
📌 Key Points
- జగపతిబాబుకి మరణ గండం ఉందని ఒక ఆస్ట్రాలజర్ హెచ్చరించారు.
- జగపతి సినిమా షూటింగ్ సమయంలో సమాధి సీన్ లో ఊపిరాడక చనిపోయే స్థితికి చేరుకున్నారు.
- షూటింగ్ రోజు ఉదయం ఒక అభిమాని ఫోన్ చేసి జాగ్రత్తగా ఉండమని హెచ్చరించారు.
- ఆ సంఘటన తర్వాత ఆస్ట్రాలజీని నమ్ముతున్నానని జగపతిబాబు తెలిపారు.
ప్రముఖ నటుడు జగపతిబాబు తన జీవితంలో జరిగిన ఒక సంఘటనను పంచుకున్నారు. ఒక సినిమా షూటింగ్ సమయంలో మరణించే పరిస్థితి వచ్చిందని, ఒక అభిమాని ఫోన్ చేసి హెచ్చరించడంతో తాను బతికిపోయానని ఆయన తెలిపారు.
జగపతిబాబుకి మరణ గండం ఉందని హెచ్చరిక
Jagapathi babu: జగపతిబాబు ప్రస్తుతం విలన్ పాత్రలలో సపోర్టింగ్ పాత్రలలో నటిస్తున్న సెకండ్ ఇన్నింగ్స్ లో ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న ఈయన ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా జగపతిబాబుకి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు. మీరు ఆస్ట్రాలజీని నమ్ముతారా? అనే ప్రశ్న ఎదురు కావడంతో తన జీవితంలో జరిగిన ఒక సంఘటన గురించి జగపతిబాబు ఈ సందర్భంగా అభిమానులతో పంచుకున్నారు.. తాను ఆస్ట్రాలజీని బాగా నమ్ముతానని జగపతిబాబు తెలియజేశారు.
ఇకపోతే తన విషయంలో జరిగిన ఒక ప్రమాదకర ఘటన గురించి కూడా ఈ సందర్భంగా ఈయన అభిమానులతో పంచుకున్నారు. తనకు తన జీవితంలో ఒక మరణ గండం ఉందనీ, జాగ్రత్త అంటూ ఒక మహిళ ఆస్ట్రాలజర్ నన్ను హెచ్చరించిందనే విషయాన్ని జగపతిబాబు తెలియజేశారు. ఈ ఘటన తాను హీరోగా నటించిన జగపతి అనే సినిమా సమయంలో జరిగిందని ఈయన తెలిపారు.జగపతిబాబు(Jagapathi Babu) హీరోగా జొన్నలగడ్డ శ్రీనివాసరావు దర్శకత్వంలో జగపతి(Jagapathi film) అనే సినిమా 2005 జూన్ 24న విడుదల అయింది. ఈ సినిమా షూటింగ్లో భాగంగా నేను చనిపోయినట్టు నటించాలి. చనిపోయిన నన్ను ఒక పెట్టెలో కప్పెట్టి పూడ్చి సమాధిపై పెళ్లి మండపం పెట్టి ఒక సీన్ షూట్ చేయాల్సి ఉంది.
సినిమా షూటింగ్లో ఊహించని ప్రమాదం
ఈ సిన్ అనుకున్న సమయానికంటే కూడా ఒక అర నిమిషం ఆలస్యంగా అయింది. అయితే ఆ మండపం తీసేసిన తర్వాత నన్ను ఎక్కడ పాతి పెట్టారో వెతకడానికి ఆలస్యమైంది. అప్పటికే తాను ఊపిరి పీల్చుకోలేకపోతున్నానని బయట అందరూ నేను చచ్చిపోయాననేసి ఏడుస్తున్నారని జగపతిబాబు తెలిపారు. మరొక నిమిషం ఆలస్యమై ఉంటే నేను చనిపోయేవాడినని తెలియజేశారు. ఈ సన్నివేశం మధ్యాహ్నం రెండున్నర మూడు గంటల మధ్యలో జరిగింది.అయితే ఆరోజు ఉదయం 11 గంటలకు నా మహిళ అభిమాని నుంచి ఫోన్ వచ్చింది.
మరణ గండం ఉందని హెచ్చరింపు..
ఆస్ట్రాలజీని నమ్ముతానన్న జగపతిబాబు
ఆమె ఆ ఫోన్ కాల్ కంటే నాకు మూడు సంవత్సరాల ముందు పరిచయం ఆమె భర్త నాకు పరిచయం చేశాడు మీకు పెద్ద అభిమాని ఆస్ట్రాలజర్ అంటూ పరిచయం చేశారు ఆ పరిచయం తర్వాత మూడు సంవత్సరాలకు ఫోన్ చేసి సార్ మీరు బానే ఉన్నారు కదా అంటూ అడిగారు. బానే ఉన్నానని నేను చెప్పగా జాగ్రత్త అంటూ ఆమె ఫోన్ పెట్టేశారు. అయితే నాకు మరణఘండం ఉందని ఆమె ముందుగానే గ్రహించి నన్ను హెచ్చరించారని ఈ సంఘటనతో నేను ఆస్ట్రాలజీని బాగా నమ్ముతాను అంటూ జగపతిబాబు ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
జగపతిబాబు తన జీవితంలో జరిగిన ఈ సంఘటనను గుర్తు చేసుకుంటూ ఆస్ట్రాలజీని నమ్మడం మొదలు పెట్టానని చెప్పారు. అభిమాని ఫోన్ చేసి హెచ్చరించడం వల్లే తాను బతికి బయటపడ్డానని ఆయన అన్నారు.


