|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: ‘అరవింద సమేత’ క్లైమాక్స్ ఫైట్ చెత్తగా తీశారు: బాంబ్ పేల్చిన జగపతి బాబు!

Published: 13-02-2026, 7:05 AM
షాకింగ్: 'అరవింద సమేత' క్లైమాక్స్ ఫైట్ చెత్తగా తీశారు: బాంబ్ పేల్చిన జగపతి బాబు!
  • జగపతి బాబు సంచలన వ్యాఖ్యలు: ‘అరవింద సమేత’ క్లైమాక్స్ ఫైట్ పై షాకింగ్ కామెంట్స్!
  • త్రివిక్రమ్ డైరెక్షన్ పై ప్రశంసలు, రొటీన్ ఫైట్ సీన్ తొలగించి బెస్ట్ క్లైమాక్స్ గా మార్చారని వెల్లడి.
  • ఎన్టీఆర్, జగపతి బాబు కాంబినేషన్ సీన్స్ అదిరిపోయాయి, సినిమా బ్లాక్ బస్టర్ హిట్!
  • జగపతి బాబు నటనకు ప్రశంసలు, విలన్ పాత్రలో జీవించారంటూ ఫ్యాన్స్ కామెంట్స్, వైరల్ అవుతున్న వీడియో.

టాలీవుడ్ లో సంచలనం! జగపతి బాబు గారు ‘అరవింద సమేత’ సినిమాలోని క్లైమాక్స్ ఫైట్ గురించి కొన్ని షాకింగ్ విషయాలు బయటపెట్టారు. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే చదవండి!

జగపతి బాబు సంచలన వ్యాఖ్యలు!

Jagapathi Babu : జగపతి బాబు సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అదరగొడుతున్న సంగతి తెలిసిందే. జగపతి బాబు చేసిన పాత్రల్లో అరవింద సమేత వీరరాఘవ సినిమాలోని పాత్ర చాలా స్పెషల్. గొంతు కట్ అయి బతికిన పవర్ ఫుల్ విలన్ పాత్రలో జగపతి బాబు జీవించేసాడు. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది. ఈ సినిమాకు క్లైమాక్స్ చాలా ప్లస్ అయింది.(Jagapathi Babu)

తాజాగా జగపతి బాబు ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా అరవింద సమేత సినిమా క్లైమాక్స్ లో జరిగిన ఆసక్తికర సంఘటన తెలిపారు.

త్రివిక్రమ్ క్రియేటివిటీతోనే బెస్ట్ క్లైమాక్స్

జగపతి బాబు మాట్లాడుతూ.. అరవింద సమేత వీర రాఘవ సినిమా క్లైమాక్స్ లో మొదట మాములు కమర్షియల్ ఫైట్ పెట్టారు. ఆ ఫైట్ షూటింగ్ కూడా జరిగింది. చెత్త అంతా తీశారు. ఓ నలభై మంది రావడం, ఒకడు వచ్చి కొట్టడం తర్వాత ఇద్దరు కొట్టడం ఇలా ఓ చెత్త ఫైట్ తీశారు. షూటింగ్ కి ఏదో బ్రేక్ వస్తే త్రివిక్రమ్ తో అన్నా ఏంటి శ్రీను నువ్వు కూడా ఈ రొటీన్ క్లైమాక్స్, క్లైమాక్స్ మార్చు నువ్వు క్రియేటివ్ డైరెక్టర్ నువ్వు కూడా ఇలా చేస్తే ఎలా అన్నాను.

ఎన్టీఆర్, జగపతి బాబు కాంబినేషన్ అదుర్స్!

త్రివిక్రమ్ కూడా ఏదో ఆలోచిస్తున్నాడు. ఓ రెండు రోజులు ఆలోచించి, రామ్ – లక్ష్మణ్ తో కూడా మాట్లాడి క్లైమాక్స్ మొత్తం మార్చేశారు. అది బెస్ట్ క్లైమాక్స్ అయింది అని అన్నారు.

జగపతి బాబు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన మాటలు సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.