|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

విజయ్ ‘జన నాయగన్’.. బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’ రీమేకా? అనిల్ రావిపూడి షాకింగ్ నిజం!

Published: 31-12-2025, 9:30 AM
విజయ్ 'జన నాయగన్'.. బాలకృష్ణ 'భగవంత్ కేసరి' రీమేకా? అనిల్ రావిపూడి షాకింగ్ నిజం!
  • దళపతి విజయ్ చివరి చిత్రం ‘జన నాయగన్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
  • బాలకృష్ణ సూపర్ హిట్ మూవీ ‘భగవంత్ కేసరి’కి రీమేక్ అంటూ ప్రచారం జరుగుతోంది.
  • రీమేక్ వార్తలపై దర్శకుడు అనిల్ రావిపూడి స్పందిస్తూ, ‘రిలీజ్ వరకు వేచి చూడాలి’ అన్నారు.
  • ‘భగవంత్ కేసరి’ని నిర్మించిన KVN ప్రొడక్షన్స్ సంస్థే ‘జన నాయగన్’ను నిర్మిస్తుండటం అనుమానాలకు కారణం.

దళపతి విజయ్ ఆఖరి చిత్రం ‘జన నాయగన్’ బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’కి రీమేకా అనే వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి. ఈ విషయంపై దర్శకుడు అనిల్ రావిపూడి ఆసక్తికరంగా స్పందించారు. అసలు నిజమేమిటంటే…

రీమేక్ వార్తలపై అనిల్ రావిపూడి స్పందన

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ ఆఖరి చిత్రం ‘జన నాయగన్’.. బాలకృష్ణ సూపర్ హిట్ మూవీ ‘భగవంత్ కేసరి’కి రీమేక్ అనే వార్తలు జోరందుకున్నాయి. దీనిపై తాజాగా దర్శకుడు అనిల్ రావిపూడిని అడగ్గా ఆయన స్పందించారు. ఆ డైరెక్టర్ వాళ్లు కూడా దాచిపెట్టి చెబుతున్నారని, అది విజయ్ మూవీలాగే చూద్దామని అనిల్ రావిపూడి అన్నారు.

తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ నటిస్తున్న ఆఖరి చిత్రం ‘జన నాయగన్’ (Thalapathy 69)పై అంచనాలు ఆకాశాన్నంటాయి. అయితే, ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లినప్పటి నుంచి ఒక ఆసక్తికరమైన వార్త ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది.

నందమూరి బాలకృష్ణ నటించిన 2023 బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ‘భగవంత్ కేసరి’కి దళపతి విజయ్ నటించే జన నాయగన్ రీమేక్ అని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ విషయంపై తాజాగా భగవంత్ కేసరి డైరెక్టర్ అనిల్ రావిపూడిని మీడియా అడగ్గా ఆయన ఇంట్రెస్టింగ్‌గా సమాధానం ఇచ్చారు.

‘జన నాయగన్’ నిజంగానే రీమేకా?

“నిజానికి వాళ్లు కూడా చాలా దాచిపెట్టి చెబుతున్నారు డైరెక్టర్ కూడా. కొంతమంది అది రీమేక్ అంటున్నారు, మరికొంతమంది కాదు అంటున్నారు. ఇది దళపతి విజయ్ గారి సినిమా అని ఆ డైరెక్టర్ గారు చెప్పారు. కాబట్టి, ఈ సినిమా రిలీజ్ అయ్యేవరకు ఆ సినిమా లాగే ట్రీట్ చేద్దాం” అని డైరెక్టర్ అనిల్ రావిపూడి అన్నారు.

“వారిసు షూటింగ్ సమయంలో విజయ్ గారిని నేను రెండు సార్లు కలిశాను. ఆయన సూపర్బ్ జెంటిల్‌మెన్. ఆయన పొలిటికల్‌గా వెళ్తూ ఆయన నటిస్తున్న ఆఖరి చిత్రం. దాంట్లో నా పాత్ర ఉందా లేదా అనేది రేపు రిలీజ్ అయ్యాక తెలుస్తుంది. రిలీజ్ అయ్యాక అదేంటో కచ్చితంగా అందరికి తెలుస్తుంది” అని అనిల్ రావిపూడి చెప్పారు.

బలపడుతున్న అనుమానాలు.. కారణం ఇదే!

“ఆ సినిమా రిలీజ్ అయ్యాక మాట్లాడటం కరెక్ట్. కాబట్టి రిలీజ్ అయ్యేంతవరకు అది ఆ రీమేకా ఈ రీమేకా అని కాకుండా.. దాంట్లో వాళ్లు ఏం చేశారో అనేది రిజల్ట్ తర్వాత చూస్తే అర్థం అవుతుంది. అప్పటివరకు అది దళపతి విజయ్ ఫిల్మ్ అంతే” అని అనిల్ రావిపూడి ముగించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ప్రస్తుతం ‘జన నాయగన్’ సినిమాను ‘భగవంత్ కేసరి’ని నిర్మించిన కెవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తుండటంతో ఈ అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఇదిలా ఉంటే, జన నాయగన్ సినిమాలో విజయ్ సరసన పూజా హెగ్డే చేస్తోంది.

‘జన నాయగన్’ రీమేకా కాదా అనేది సినిమా విడుదలయ్యాకే స్పష్టమవుతుంది. అయితే, ప్రస్తుతం ఉన్న వార్తలు, నిర్మాణ సంస్థల బంధం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.