|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Jacqueline Fernandez: ఆ విషయంలో అక్షయ్ కుమార్ నుంచి చిట్కాలు తీసుకోవాలి.. అలాంటి వీడియో షేర్ చేస్తూ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పోస్ట్

Published: 03-06-2025, 12:37 PM
Jacqueline Fernandez: ఆ విషయంలో అక్షయ్ కుమార్ నుంచి చిట్కాలు తీసుకోవాలి.. అలాంటి వీడియో షేర్ చేస్తూ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పోస్ట్

‘హౌస్‌ఫుల్ 5’ సినిమా ప్రమోషన్స్‌లో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ సరదాగా డ్యాన్స్ చేస్తున్న వీడియోను షేర్ చేసింది. అందులో ఆమె తన డ్యాన్స్‌ను మెరుగుపరచుకోవడానికి అక్షయ్ కుమార్‌నుండి చిట్కాలు తీసుకోవాలని కోరుకుంటోంది అని తెలిపింది.

Key Points

1

జాక్వెలిన్ ఫెర్నాండెజ్ 'హౌస్‌ఫుల్ 5' ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు.

2

ఆమె తన డ్యాన్స్ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి అక్షయ్ కుమార్ నుండి చిట్కాలు తీసుకోవాలని కోరుకుంటున్నారు.

4

'హౌస్‌ఫుల్ 5' జూన్ 6న విడుదల కానుంది.

‘హౌస్‌ఫుల్ 5’ ప్రమోషన్స్ జోరు

స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రజెంట్ వరుస చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు. ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘హౌస్‌ఫుల్ 5’. ఫుల్ కామెడీ థ్రిల్లర్ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ మూవీకి తరుణ్ మన్సుఖాని దర్శకత్వం వహిస్తున్నాడు. నాడియాద్వాలా గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్మెంట్ ప్రొడక్షన్ బ్యానర్‌పై సాజిద్ నడియాద్వాలా, వార్దా నదియాద్వాలా అండ్ ఫిరూజీ ఖాన్ నిర్మిస్తున్నారు. ఇందులో అక్షయ్ కుమార్‌తో పాటు రితేష్ దేశ్‌ముఖ్, అభిషేక్‌బచ్చన్, సంజయ్‌దత్, ఫర్దీన్ ఖాన్, నానాపటేకర్, జాకీష్రాఫ్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తదితరులు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

అక్షయ్ కుమార్ నుంచి డ్యాన్స్ చిట్కాలు

ఈ మూవీ భారీ అంచనాల మధ్య జూన్ 6న థియేటర్స్‌లో గ్రాండ్ రలీజ్‌కు సిద్ధం అవుతోంది. దీంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచారు చిత్ర బృందం. ఇందులో భాగంగానే జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తన టీమ్‌తో ఎంజాయ్ చేస్తున్న వీడియో షేర్ చేస్తూ.. ‘అక్షయ్ కుమార్‌ను చూసి నా డ్యాన్స్‌ను నేను మెరుగుపరచుకోవాలి.. దీని కోసం ఆయన నుంచి కొన్ని చిట్కాలు పొందాలి.. హౌస్‌ఫుల్ 5 వచ్చేస్తుంది.. మీరు కూడా చూసి నేర్చుకోండి’ అంటూ ఓ వీడియో షేర్ చేసింది.

జాక్వెలిన్ ఫెర్నాండెజ్ వీడియో వైరల్

I need to improve my Phoogdi dance skills for sure.. @akshaykumar need to get some tips from you for sure! Houseful 5 advance bookings open now!!! ❤️❤️ pic.twitter.com/y2C5IozsI4

జూన్ 6న విడుదల కానున్న ‘హౌస్‌ఫుల్ 5’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ చేసిన ఈ వీడియో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అక్షయ్ కుమార్ డ్యాన్స్ నైపుణ్యాలకు ఆమె అభిమాని అని తెలుస్తోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.