
📌 Key Points
- జై హనుమాన్: ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో భారీ తారాగణంతో రూపొందనున్న చిత్రం!
- హనుమంతుడిగా రిషబ్ శెట్టి, శ్రీరాముడిగా రానా.. భారీ మల్టీస్టారర్ కాంబో సెట్!
- కీరవాణి సంగీతం.. జై హనుమాన్ సినిమాకు మరింత క్రేజ్!
- 2027లో విడుదల కానున్న జై హనుమాన్.. అంచనాలు భారీగా పెరిగాయి!
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వస్తున్న జై హనుమాన్ సినిమా టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాకు భారీగా బడ్జెట్ పెంచడంతో పాటు స్టార్స్ కూడా యాడ్ అవుతున్నారు. ఈ మూవీ కోసం అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
భారీ బడ్జెట్ తో జై హనుమాన్!
Jai Hanuman; ప్రశాంత్ వర్మ.. తక్కువ బడ్జెట్ తో సినిమాలు చేసి ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టడంలో ఈ డైరెక్టర్ దిట్ట. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ అలాంటివే. ఆ నుంచి మొన్న వచ్చిన హనుమాన్ వరకు అన్నీ లో బడ్జెట్ లో వచ్చి బ్లాక్ బస్టర్స్ అయినవే. ఇప్పుడు ఈ దర్శకుడు చేస్తున్న లేటెస్ట్ మూవీ జై హనుమాన్. బ్లాక్ బస్టర్ హనుమాన్ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాలో కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి హనుమంతుడిగా కనిపించనున్నాడు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ కి ఆడియన్స్ నుంచి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు సినిమాపై అంచనాలను కూడా పెంచేసింది. ఇక అప్పటినుంచి జై హనుమాన్ సినిమా కోసం ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తూనే ఉన్నారు. కానీ, ఆ సినిమా మాత్రం రావడం లేదు. కనీసం షూటింగ్ కూడా ఇంకా మొదలవలేదు. దానికి కారణం రిషబ్ శెట్టి వేరే ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండటమే.
స్టార్ కాస్ట్ తో సినిమాకు క్రేజ్
ఇటీవల ఆయన ఫ్రీ అవడంతో జై హనుమాన్(Jai Hanuman) పై ఫోకస్ పెట్టాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఇక త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ను కూడా మొదలుపెట్టనున్నాడు. ఇక తాజాగా ఈ సినిమా గురించి క్రేజీ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే, జై హనుమాన్ సినిమా కోసం భారీగా బడ్జెట్ పెరుగనుందట. దానికి కారణం జై హనుమాన్ కోసం అందరు స్టార్స్ నే తీసుకుంటున్నాడు ప్రశాంత్ వర్మ. ఇప్పటికే హనుమంతుడి పాత్ర కోసం రిషబ్ శెట్టిని తీసుకోగా, శ్రీరాముడి పాట కోసం రానా తీసుకున్నాడట.
2027లో విడుదల.. అంచనాలు!
దీనికి సంబంధించి రీసెంట్ గా ఫోటో షూట్ కూడా జరిగిందని టాక్. ఇక మ్యూజిక్ కోసం ఎంఎం కీరవాణిని ఫిక్స్ చేశాడట ప్రశాంత్. ఇంకా చాలా మంది స్టార్స్ ఈ సినిమాలో ఉండబోతున్నారట. అలా జై హనుమాన్ సినిమాను స్టార్స్ తో ఫీల్ చేయబోతున్నాడట. అయితే, హనుమాన్ సినిమాను లిమిటెడ్ బడ్జెట్ లో చేసి సూపర్ హిట్ అందుకున్న ప్రశాంత్ వర్మ జై హనుమాన్ కోసం మాత్రం భారీగా ఖర్చు చేయిస్తున్నాడు. మరి ఆ లెక్కలను ప్రశాంత్ మోయగలడా. ఆ రేంజ్ హిట్ ను అందించగలడా అనేది అనుమానంగా మారింది. ఇక జై హనుమాన్ సినిమా 2027లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
జై హనుమాన్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రశాంత్ వర్మ ఈ సినిమాను ఏ రేంజ్ లో తీస్తాడో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


