|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సినిమా ఐటెం సాంగ్స్: శృంగారమా? అసభ్యత ప్రదర్శనా? దిగజారుతున్న టాలీవుడ్ పాటల తీరు!

Published: 18-03-2026, 5:05 AM
సినిమా ఐటెం సాంగ్స్: శృంగారమా? అసభ్యత ప్రదర్శనా? దిగజారుతున్న టాలీవుడ్ పాటల తీరు!
  • ఐటెం సాంగ్స్ శృతి మించుతున్నాయని విమర్శలు.
  • ‘KD’ చిత్రం పాటపై నెటిజన్ల ఆగ్రహం, విజువల్స్ దారుణంగా ఉన్నాయంటూ కామెంట్స్.
  • సుకుమార్ మార్క్ ఐటెం సాంగ్స్‌లోనూ డబుల్ మీనింగ్ డైలాగులు ఉంటున్నాయని విమర్శ.
  • గుంటూరు కారంలో బూతు డైలాగ్‌ను వాడటం టాలీవుడ్ దిగజారుడుతనానికి నిదర్శనమని విమర్శకులు అంటున్నారు.

ప్రస్తుతం సినిమా పాటల పరిస్థితి దారుణంగా తయారైంది. ఐటెం సాంగ్స్ పేరుతో అసభ్యకరమైన పదాలు, డబుల్ మీనింగ్ డైలాగులతో నింపేస్తున్నారు. ఇది కుటుంబ సభ్యులతో కలిసి చూసే విధంగా లేవని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఐటెం సాంగ్స్‌లో శృతి మించుతున్న అసభ్యత?

Item songs: ఒకప్పుడు సినిమా పాట అంటే సాహిత్యం, సంగీతం మేళవింపు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు కురవాలంటే ‘అడల్ట్ కంటెంట్’ ఉండాల్సిందే అన్నట్లుగా తయారైంది మేకర్స్ తీరు . చిన్న పిల్లలు, కుటుంబ సభ్యులు కలిసి చూస్తారన్న కనీస జ్ఞానం లేకుండా పచ్చి బూతులు, డబుల్ మీనింగ్ డైలాగులతో పాటలను నింపేస్తున్నారు. స్కిన్ షో అయితే మరీ హద్దులు దాటిపోతోంది.

‘KD’ నుంచి ‘పుష్ప’ వరకు అంతా అదే దారి కన్నడ స్టార్ ధ్రువ సర్జా నటిస్తున్న ‘KD – ది డెవిల్’ చిత్రంలోని రీసెంట్ ఐటమ్ సాంగ్ ఇప్పుడు నెట్టింట దుమారం రేపుతోంది. ఈ పాటలో సాహిత్యం తో పాటు విజువల్స్ మరీ దారుణంగా ఉన్నాయి. ఐటమ్ సాంగ్ అంటే కేవలం ఎక్స్‌పోజింగ్ మాత్రమే అన్నట్లుగా, వెస్ట్రన్ అడల్ట్ సినిమాలను తలపించేలా చిత్రీకరించారు. కేవలం మాస్ ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించడమే లక్ష్యంగా పెట్టుకుని, సినిమా విలువలను గాలికి వదిలేసినట్లు కనిపిస్తోంది.

కుటుంబంతో కలిసి చూసే విధంగా పాటలు ఉండటం లేదా?

