
మలయాళ సినిమాల్లో బాలనటిగా ప్రయాణం ప్రారంభించిన ఇవానా, తమిళ, తెలుగు సినిమాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ‘లవ్ టుడే’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ హీరోయిన్, తాజా ఫోటోషూట్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
Key Points
ఇవానా మలయాళ సినిమా పరిశ్రమలో బాలనటిగా ప్రయాణం ప్రారంభించింది.
తమిళ, తెలుగు సినిమాల్లో విజయవంతంగా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.
‘లవ్ టుడే’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది.
సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ, తన ఫోటోలతో అభిమానులను అలరిస్తోంది.
ఇవానా సినిమా ప్రస్థానం
మాస్టర్స్ అనే మలయాళ సినిమా ద్వారా చిత్ర పరిశ్రమకు బాలనటిగా ఎంట్రీ ఇచ్చింది కుర్ర హీరోయిన్ ఇవానా. అలాగే సహాయ నటిగా రాణి పద్మిని సినిమాలో నటించి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. అనురాగ కరికిన్ వెల్లంలో ప్రధాన పాత్ర పోషించింది. దీంతో దర్శకుడు బాలా తన తమిళ చిత్రం నాచియార్‌లో జ్యోతిక, జి. వి. ప్రకాష్ కుమార్‌లతో కీలక పాత్రల్లో నటించేందుకు ఇవానాను ఎంచుకున్నాడు. ఈ చిత్రం ఝాన్సీగా తెలుగులో డబ్ చేశారు కూడా.
తెలుగు తెరపై ఇవానా
ఈ బ్యూటీ మలయాళం, తమిళ భాషా చిత్రాల్లోనే కాకుండా.. తెలుగులో కూడా నటించి మెప్పించింది. ప్రదీప్ రంగనాథన్, ఇవానా జంటగా నటించిన తమిళ సినిమా లవ్ టుడే 2022 నవంబరు 25న తెలుగులోను విడుదల అయింది. దీంతో తెలుగు ప్రేక్షకులకు ఆమె మరింత దగ్గర అయింది. 2018లోనే తమిళ డబ్బింగ్ చిత్రం ఝాన్సీతో తెలుగులో పరిచయం అయింది.
సోషల్ మీడియాలో ఇవానా
తర్వాత ఈ ముద్దుగుమ్మ నాచియార్, హీరో, లవ్ టుడే, ఎల్‌జీఎం, సెల్ఫిష్ వంటి సినిమాల్లో అవకాశం దక్కించుకుంది. అయితే ఈ హీరోయిన్ ప్రేక్షకులకు పలకడానికి సులువుగా ఉండేందుకు అలీనా షాజీ అనే తన పేరును ఇవానాగా మార్చుకుంది. ఇకపోతే ఈమె సినిమా షూటింగ్‌లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా ఇవానా బ్లాక్ కలర్ డ్రెస్‌లో అదిరిపోయే ఫొటో షూట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవ్వడంతో కుర్రాళ్లు టెప్టింగ్ కామెంట్లు చేస్తున్నారు.
తన అందం, నటనతో ప్రేక్షకులను మెప్పిస్తున్న ఇవానా, భవిష్యత్తులో మరింత విజయవంతమైన సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావాలని ఆశిద్దాం.


