|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

వారణాసికి జేమ్స్ కామెరూన్ ఫిదా! రాజమౌళి సంచలన అప్‌డేట్!

Published: 17-12-2025, 5:24 AM
వారణాసికి జేమ్స్ కామెరూన్ ఫిదా! రాజమౌళి సంచలన అప్‌డేట్!
  • రాజమౌళి-మహేష్ బాబు ‘వారణాసి’ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
  • హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్‌తో రాజమౌళి ముచ్చట్లు వైరల్ అయ్యాయి.
  • వారణాసి షూటింగ్ సగభాగం పూర్తైందని, 7-8 నెలల్లో ముగుస్తుందని రాజమౌళి తెలిపారు.
  • కీరవాణి వెల్లడించిన ప్రకారం, ‘వారణాసి’ 2027 సమ్మర్‌లో విడుదల కానుంది.

రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో వస్తున్న వారణాసి సినిమాపై ఉత్కంఠ నెలకొంది. తాజాగా హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్‌తో రాజమౌళి చిట్‌చాట్ చేశారు. ఈ సందర్భంగా వారణాసి షూటింగ్ అప్‌డేట్‌తో పాటు 2027 విడుదల తేదీని రాజమౌళి వెల్లడించారు. ఈ వార్త అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది.

జేమ్స్ కామెరూన్‌తో రాజమౌళి చిట్‌చాట్

Varanasi Film: రాజమౌళి దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం వారణాసి(Varanasi). రాజమౌళి (Rajamouli)దర్శకత్వంలో మహేష్ బాబు మొదటిసారి హీరోగా నటిస్తున్న ఈ సినిమా పట్ల ఎన్నో అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో చిత్ర బృందం ఎంతో బిజీగా ఉన్నారు. సాధారణంగా రాజమౌళి సినిమా అంటేనే రెండు మూడు సంవత్సరాలు సమయం పడుతుందనే భావన ప్రతి ఒక్కరిలోను ఉంది. ఇక వారణాసి కోసం కూడా ఇలాంటి ఎదురుచూపులు తప్పవని అభిమానులు కూడా భావిస్తున్నారు. ఇలాంటి తరుణంలోనే ఈ సినిమా విడుదల గురించి ఇటీవల గ్లోబ్ ట్రాటర్ వేడుకలో భాగంగా కీరవాణి వెల్లడించారు. ఈ సినిమాని 2027 సమ్మర్లో విడుదల చేయబోతున్నామని క్లారిటీ ఇచ్చారు.

ఇక రాజమౌళి కూడా జెట్ స్పీడ్ లో ఈ సినిమా షూటింగ్ పనులను చేస్తున్నట్టు సమాచారం అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ గురించి రాజమౌళి ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు. హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ (James Cameron) దర్శకత్వంలో తెరికెక్కిన అవతార్ ఫైర్ అండ్ యాష్ డిసెంబర్ 19వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్లను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే రాజమౌళితో చిట్ చాట్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో భాగంగా జేమ్స్ కెమెరూన్ రాజమౌళిని వారణాసి సినిమా గురించి కొన్ని ప్రశ్నలు అడిగి సినిమా అప్డేట్స్ తెలుసుకున్నారు.

వారణాసి షూటింగ్ ప్రగతి వివరాలు

ఈ నేపథ్యంలోనే రాజమౌళి సినిమా షూటింగు గురించి అప్డేట్ తెలియజేస్తూ..ఈ సినిమా దాదాపు సగభాగం షూటింగ్ పూర్తి అయిందని, రాబోయే 7 – 8 నెలలలో ఈ సినిమా షూటింగ్ పూర్తి అవుతుందని రాజమౌళి తెలియజేశారు. ఇక జేమ్స్ కామెరూన్ ఈ సినిమాలో టైగర్ తో ఫన్నీ సన్నివేశాలను షూట్ చేసేటప్పుడు తప్పనిసరిగా నన్ను కూడా పిలువు అంటూ ఈ సందర్భంగా మాట్లాడారు. ఇలా వీరిద్దరి మధ్య వారణాసి సినిమాకు సంబంధించి పలు చర్చలు జరిగినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

గ్లోబల్ రేంజ్ లో వారణాసి..

గ్లోబల్ రేంజ్‌లో రాజమౌళి క్రేజ్

హాలీవుడ్ ఇండస్ట్రీలో దిగ్గజ దర్శకుడిగా పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న జేమ్స్ కామెరూన్ స్వయంగా రాజమౌళితో కలిసి తన సినిమాను ప్రమోట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. హాలీవుడ్ రేంజిలో రాజమౌళికి ఎలాంటి క్రేజ్ ఉందో స్పష్టం అవుతుంది. ఈ నేపథ్యంలోనే రాజమౌళి కూడా వారణాసి సినిమాని గ్లోబల్ రేంజ్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సందర్భంగా మరికొన్ని నెలలలో వారణాసి సినిమా షూటింగ్ పూర్తి కాబోతుందనే విషయం తెలియడంతో మహేష్ అభిమానుల ఆనందానికి అవధులు లేవు. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు ఐదు విభిన్నమైన పాత్రలలో కనిపించబోతున్నారని తెలుస్తోంది.

జేమ్స్ కామెరూన్ వంటి దిగ్గజ దర్శకుడు రాజమౌళి సినిమా గురించి ఆరా తీయడం, అప్డేట్స్ తెలుసుకోవడం గ్లోబల్ స్థాయిలో రాజమౌళి క్రేజ్‌ని నిరూపిస్తుంది. వారణాసి సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఎదురుచూపులు మరింత పెరిగాయని చెప్పాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.