|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

జైలర్ 2లో షాకింగ్ బాలీవుడ్ ఎంట్రీ! రజినీకాంత్ సరసన స్టార్ హీరో ఫిక్స్!

Published: 25-12-2025, 8:36 AM
జైలర్ 2లో షాకింగ్ బాలీవుడ్ ఎంట్రీ! రజినీకాంత్ సరసన స్టార్ హీరో ఫిక్స్!
  • రజినీకాంత్ ‘జైలర్’ విజయవంతం కావడంతో ‘జైలర్ 2’పై అంచనాలు భారీగా పెరిగాయి.
  • నటుడు మిథున్ చక్రవర్తి ‘జైలర్ 2’లో ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు.
  • షారుక్ ఖాన్, మోహన్ లాల్, రమ్యకృష్ణ, శివరాజ్ కుమార్ లు స్పెషల్ రోల్స్‌లో కనబడనున్నారు.
  • మిథున్ ఇంటర్వ్యూతో షారుక్ ఖాన్ ‘జైలర్ 2’లో భాగమైనట్లు అధికారికంగా ధృవీకరించబడింది.

సూపర్ స్టార్ రజినీకాంత్ ‘జైలర్’ భారీ విజయం తర్వాత, ఇప్పుడు ‘జైలర్ 2’పై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించి మిథున్ చక్రవర్తి ఓ అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు. బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్, మోహన్ లాల్ వంటి బడా నటులు ఇందులో కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.

రజినీకాంత్ జైలర్ 2పై భారీ అంచనాలు

సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన ఏ సినిమా చేసినా బంపర్ హిట్ కావడం గ్యారంటీ. ఏజ్ పైబడిన కూడా వరుసగా సినిమాలు చేసుకుంటే ముందుకు సాగుతున్నారు రజినీకాంత్. అయితే అలాంటి రజినీకాంత్ జైలర్ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ గ్రాండ్ సక్సెస్ కావడంతో కోట్ల వర్షం కురిసింది. ఇక త్వరలో జైలర్ 2 సినిమా కూడా వస్తోంది. ఈ సినిమా పైన కూడా భారీగా అంచనాలు పెరిగిపోయాయి.

మిథున్ చక్రవర్తి షాకింగ్ అప్డేట్

ఇలాంటి నేపథ్యంలోనే ఈ జైలర్ 2 గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మిథున్ చక్రవర్తి. ఈ సినిమాలో మిథున్ చక్రవర్తి ప్రత్యేక పాత్రలో కనిపిస్తారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. జైలర్ 2 సినిమాలో అన్ని చిత్ర పరిశ్రమలకు చెందిన బడా నటీనటులు కనిపించబోతున్నట్లు తెలిపారు. షారుక్ ఖాన్, మోహన్ లాల్, రమ్యకృష్ణ అలాగే శివరాజ్ కుమార్ లు స్పెషల్ రోల్ లో కనిపిస్తారని ఆయన వెల్లడించారు. దీంతో ఈ ప్రాజెక్టులో షారుక్ ఖాన్ ఉన్నట్లు అధికారికంగా ప్రకటన చేసినట్లు అయింది.

జైలర్ 2లో మల్టీస్టారర్ సందడి

Related News : దేవర 2 నుంచి బిగ్ అప్డేట్‌…ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పండ‌గే

మిథున్ చక్రవర్తి వెల్లడించిన ఈ భారీ స్టార్ క్యాస్ట్ తో ‘జైలర్ 2’పై అంచనాలు మరింత పెరిగాయి. రజినీకాంత్ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ ఖాయం కావడంతో, అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపయింది. సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.