|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

వారణాసిపై నిక్ జోనాస్ సంచలన వ్యాఖ్యలు! రాజమౌళి క్రేజ్ చూస్తే షాక్!

Published: 10-02-2026, 6:05 AM
వారణాసిపై నిక్ జోనాస్ సంచలన వ్యాఖ్యలు! రాజమౌళి క్రేజ్ చూస్తే షాక్!
  • రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న వారణాసి సినిమాపై నిక్ జోనాస్ ప్రశంసలు కురిపించారు.
  • RRR సినిమా తర్వాత వారణాసి సినిమా అద్భుతంగా ఉండబోతుందని నిక్ జోనాస్ అన్నారు.
  • వారణాసి సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది.
  • ప్రియాంక చోప్రా చాలా సంవత్సరాల తర్వాత రాజమౌళి సినిమాతో ఇండియన్ ఇండస్ట్రీకి తిరిగి వస్తున్నారు.

రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వస్తున్న వారణాసి సినిమాపై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ సినిమా గురించి ప్రియాంక చోప్రా భర్త నిక్ జోనాస్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. సినిమా అద్భుతంగా ఉండబోతుందని ఆయన అన్నారు.

వారణాసి సినిమాపై నిక్ జోనాస్ కామెంట్స్

Nick Jonas: రాజమౌళి డైరెక్షన్ లో సినిమా వస్తుంది అంటే ఆ సినిమాకు గ్లోబల్ రేంజ్ లో మంచి ఆదరణ లభిస్తుంది. ఇదివరకే రాజమౌళి డైరెక్షన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన RRR సినిమా అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా ఏకంగా ఆస్కార్ అవార్డును కూడా సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు రావడంతో ప్రస్తుతం చేయబోయే వారణాసి సినిమాపై కూడా అదే స్థాయిలో అంచనాలు ఉన్నాయి.

ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబు హీరోగా ఈ సినిమాని గ్లోబల్ రేంజ్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులలో చిత్ర బృందం ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు జోడిగా ప్రియాంక చోప్రా(Priyanka Chopra) హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈమె షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండగా ప్రియాంక చోప్రా భర్త నిక్ జోనస్ ఒక ఇంటర్వ్యూ సందర్భంగా వారణాసి సినిమా గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఒక ఇంటర్వ్యూలో నిక్ జోనాస్ మాట్లాడుతూ వారణాసి సినిమా అద్భుతంగా ఉండబోతుందని ప్రశంసలు కురిపించారు.

రాజమౌళి క్రేజ్ గురించి నిక్ ఏమన్నారంటే?

రాజమౌళి డైరెక్షన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన RRR సినిమా తర్వాత వారణాసి రాబోతుందని, ఈ సినిమా అద్భుతంగా ఉండబోతున్నట్టు ప్రశంసించారు ఆధ్యాత్మిక వైభవం సంస్కృతికి ఫిదా అయిన నిక్ మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గ్లోబల్ స్టార్ గా కొనసాగుతున్న నిక్ జోనాస్ రాజమౌళి గురించి ఆయన సినిమా గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అంటే రాజమౌళి క్రేజ్ ఏ స్థాయిలో ఉందో స్పష్టం అవుతుంది. ప్రస్తుతం ఈ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణను హైదరాబాదులో షూట్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ షూటింగ్లో భాగంగా ప్రియాంక చోప్రా పై కూడా కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.

గ్లోబల్ రేంజ్ లో రిలీజ్..

హైదరాబాద్‌లో వారణాసి షూటింగ్

ఇక ప్రియాంక చోప్రా హాలీవుడ్ నటుడు పాప్ సింగర్ అయిన నిక్ జోనాస్ ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇలా పెళ్లి తర్వాత ప్రియాంక చోప్రా కూడా హాలీవుడ్ సినిమాలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా ఉన్నారు. చాలా సంవత్సరాల తర్వాత ఈమె ఇండియన్ సినిమాకు అది రాజమౌళి సినిమాకు కమిట్ కావడంతో ప్రియాంక చోప్రా పేరు ఇండియన్ సినీ ఇండస్ట్రీలో మారుమోగుతుంది. ఇక ప్రియాంక చోప్రా వారణాసి సినిమాలో భాగం కావడంతో ఈమె భర్త నిక్ జోనాస్ సైతం వారనాసి సినిమా గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమా 2027 ఏప్రిల్ ఏడో తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఏకంగా గ్లోబల్ రేంజ్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

మొత్తానికి నిక్ జోనాస్ వారణాసి సినిమా గురించి మాట్లాడటంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా గ్లోబల్ స్థాయిలో ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.