|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: జబర్దస్త్ సత్యశ్రీకి అవమానం! సినీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా తప్పని తిప్పలు!!

Published: 11-04-2026, 5:35 AM
షాకింగ్: జబర్దస్త్ సత్యశ్రీకి అవమానం! సినీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా తప్పని తిప్పలు!!
  • జబర్దస్త్ సత్యశ్రీకి అవమానం: ‘ఈ మొహంతో యాక్టింగ్‌ చేస్తావా’ అని ప్రశ్నించిన సినీ పెద్దలు!
  • సినిమా అవకాశాల కోసం ప్రయత్నించిన సత్యశ్రీకి చేదు అనుభవాలు, ఎదురుదెబ్బలు!
  • సత్యశ్రీ తల్లి నటిగా రాణించినా, తన ప్రయత్నాల్లో అవమానాలు తప్పలేదన్న సత్యశ్రీ!
  • ఫిజికల్‌ హెరాస్‌మెంట్‌ లేదని, బోల్డ్‌గా ఉండటం వల్ల అలాంటి సాహసాలు ఎవరూ చేయలేదన్న సత్యశ్రీ!

జబర్దస్త్ కామెడీ షోతో వెలుగులోకి వచ్చిన సత్యశ్రీ గురించి ఒక షాకింగ్ న్యూస్! ఆమె సినీ కెరీర్ ఆరంభంలోనే ఊహించని అవమానాలు ఎదుర్కొందట. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం!

సత్యశ్రీకి ఎదురైన అవమానాలు!

జబర్దస్త్ కామెడీ షో ద్వారా చాలా మంది ఆర్టిస్ట్ లు ఇండస్ట్రీలోకి వచ్చారు. మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. స్టార్‌ కమెడియన్లుగా రాణించారు. అలా జబర్దస్త్ షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న వారిలో జబర్దస్త్‌ సత్య శ్రీ ఒకరు. ఆమె చమ్మక్‌ చంద్రతో కలిసి చేసిన కామెడీ ఇప్పటికీ మర్చిపోలేరు. గయ్యాలి భార్యగా సత్యశ్రీ చంద్రపై విరుచుకుపడే తీరు ఆకట్టుకుంటుంది. నవ్వులు పూయిస్తుంది. వీరి జంట బాగా పాపులర్‌ అయ్యింది. అయితే చంద్ర కోసమే ఆమె జబర్దస్త్ లోకి వచ్చిందట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. రావడమేకాదు, అంతే బాగా నటించి, నవ్వించింది. ఇప్పుడు సినిమాల్లో మెరుస్తుంది సత్యశ్రీ. ఈ క్రమంలో లేటెస్ట్ గా తనకు ఎదురైన కొన్ని సంఘటనలను పంచుకుంది సత్య.

సత్యశ్రీ మొదట సినిమా ప్రయత్నాలు చేసింది. చాలా ఆఫీస్‌ల చుట్టూ తిరిగిందట. ఈ క్రమంలో తాను చాలా అవమానాలు ఫేస్‌ చేసినట్టు తెలిపింది. ఆఫర్స్ ఇవ్వాలని అడిగితే, కొందరు మొహం మీదే అవమానించినట్టు తెలిపింది. నువ్వు యాక్టింగ్‌ చేస్తావా? అసలు యాక్టింగ్‌ వచ్చా? ఈ మొహంతో యాక్టింగ్‌ చేస్తావా? అంటూ దారుణంగా అవమానించారట. ఇలాంటి సంఘటనలు చాలానే ఉన్నాయని చెప్పింది. సత్య శ్రీ తల్లి సినిమాల్లో ఉంది. ఆమె చాలా సినిమాల్లో నటించింది.  `పెదరాయుడు`లో బ్రహ్మానందంకి భార్యగా చేసింది. ఇంకా చాలా సినిమాల్లో నటించింది.  ఈలెక్కన సత్యశ్రీకి సినిమా బ్యాక్‌ గ్రౌండ్‌ బాగానే ఉంది. దీంతో ఆమెకి ఇండస్ట్రీలోకి వెళ్లడం ఈజీనే, కానీ, తనకు అలా జరగలేదని, అందరిలాగానే తాను ఆఫీస్‌ల చుట్టూ తిరిగినట్టు తెలిపింది సత్యశ్రీ.

