|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఘనంగా ప్రారంభమైన ‘ఇరువురు భామల కౌగిలిలో’ సినిమా.. గెస్ట్‌గా స్టార్ డైరెక్టర్

Published: 09-11-2025, 5:44 AM
ఘనంగా ప్రారంభమైన ‘ఇరువురు భామల కౌగిలిలో’ సినిమా.. గెస్ట్‌గా స్టార్ డైరెక్టర్

దర్శకేంధ్రుడు కె. రాఘవేంద్రరావు పర్యవేక్షణలో తెరకెక్కుతున్న ‘ఇరువురు భామల కౌగిలిలో’ సినిమా ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. త్రినాద్ వర్మ, వైష్ణవి కొల్లూరు, మలినా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. నిహారిక కొణిదెల, బి. గోపాల్ వంటి ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

Key Points

1

కె. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో ‘ఇరువురు భామల కౌగిలిలో’ సినిమా ప్రారంభం.

2

త్రినాద్ వర్మ హీరోగా, వైష్ణవి కొల్లూరు, మలినా హీరోయిన్లుగా నటిస్తున్నారు.

4

ఏ. కోదండరామిరెడ్డి, మల్లిక్‌రామ్ వంటి ప్రముఖులు పూజా కార్యక్రమాలకు హాజరయ్యారు.

సినిమా ప్రారంభోత్సవ విశేషాలు

దర్శకేంధ్రుడు కె.రాఘవేంద్రరావు(K. Raghavendra Rao) దర్శకత్వ పర్యవేక్షణలో అచ్యుత్‌ చౌదరి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ఇరువురు భామల కౌగిలిలో’(Iruvuru bhamala kougililo). దీపా ఆర్ట్స్‌ శ్రీనివాస గౌడ్‌ నిర్మాతగా ఎంతో అట్టహాసంగా అతిరథ మహారుధుల సమక్షంలో హైదరాబాద్‌ అన్నపూర్ణ స్టూడియోలో ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి. అనంతరం దర్శకులు కె.రాఘవేంద్రరావు స్క్రిప్ట్‌ను నటీనటులు, దర్శక, నిర్మాతలకు అందచేశారు. ‘కమిటీ కుర్రాళ్లు’ ఫేమ్‌ త్రినాద్‌ వర్మ హీరోగా, వైష్ణవి కొల్లూరు, మలినా హీరోయిన్లుగా అక్షర గౌడ కీలకపాత్రలో నటిస్తోన్న ఈ చిత్రంలో ఎంతోమంది ప్రముఖ నటులు నటించనున్నారు.

మూవీ ప్రారంభోత్సవం సందర్భంగా హీరో హీరోయిన్లపై నిహారిక కొణిదెల (Niharika Konidela)క్లాప్‌నివ్వగా.. ప్రముఖ దర్శకులు బి.గోపాల్‌ కెమెరా స్విచాన్‌ చేశారు. ఫస్ట్‌షాట్‌కి ప్రముఖ దర్శకులు ఎ. కోదండరామిరెడ్డితో పాటు నిర్మాత, కెమెరామెన్‌ ఎస్‌ గోపాల్‌రెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ చిత్ర ఓపెనింగ్‌కి ‘కమిటీ కుర్రాళ్లు’ దర్శకుడు యధు వంశీతో పాటు ఆ సినిమాలో నటించిన నటీనటులందరూ పాల్గొన్నారు. వీరితో పాటు ‘టిల్లు స్క్వేర్’ దర్శకుడు మల్లిక్‌రామ్, వర ముళ్లపూడి తదితరులు ఓపెనింగ్‌ పూజా కార్యక్రమాలకు హాజరయ్యారు. ఈ చిత్రానికి శీను భీట్స్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే మేకర్స్ ‘ఇరువురు భామల కౌగిలిలో’ రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించనున్నట్లు సమాచారం.

నటీనటులు, సాంకేతిక నిపుణులు

ప్రముఖుల సందడి

మొత్తం మీద, ‘ఇరువురు భామల కౌగిలిలో’ సినిమా ప్రారంభోత్సవం ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ కొత్త ప్రాజెక్ట్ తెలుగు సినీ ప్రేక్షకులలో ఉత్సాహాన్ని నింపుతోంది. త్వరలోనే షూటింగ్‌ మొదలుపెట్టి, సినిమా పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.