|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అది నాకు ఒక కళ.. అవార్డు అందుకోవడం గౌరవంగా ఉందంటూ జాక్వెలిన్ ఇంట్రెస్టింగ్ ట్వీట్.. నెటిజన్ల రియాక్షన్ ఏంటంటే?

Published: 24-06-2025, 8:04 AM
అది నాకు ఒక కళ.. అవార్డు అందుకోవడం గౌరవంగా ఉందంటూ జాక్వెలిన్ ఇంట్రెస్టింగ్ ట్వీట్.. నెటిజన్ల రియాక్షన్ ఏంటంటే?

బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాడెజ్ ఇటాలియన్ గ్లోబల్ సిరీస్ ఫెస్టివల్ అవార్డును అందుకుని సోషల్ మీడియాలో తన ఆనందాన్ని పంచుకుంది. సినిమాను కళగా భావించే ఆమె అవార్డు గెలుపుపై నెటిజన్లు ఎలా స్పందించారో చూద్దాం.

Key Points

1

జాక్వెలిన్ ఫెర్నాడెజ్ ఇటాలియన్ గ్లోబల్ సిరీస్ ఫెస్టివల్ అవార్డును అందుకుంది.

2

ఆమె సినిమాను ఒక కళగా వర్ణించింది.

4

కొందరు నెటిజన్లు ఆమె ఐటమ్ సాంగ్స్ గురించి కామెంట్ చేశారు.

జాక్వెలిన్ అవార్డు గెలుపు

బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ జాక్వెలిన్ పలు చిత్రాల్లో ఐటమ్ సాంగ్స్ చేసి విపరీతమైన పాపులారిటీ దక్కించుకుంది. అంతేకాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నై నటించిన ఈ అమ్మడు హీరోయిన్‌గా మారి వరుస సినిమాలతో ఫుల్ ఫామ్‌లో ఉంది. ఇక ఇటీవల ‘హౌస్‌ఫుల్-5’(Housefull-5) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ థియటర్స్‌లో పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, జాక్వెలిన్ ఫెర్నాడెజ్(Jacqueline Fernandez) అత్యంత ప్రతిష్టాత్మక ఇటాలియన్ గ్లోబల్ సిరీస్ ఫెస్టివల్ అవార్డ్ వేడుకలకు హాజరైంది. రిమినిలో జరిగిన ఈ వేడుకల్లో జాక్వెలిన్ అవార్డును అందుకుంది. ఈ విషయాన్ని తెలుపుతూ సోషల్ మీడియా ద్వారా ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. ‘‘సినిమా అనేది నాకు ఒక కళ. అది కథ చెప్పడం మాత్రమే కాదు, కాలం, భాషతో సంబంధం లేకుండా ఎంతో మంది ప్రజలను కనెక్ట్ చేస్తుంది.

ఆమె సోషల్ మీడియా పోస్ట్

ప్రపంచంతో మన భావాలను పంచుకోవడంలో సహాయపడుతుంది. గుర్తింపును పొందేలా చేస్తుంది. గుర్తింపును పొందడం గురించి పదాల్లో చెప్పలేను. రిమినిలో జరిగిన ప్రతిష్టాత్మక కార్యక్రమంలో అసాధారణ అవార్డు గ్రహీతలందరూ హాజరైనప్పుడు అవార్డు అందుకోవడం గౌరవంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా సినిమాను జరుపుకోవడానికి మాకు ఇంకా చాలా క్షణాలు ఉన్నాయి’’ అని రాసుకొచ్చింది. అలాగే అవార్డుతో తీసుకున్న ఫొటోలను కూడా షేర్ చేసింది. ప్రస్తుతం జాక్వెలిన్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన నెటిజన్లు కొందరు ఆమెకు కంగ్రాట్స్ చెబుతుండగా.. మరికొందరు మాత్రం నీకు ఐటమ్ సాంగ్స్ సెట్ అవుతాయని అంటున్నారు. ఇంకొందరు ‘హౌస్‌ఫుల్-5’ చాలా బాగుందని ప్రశంసలు కురిపిస్తున్నారు.

నెటిజన్ల స్పందన

A post shared by Jacqueline Fernandez (@jacquelienefernandez)

జాక్వెలిన్‌కు అభినందనలు వెల్లువెత్తుతుండగా, నెటిజన్ల అభిప్రాయాలు వైవిధ్యంగా ఉన్నాయి. సినిమా రంగంలో ఆమెకు మరింత విజయాలు లభించాలని కోరుకుందాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.