|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

జైలర్ 2 విడుదల తేదీ ఫిక్స్! రజినీకాంత్ ఫ్యాన్స్ కి పండగే!

Published: 19-02-2026, 2:35 AM
జైలర్ 2 విడుదల తేదీ ఫిక్స్! రజినీకాంత్ ఫ్యాన్స్ కి పండగే!
  • సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ మూవీకి సీక్వెల్ గా జైలర్ 2 రాబోతుంది.
  • జైలర్ చిత్రం గతంలో 600 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.
  • జైలర్ 2 మూవీ జూన్ 11న విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం.
  • ఈ సినిమాను తమిళం, తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ సినిమాకు సీక్వెల్ జైలర్ 2 త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా జూన్ 11న విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

జైలర్ 2 రిలీజ్ డేట్ ఫిక్స్?

Jailer 2 : కోలీవుడ్ స్టార్ హీరో సూపర్ రజినీకాంత్ ప్రస్తుతం జైలర్ 2 తో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు. జైలర్ మూవీకి సీక్వెల్ గా ఈ మూవీ రాబోతుంది.. గతంలో వచ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 600 కోట్లకు పైగా వసూళ్లను అందుకుంది.. ఇప్పుడు ‘జైలర్ 2’ పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. అభిమానులు ఈ సీక్వెల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ప్రస్తుతం ఈ చిత్రం చివరి దశ షూటింగ్ లో ఉంది. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ మరికొద్ది రోజుల్లో అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ చిత్రం గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అదేంటంటే.. సినిమా రిలీజ్ డేట్ లాక్ చేసినట్లు తెలుస్తుంది.. మరి ఎప్పుడు ఈ మూవీ రాబోతుందో ఒకసారి ఇప్పుడు తెలుసుకుందాం..

భారీ అంచనాలతో జైలర్ సీక్వెల్

రజనీకాంత్ కెరీర్లు బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన జైలర్ మూవీకి సీక్వెల్ కి రాబోతున్న ఈ సినిమాపై రోజురోజుకీ అంచనాలు భారీగా క్రియేట్ అవుతున్నాయి. ఈ సినిమాని ఎప్పుడెప్పుడు థియేటర్లో చూస్తామని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఎలాంటి పోటీ లేకుండా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అన్ని భాషల్లో మంచి వసూళ్లు సాధించే అవకాశం ఉందని మేకర్స్ భావిస్తున్నారు. అయితే దాని చిత్రం గా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా రిలీజ్ డేట్ పై రోజుకో వార్త నెట్టింట వినిపిస్తుంది.. తాజాగా మూవీకి రిలీజ్ డేట్ ని లాక్ చేసినట్లు కోలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.. ముందుగా అందరూ అనుకున్నట్లుగానే జూన్ మొదటి వారంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని అందరూ అనుకున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం జూన్ 11న సినిమాని రిలీజ్ చేసేందుకు మేకర్ సన్నహాలు చేస్తున్నట్లు సమాచారం. మరి ఈ రిలీజ్ డేట్ ఎంత వరకు నిజమో తెలియాలంటే చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే..

విడుదలకు సిద్ధమవుతున్న జైలర్ 2

గతంలో వచ్చిన జైలర్ మూవీ 2023 ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఆ మూవీకి సీక్వెల్ గా వస్తున్న ఈ మూవీ ని కూడా.. అదే నెలలో రిలీజ్ చేస్తే మంచి హిట్ అందుకోవడంతో పాటుగా కలెక్షన్లను వసూలు చేస్తుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. 2026 ఆగస్టు 12 లేదా 14న, స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రిలీజ్ చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.. త్వరలోనే రిలీజ్ డేట్ పై ఒక ప్రకటన రాబోతుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్.. ఇక ఈ సెకండ్ పార్ట్ లో శివరాజ్ కుమార్, మోహన్ లాల్ తిరిగి కనిపించనున్నారని చెబుతున్నారు. అలాగే బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ కూడా గెస్ట్ రోల్లో ఉంటారని తెలుస్తుంది.. కోలీవుడ్లో 1000 కోట్ల క్లబ్లో చేరే సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.. మరి ఈ సినిమా ఈసారి ఏమాత్రం రికార్డులను బ్రేక్ చేస్తుందో చూడాలి.

జైలర్ 2 విడుదల తేదీపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కానీ జూన్ 11న విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం కోసం ఎదురుచూడాల్సిందే.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.