|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

“గుంటకాడ నక్కలు” అంటూ ట్రోలర్స్‌పై జగపతి బాబు మాస్ రియాక్షన్! చరణ్‌కి మద్దతుగా జగ్గూభాయ్ ఫైర్!

Published: 27-05-2026, 5:31 AM
"గుంటకాడ నక్కలు" అంటూ ట్రోలర్స్‌పై జగపతి బాబు మాస్ రియాక్షన్! చరణ్‌కి మద్దతుగా జగ్గూభాయ్ ఫైర్!
  • రామ్ చరణ్ ట్రోలింగ్‌పై జగపతి బాబు సంచలన కౌంటర్! అసలు హీరోలు పడే ఒత్తిడి, కష్టాన్ని వివరంగా చెప్పారు.
  • ట్రోలర్స్‌ను “గుంటకాడ నక్కలు” అంటూ జగ్గూభాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు, వారిని పనిలేని వెధవలని వర్ణించారు.
  • పెద్ది సినిమా ప్రమోషన్ల సమయంలో హీరో పడే మానసిక, శారీరక కష్టాన్ని వివరించిన జగపతి బాబు.
  • “70 టేక్స్” ట్రోలింగ్‌ను ఖండించిన సీనియర్ నటుడు, అది అవాస్తవమని, ఫేక్ న్యూస్ అని స్పష్టం చేశారు.

రామ్ చరణ్ సినిమా ప్రమోషన్లలో జరుగుతున్న ట్రోలింగ్‌పై స్టార్ నటుడు జగపతి బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు! ట్రోలర్స్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వారిని “గుంటకాడ నక్కలు” అంటూ మాస్ రియాక్షన్ ఇచ్చారు. ఈ వార్త టాలీవుడ్‌లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

చరణ్‌పై ట్రోలింగ్: జగపతి బాబు ఫైర్!

Jagapathi Babu : రామ్ చరణ్ పెద్ది సినిమా జూన్ 4న రిలీజ్ కాబోతుంది. మూవీ యూనిట్ ప్రస్తుతం ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. పెద్ది యూనిట్ పలు నగరాల్లో భారీ ఈవెంట్స్ నిర్వహిస్తుంది. ఇటీవల భోపాల్ లో పెద్ది ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో రామ్ చరణ్ పలు పేర్లు మర్చిపోవడం, తర్వాత సారి చెప్తూ ట్వీట్ చేయడం, బెంగళూరు ఈవెంట్లో చరణ్ కొంచెం కొంచెమే కన్నడలో మాట్లాడటంతో కొంతమంది యాంటీ ఫ్యాన్స్ చరణ్ ని ట్రోలింగ్ చేసారు.

పెద్ది సినిమాలో జగపతి బాబు అప్పలసూరి అనే పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతునాడు. ప్రమోషన్స్ లో భాగంగా నేడు జగపతి బాబు మీడియాతో మాట్లాడాడు. ఈ క్రమంలో చరణ్ పై వచ్చిన ట్రోలింగ్, తనపై వచ్చిన ట్రోలింగ్ గురించి స్పందించారు.

“గుంటకాడ నక్కలు” అంటూ సంచలన వ్యాఖ్యలు!

జగపతి బాబు మాట్లాడుతూ.. పనిలేని వెదవల గురించి నేను మాట్లాడను. ట్రోలింగ్ చేసేవాళ్ళు గుంటకాడ నక్కల్లాంటి వాళ్ళు. వాళ్లకు పనిలేక ఎవర్ని కిందకు లాగుదాం అని ట్రోలింగ్ చేస్తారు. అసలు చరణ్ ఈ సినిమాకు ఎంత కష్టపడ్డాడు, ఎన్ని గాయాలు అయ్యాయి, ఎంత ఎఫర్ట్ పెట్టాడు, ఎంత కష్టపడ్డాడు ఇవన్నీ వదిలేసి ఏదో దొరికితే దాన్ని పట్టుకుంటారు.

అసలు ఈవెంట్లో అన్నివేల మంది జనాలు, ఓ పక్క హీరోకి కాల్స్ వస్తున్నాయి. డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షన్ గురించి, సెన్సార్, ఓ పక్క థియేటర్స్ ఇష్యూ నడుస్తుంది ఇవన్నీ హీరో తల మీద ఉంటాయి. అవన్నీ మోస్తూ ఇంత హడావిడిలో మర్చిపోతారు. నేను కూడా మర్చిపోతాను. అంత ప్రెజర్ లో అలాంటివి జరుగుతాయి. అది సహజం. దీన్ని కూడా మాట్లాడాలా. ఆ ట్రోలింగ్ చేసేవాళ్ళు నాలుగు రోజులు మాట్లాడతారు పోతారు. దీనివల్ల చరణ్ కి ఏం కాదు అని అన్నారు.

ప్రమోషన్ల ఒత్తిడిపై జగ్గూభాయ్ కీలక వివరణ!

ఇక తనపై వచ్చిన ట్రోలింగ్ గురించి స్పందిస్తూ.. నన్ను కూడా ఏదో సీన్ కి 70, 80 టేక్స్ తీసుకున్నా అని ట్రోల్ చేసారు. అసలు అది అబద్దం. నేను మహా అయితే మూడు టేక్స్ తీసుకున్నా ఏమో హైయెస్ట్. దాన్ని కూడా ఫేక్ న్యూస్ తో ట్రోలింగ్ చేసారు అని చెప్పుకొచ్చారు.

జగపతి బాబు చేసిన ఈ వ్యాఖ్యలు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి. రామ్ చరణ్‌కు మద్దతుగా నిలిచిన జగ్గూభాయ్ స్టైల్ అభిమానులను ఆకట్టుకుంటోంది. సినిమా ప్రమోషన్లపై మరిన్ని ఆసక్తికర అప్‌డేట్స్‌ కోసం వేచి చూడండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.