
జబర్దస్త్ కమెడియన్ మహీధర్ తన ప్రేమ కథను వెల్లడించాడు. ఆయన యూట్యూబ్ సబ్‌స్క్రైబర్‌తో ప్రేమలో పడి, త్వరలోనే వివాహం చేసుకోబోతున్నాడు. వారి ప్రేమ కథ వివరాలు ఇక్కడ చూడండి.
Key Points
జబర్దస్త్ మహీధర్ తన యూట్యూబ్ సబ్‌స్క్రైబర్‌తో ప్రేమలో పడ్డాడు.
వారిద్దరి కుటుంబాలు పెళ్లికి అంగీకరించాయి.
2019 నుండి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు.
త్వరలోనే వీరి వివాహం జరగనుంది.
మహీధర్ యొక్క ప్రేమకథ
Jabardasth Mahidhar : జబర్దస్త్ కామెడీ షోతో ఎంతోమంది కమెడియన్స్, నటీనటులు పరిశ్రమకు పరిచయమైన సంగతి తెలిసిందే. అందులో మహీధర్ ఒకరు. జబర్దస్ లో ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి తర్వాత రైటర్ గా, టీమ్ లీడర్ గా ఎదిగాడు మహీధర్. కానీ అక్కడ జరిగిన పలు సంఘటనలతో జబర్దస్త్ మానేసాడు. ప్రస్తుతం యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని రివ్యూలు, ఇంటర్వ్యూలు చేస్తూ మరో పక్క ఓ కేఫ్ బిజినెస్ పెట్టాడు మహీధర్.(Jabardasth Mahidhar)
తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మహీధర్ తన ప్రేమ కథ గురించి చెప్పాడు.
యూట్యూబ్ సబ్‌స్క్రైబర్ తో ప్రేమ
Also See : Divyabharathi : చీరలో మెరిపిస్తున్న తమిళ భామ దివ్యభారతి..
మహీధర్ మాట్లాడుతూ.. నాకు లవర్ ఉంది. త్వరలోనే పెళ్లి చేసుకుంటాం. రాజమండ్రి అమ్మాయి. వైజాగ్ లో ఆంధ్ర యూనివర్సిటీ లో MSC అయిపోయింది. యూనివర్సిటీలో చదివేటప్పుడు నాకు పరిచయం అయింది. తను నా యూట్యూబ్ ఛానల్ సబ్ స్క్రైబర్. తనే మొదట నాకు ఇన్‌స్టాగ్రామ్ లో మెసేజ్ చేసింది. నా ఫ్యాక్ట్ వీడియోస్ చూసేది. నా వీడియోస్ బాగున్నాయి అంటూ మెసేజ్ చేసింది. తర్వాత పండగలకు, పుట్టిన రోజులకు మెసేజ్ లు చేసి బాగా పరిచయం అయింది. నేను వైజాగ్ లోనే ఉంటున్నాను తను కూడా వైజాగ్ లోనే చదువుతుందని తెలిసి బయట కలిసాము. తర్వాత మా పరిచయం ప్రేమగా మారింది. 2019 నుంచి ప్రేమ ఉంది. మా ఇద్దరి ఇళ్లల్లో ఒప్పుకున్నారు. త్వరలోనే పెళ్లి చేసుకుంటాము అని తెలిపాడు.
త్వరలో వివాహం
ఇలా యూట్యూబ్ వీడియోలు చూసి సబ్ స్క్రైబర్ మెసేజ్ చేసి ప్రేమించుకొని పెళ్లి చేసుకోబోతుండటం.. ఈ లవ్ స్టోరీ కొత్తగా ఉందే అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.
Also See : Shivathmika Rajashekar : చీరలో సింపుల్ లుక్స్ తో అలరిస్తున్న శివాత్మిక..
మహీధర్ మరియు ఆయన భవిష్యత్తు భార్య యొక్క ప్రేమకథ ఆకట్టుకునే విధంగా ఉంది. వారి జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతోంది.


