|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

జగపతి బాబు షాకింగ్ నిజాలు: మందు ఫుల్, సిగరెట్ రాక్షసి! వైరల్ కామెంట్స్!

Published: 08-05-2026, 8:15 PM
జగపతి బాబు షాకింగ్ నిజాలు: మందు ఫుల్, సిగరెట్ రాక్షసి! వైరల్ కామెంట్స్!
  • జగపతి బాబు మందు అలవాటుపై షాకింగ్ నిజాలు బయటపెట్టారు.
  • ‘వదలా’ ప్రమోషన్స్ లో తన వ్యక్తిగత విషయాలు పంచుకున్నారు.
  • ‘అంతఃపురం’ పాత్రతో కుర్రాళ్లు సిగరెట్ తాగడంపై తీవ్రంగా బాధపడ్డారు.
  • సిగరెట్ చాలా వరస్ట్ అడిక్షన్, అది ఒక రాక్షసి లాంటిది అని వర్ణించారు.

టాలీవుడ్ నటుడు జగపతి బాబు తన రాబోయే చిత్రం ‘వదలా’ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. మందు, సిగరెట్ అలవాట్లపై ఆయన చేసిన నిజాయితీ పూరిత కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మందు అలవాటుపై జగపతి బాబు సంచలనం!

Jagapathi Babu : నటుడు జగపతి బాబు త్వరలో వదలా అనే సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా యిచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన ఆల్కహాల్, సిగరెట్ అలవాట్ల గురించి మాట్లాడాడు.

సిగరెట్ రాక్షసి: ఎందుకు వదలలేకపోతున్నారు?

జగపతి బాబు మాట్లాడుతూ.. నేను మందు చాలా తాగాను. ఒకప్పుడు ట్యాంకర్లు ట్యాంకర్లు తాగేసాను. కానీ ఇప్పుడు ఆల్కహాల్ తాగడం ఆపేసాను. సిగరెట్ మాత్రం వదల్లేకపోతున్నాను. అంతఃపురం సినిమాలో నేను సిగరెట్ ఎక్కువగా తాగే పాత్ర చేశా. అది చూసి అప్పట్లో చాలా మంది కుర్రాళ్ళు సిగరెట్ తాగడం మొదలుపెట్టారు. అది నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. ఆ విషయంలో బాధపడ్డా.

‘అంతఃపురం’ సినిమాతో వచ్చిన పశ్చాత్తాపం!

నేను ఒకటే చెప్తున్నా సిగరెట్ మాత్రం తాగొద్దు. ఒకవేళ మొదలుపెట్టకపోతే అసలు మొదలుపెట్టకండి సిగరెట్. నేను మానేద్దాం అనుకుంటున్నా కానీ అవ్వట్లేదు.ట్రై చేస్తున్నాను సిగరెట్ మానెయ్యడానికి. అది చాలా వరస్ట్ అడిక్షన్. అది ఒక రాక్షసి లాంటిది అని అన్నారు.

జగపతి బాబు చేసిన ఈ వ్యాఖ్యలు సినీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఆయన నిజాయితీని మెచ్చుకుంటూ అభిమానులు ప్రశంసిస్తున్నారు. ‘వదలా’ సినిమాపై మరిన్ని ఆసక్తికర అప్డేట్స్ కోసం మా ఛానెల్‌ను చూస్తూ ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.