట్టింది. యుద్ధంలో ఉపయోగించే ఆయుధాల్ని అమెరికాకు ఎగుమతి చేయడం అనుమతించబోమని ప్రకటన చేసినట్లు సమాచారం.
థార్ రాడార్ వ్యవస్థ ధ్వంసం – పెను నష్టం
ఆయుధాల ఎగుమతులపై స్విట్జర్లాండ్ ఆంక్షలు
యుద్ధం కారణంగా అమెరికా ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా, ఆయుధాల కోసం ఇతర దేశాలపై ఆధారపడవలసి వస్తోంది. ఇది అమెరికా యొక్క భవిష్యత్ వ్యూహాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.