స్టార్ హీరోల సినిమాల్లోనూ అదే బాట సుకుమార్ మార్క్ ఐటమ్ సాంగ్స్ అంటేనే ఒక రేంజ్‌లో ఉంటాయి. కానీ ‘పుష్ప ‘ లోని ఊ అంటావా చూస్తే..సమంత గ్లామర్‌ను వాడుకోవడంలో తప్పులేదు కానీ, ఆ లిరిక్స్‌లో అక్కడక్కడా దొర్లే పదాలు ఫ్యామిలీతో కలిసి వినడానికి ఇబ్బందిగా ఉన్నాయని విమర్శకుల  వాదన .యానిమల్ లోని  జమాల జమాల అనే  పాట మ్యూజికల్ గా పెద్ద హిట్ అయినా, సినిమాలో దాని చిత్రీకరణ మరియు బాబీ డియోల్ ఎంట్రీ సీన్ లోని రక్తపాతం, హింస అడల్ట్ కంటెంట్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచాయి.మహేష్ బాబు లాంటి స్టార్ హీరో  నటించిన గుంటూరు కారంలో  కుర్చీ మడతపెట్టి  అనే  ఒక సోషల్ మీడియా ‘బూతు’ డైలాగ్‌ను మెయిన్ హుక్ లైన్ గా పెట్టుకుని పాట చేయడం టాలీవుడ్ ఏ స్థాయికి పడిపోయిందో అర్థం అవుతుంది.ఇక  విజయ్ దేవరకొండ – అనన్య పాండే కాంబినేషన్లో వచ్చిన లైగర్ లో  – ఆక్డీ పాక్డీ  పాటలో సాహిత్యం కంటే హీరోయిన్ డ్రెస్సింగ్, మూమెంట్స్ మరీ అసభ్యంగా ఉన్నాయనే కామెంట్స్ వచ్చాయి. పూరి జగన్నాథ్ సినిమాల్లో డబుల్ మీనింగ్ అనేది కామన్ అని, ఇక వల్గారిటీ అనేది ఒక ట్రేడ్ మార్క్ లా మారిపోవడం దురదృష్టకరం. ఇలా తవ్వుకుంటూ పొతే ఇక్కడ కోకొల్లలు.

కలెక్షన్ల కోసం కక్కుర్తి.. భావితరాల పరిస్థితి ఏంటి? ఇప్పుడున్న చిన్న పిల్లలు ఈ పాటలను ఈజీగా క్యాచ్ చేసేస్తున్నారు. అర్థం తెలియకపోయినా ఆ ‘బూతు’ పదాలను పాడుతుంటే తల్లిదండ్రులు తలదించుకోవాల్సిన పరిస్థితి. మొత్తానికి ‘అడల్ట్ కంటెంట్ ఉంటేనే సినిమా ఆడుతుంది’ అనే ఒక రాంగ్ సిగ్నల్ ఇండస్ట్రీకి వెళ్ళిపోయింది. దీంతో ప్రతి సినిమాలో ఒక ‘హాట్ ఐటమ్ సాంగ్’ ఉండటం తప్పనిసరి అయిపోయింది. కంటెంట్ మీద నమ్మకం లేకే మేకర్స్ ఇలాంటి అడ్డదారుల వైపు వెళ్తున్నారా? అన్న అనుమానం కలుగుతోంది.

కలెక్షన్ల కోసం దిగజారుతున్న సినిమా విలువలు?

సెన్సార్ బోర్డు నిద్రపోతోందా? లిరిక్స్‌లో పచ్చిగా బూతులు ఉన్నా, విజువల్స్ లో అసభ్యత రాజ్యమేలుతున్నా సెన్సార్ బోర్డు ఎలా పర్మిషన్ ఇస్తోంది? అన్నదే ఇపుడు పెద్ద ప్రశ్న. థియేటర్లలో విజిల్స్ వేయించుకోవడానికి మేకర్స్ పడే ఈ తాపత్రయం, భవిష్యత్తులో సినిమా అంటే కేవలం బూతు అన్న ట్యాగ్ వేయడం ఖాయం.ఏది ఏమైనా కనీసం చిన్న పిల్లలను దృష్టిలో ఉంచుకుని అయినా పాటల్లో హద్దులు పాటించకపోతే, భవిష్యత్తులో సినిమా రంగానికి ఉన్న గౌరవం మాత్రం మంటగలిసిపోవడం మాత్రం  పక్కా !

మొత్తానికి ఐటెం సాంగ్స్ పేరుతో వస్తున్న పాటలు ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరుస్తున్నాయి. ఇలాంటి పాటల వల్ల భావితరాలపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఆలోచించాల్సిన అవసరం ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.