|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: 8 ఏళ్ల ప్రేమకు బ్రేకప్ చెప్పిన హీరోయిన్! జబర్దస్త్ సన్నీ లైఫ్ లో ఇంత విషాదమా?

Published: 02-03-2026, 10:05 PM
షాకింగ్: 8 ఏళ్ల ప్రేమకు బ్రేకప్ చెప్పిన హీరోయిన్! జబర్దస్త్ సన్నీ లైఫ్ లో ఇంత విషాదమా?
  • జబర్దస్త్ సన్నీ: సుడిగాలి సుధీర్ టీమ్‌లో కమెడియన్‌గా సూపర్ పాపులర్!
  • 8 ఏళ్ల ప్రేమ తర్వాత ప్రభుత్వ ఉద్యోగం అమ్మాయిని దూరం చేసింది – షాకింగ్ నిజం!
  • కోటీశ్వరుడైన సన్నీ.. ప్రేమ వైఫల్యంతో పెళ్లికి దూరం – విషాద గాథ!
  • సన్నీ అన్నయ్య, వదిన డాక్టర్లు అయినా సన్నీ మనసు మార్చలేకపోయారు – ఫ్యాన్స్ నిరాశ!

జబర్దస్త్ సన్నీ గురించి ఒక షాకింగ్ న్యూస్ వైరల్ అవుతోంది! అతడి ప్రేమ కథ వింటే కన్నీళ్లు ఆగవు. అసలు సన్నీ ఎందుకు పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉంటున్నాడో తెలుసా?

సన్నీ లవ్ స్టోరీలో ఊహించని ట్విస్ట్!

Jabardasth Sunny : జబర్దస్త్ లో సుడిగాలి సుధీర్ టీమ్ లో కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సన్నీ. జబర్దస్త్ సన్నీ అసలు పేరు సునీల్ చంద్ర. సన్నీకి కూడా ఏజ్ ఎక్కువే ఉన్నా ఇప్పటికి పెళ్లి చేసుకోలేదు. అయితే అసలు పెళ్లి వద్దనుకున్నాడట సన్నీ.

ఇటీవల ఓ జబర్దస్త్ ఎపిసోడ్ లో సన్నీ తన లవ్ ఫెయిల్యూర్ గురించి తెలిపాడు.

కోటీశ్వరుడైనా సన్నీకి తప్పని ప్రేమ వైఫల్యం!

సన్నీ మాట్లాడుతూ.. ఒక అమ్మాయిని లవ్ చేశాను. 8 ఏళ్ళు లవ్ చేసుకున్న తర్వాత ఆ అమ్మాయి గవర్నమెంట్ జాబ్ ఉందని వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుంది. అందుకే అప్పట్నుంచి పెళ్లి చేసుకోలేదు అని చెప్పాడు.

సన్నీ గురించి రామ్ ప్రసాద్ మాట్లాడుతూ.. సన్నీ కోటీశ్వరుడు, వాళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి. పెళ్లి చేసుకోమన్నా చేసుకోలేదు. లవ్ ఫెయిల్యూర్ వల్ల లైఫ్ ని అలా వదిలేసాడు. వాళ్ళ అన్నయ్య, వదిన పెద్ద డాక్టర్స్. పెళ్లి చేసుకో మంచిగా ఉండు అని చెప్పినా వినలేదు. లైఫ్ లో అన్ని వదిలేసాడు. పెళ్లి చేసుకోమని ఎంతమంది చెప్పినా నాకు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు అంటాడు. ఇంటికి కూడా రెగ్యులర్ గా వెళ్ళడు. మా రూమ్ లోనే, లేదా ఎవరో రూమ్ లోనో తాగుతూ ఉండిపోతాడు అని తెలిపాడు.

పెళ్లిపై విరక్తి.. సన్నీ మనసు మార్చేదెవరు?

కోట్ల ఆస్తి ఉంచుకొని కూడా ఇలా ఒక అమ్మాయి వదిలేసి వెళ్లిపోయిందని పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే ఉండటంతో సన్నీ లవ్ స్టోరీ విని పాపం అంటున్నారు నెటిజన్లు.

జబర్దస్త్ సన్నీ ప్రేమ కథ నిజంగా బాధాకరమైనది. మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి. సన్నీ త్వరలో పెళ్లి చేసుకుంటాడేమో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.