సినిమా బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా కష్టాలు!

సినిమా బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్నా కూడా అవమానాలు, ఎదురుదెబ్బలు తగిలినట్టు వెల్లడించింది సత్యశ్రీ. అయితే వాటిని తాను పాజిటివ్‌గా తీసుకుని, వాటినే ఆయుధంగా మలుచుకుని తాను నటిగా నిరూపించుకున్నట్టు చెప్పింది. అయితే తనకు ఇలాంటి అవమానాలు తప్ప, ఫిజికల్‌ హెరాస్‌మెంట్‌ వంటివి లేవని, ఆ విషయంలో తాను లక్కీ అని తెలిపింది. బేసిక్‌గా తాను బోల్డ్, అండ్‌ డేర్‌ అని, ఎవరూ తనతో అలాంటి సాహసాలు చేయరని చెప్పింది. ఏదైనా ఉంటే తాడో పేడో తేల్చుకునే రకం అని వెల్లడించింది. తన అమ్మ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుందని, తాను ఇండస్ట్రీలోకి వచ్చాక ఆమె సినిమాలు మానేసిందని వెల్లడించింది. ఇప్పుడు తనకు సపోర్ట్ గా తనతోనే ఉంటుందని వెల్లడించింది. తాను సంపాదిస్తున్నాను కాబట్టి వాళ్లు వర్క్ చేయాల్సిన పనిలేదని వెల్లడించింది సత్యశ్రీ. తాజాగా సుమన్‌ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాలను వెల్లడించింది.

సత్యశ్రీ సినీ ప్రయాణం సాగిందిలా!

ప్రేమ, పెళ్లి గురించి చెబుతూ, తనని ఎవరూ ప్రేమించలేదని, చిన్నప్పుడు ఓవ్యక్తి తన వెంటపడుతున్నాడని తెలిసి తన నాన్న, బాబాయ్‌ వాళ్లు వాడిని కొట్టారని, ఆ తర్వాత తనతో లవ్‌ ఆట ఎవరూ ఆడలేదని తెలిపింది. అదే సమయంలో పెళ్లిపై పెద్దగా నమ్మకం లేదని, తన ఫ్రెండ్‌ విషయంలో జరిగిన సంఘటన పెళ్లిపై విరక్తి కలిగిందని చెప్పింది. దీంతో ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదని చెప్పింది. పెళ్లి విషయంలో ఆడవారిపై చిన్నచూపు ఉంటుందని, అది తనకు నచ్చదని తెలిపింది. తనకు పెళ్లి చూపులు జరిగినప్పుడు ఓ అబ్బాయి వచ్చాడు, తనకు ఇలా కావాలి, ఫారెన్‌వెళ్లాలి, వంట రావాలి అంటూ రూల్స్ చెప్పాడు, అప్పుడు `నువ్వు మా పేరెంట్స్ ని చూసుకుంటావా` అని అడగడంతో అతను నో చెప్పాడని, అంతే పెళ్లి చూపులు క్యాన్సిల్‌ అయ్యాయని, ఆ తర్వాత మళ్లీ పెళ్లి ప్రస్తావన లేదని వెల్లడించింది. ఓ రకంగా ఇప్పట్లో పెళ్లిలేదని స్పష్టం చేసింది. అసలు పెళ్లే చేసుకునే ఉద్దేశ్యం లేదని ఆమె చెప్పడం గమనార్హం.

సత్యశ్రీ తన కెరీర్‌లో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. వాటిని అధిగమించి నటిగా నిరూపించుకుంది. ఆమె భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆశిద్దాం. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.